తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi February 3rd Episode: రుద్రాణికి దెబ్బేసిన స్వప్న.. మోడ్రన్‌గా తయారైన కావ్య.. పులివేషంలా ఉందన్న కల్యాణ్

Brahmamudi February 3rd Episode: రుద్రాణికి దెబ్బేసిన స్వప్న.. మోడ్రన్‌గా తయారైన కావ్య.. పులివేషంలా ఉందన్న కల్యాణ్

Sanjiv Kumar HT Telugu

03 February 2024, 7:19 IST

google News
  • Brahmamudi Serial February 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌‌లో కావ్యను చాలా అందంగా, మోడ్రన్‌గా రెడీ చేస్తుంది స్వప్న. మరోవైపు కస్టమర్ పాపను కాపాడేందుకు అప్పు కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌‌
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌‌

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 3వ తేది ఎపిసోడ్‌‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పిజ్జా డెలివరీకి వెళ్లిన అప్పు కస్టమర్ వాళ్ల పాపను కిడ్నాప్ చేస్తారు. పాపను కాపాడేందుకు తన ఫ్రెండ్స్ ముగ్గురికి ఓ స్కూల్ పేరు చెప్పి మూడు ఏరియాల్లో ఉన్న స్కూల్‌లోకి వెళ్లమంటుంది అప్పు. దాంతో ఆ ముగ్గురు వెళ్తారు. నా ఫ్రెండ్స్‌కు చెప్పాను. వాళ్లు వెళ్లి పాప ఎక్కడుందో కనుక్కుంటారు అని అప్పు అంటుంది. దాంతో ఆమె చేతులెత్తి మొక్కి థ్యాంక్స్ చెబుతుంది.

ఒకదానిపై ఒకటి

నాకంటే పెద్దవారు. దండం పెట్టడం ఎందుకులెండి. మీరు కంగారుపడకండి అని ధైర్యం చెబుతుంది అప్పు. మరోవైపు ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తుంది కావ్య. ఇంతలో మేడమ్ పార్సల్ అని కొరియర్ బాయ్ వస్తాడు. ఇంతమంది మేడమ్‌లో ఏ మేడమ్‌కి అని రుద్రాణి అంటే.. నేను వెళ్లి చూస్తాను అని కల్యాణ్ అంటాడు. కల్యాణ్‌కు ఒకదానిపై ఒకటి పార్సల్ ఇస్తూనే ఉంటాడు కొరియర్ బాయ్. దాంతో కల్యాణ్ తలవరకు పార్సల్స్ ఉంటాయి. ఎవరికీ వచ్చిందే పేరు చూస్తానని రాహుల్ వెళ్లి చూస్తాడు.

పార్సల్స్‌పై రుద్రాణి పేరు చూసి షాక్ అవుతాడు రాహుల్. అప్పుడే వచ్చిన స్వప్న అవాక్కయ్యవా అంటుంది. అవాక్కులు, చవాక్కులు కాదు ఎవరికి వచ్చిందో చెప్పమని అంతా అడుగుతారు. రాహుల్ సైలెంట్‌గా ఉంటే.. రుద్రాణి వెళ్లి చూస్తుంది. తన పేరు చూసి షాక్ అవుతుంది. నా పేరు మీదే వచ్చింది. కానీ నేను బుక్ చేయలేదంటుంది. బిల్ ఎంతైందని రాహుల్ అడిగితే.. 70 వేలు అయిందని, అది కూడా కట్టేసారని కొరియర్ బాయ్ చెబుతాడు.

70 వేల ఆర్డర్

పేరు మీదే. కానీ, మీరు బుక్ చేయలేదు నేను ఆర్డర్ పెట్టాను అని స్వప్న అంటుంది. మరి నా పేరు ఎందుకు పెట్టావ్ అని రుద్రాణి అడిగితే.. ఆ 70 వేలు మీ క్రెడిట్ కార్డ్‌తో కట్టాను. అందుకే మీ పేరు పెట్టాను అని స్వప్న అంటుంది. దాంతో రుద్రాణి మరింత షాక్ అవుతుంది. ఇందిరాదేవి, అపర్ణ నవ్వుకుంటారు. ఇప్పుడు అంత అవసరం ఏముందని రుద్రాణి అరుస్తుంది. నాకు కాదు. కావ్యకు అని స్వప్న అంటుంది. ఇంతలో పైనుంచి రాజ్ కిందకు వస్తాడు.

నా చెల్లిని ఎవరో అప్పలమ్మలా ఉన్నావని కామెంట్ చేశాడు. నా చెల్లిన అంతమాట అంటే ఊరుకుంటానా అందుకే ఇలా ఆర్డర్ పెట్టాను అని స్వప్న అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. నా కోడలిని అంతమాట అంటాడా ఎవడు ఆడు అని సుభాష్ ఫైర్ అవుతాడు. అతను రాజ్‌కు బాగా తెలుసు అంకుల్ అని స్వప్న అంటుంది. ఎవర్రా రాజ్ వాడు. నా కోడలిని అన్న వాడిపై రివేంజ్ తీసుకుంటాను అని సుభాష్ అంటే.. అంకుల్ రివేంజ్ అవరం లేదు రిటాట్ ఇద్దాం. నా చెల్లి రెడీ అవుతే ఎలా ఉంటుందో చూపిద్దాం అని స్వప్న అంటుంది.

స్వప్నకు సపోర్ట్

ఎమంటావ్ రాజ్ అని స్వప్న అంటే.. ఆ.. ఆ.. అది నాకు ఆఫీస్‌కు టైమ్ అవుతుంది. నేను వెళ్తున్నాను అని కంగారుగా జారుకుంటాడు రాజ్. కావ్య కోసం ఇలా చేసినందుకు నా ఫుల్ సపోర్ట్ నీకే స్వప్న అని ఇందిరాదేవి అంటుంది. థ్యాంక్యు అమ్మమ్మ అన్న స్వప్న కావ్యను రెడీ చేసేందుకు పైకి తీసుకెళ్తుంది. వాడెవడో కావ్యను కామెంట్ చేయడమేంటో.. అది స్వప్నకు కాలి.. రివేంజ్‌కు బదులు రిటాట్ ఇద్దామనుకోవడం ఏంటో.. ఫైనల్‌గా నాకు 70 వేలు బొ.. డ్యాష్ పడటం ఏంటో అని రుద్రాణి బాధపడుతుంది.

స్వప్న నా కోడలి కోసం తీసుకుందిగా.. ఆ డబ్బు నేను ఇస్తానులే అని అపర్ణ అంటుంది. దాంతో రిలీఫ్‌గా ఫీల్ అయిన రుద్రాణి థ్యాంక్స్ వదినా అంటుంది. నా కోడలి కోసం అని స్వప్న చెబితే క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇచ్చేవాన్ని అని సుభాష్ అంటాడు. మీరు కోటీశ్వరులు ఇస్తారు. నాకు అయితే సేఫ్ అయిందని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ కాల్ కోసం ఎదురుచూస్తుంటుంది అప్పు. ఇంతలో ముగ్గురు కాల్ చేసి చేస్తారు. ఇద్దరు స్కూల్ ఎదురుగా పాత ఇల్లు లేదని అంటారు. ఒక ఫ్రెండ్ మాత్రం ఉందని, అందులో ఇద్దరు రౌడీలా ఉన్నారని చెబుతాడు.

వాళ్లవి దిష్టి కళ్లు

దాంతో అక్కడే పాప ఉంటుందని కస్టమర్‌ను తనతోపాటు తీసుకెళ్తుంది అప్పు. మరోవైపు కావ్య కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఇంతసేపు చేస్తుందేంటీ అని రుద్రాణి అంటుంది. కొత్త కోడలికి చేయాల్సింది చేయకుండా పాత కోడలికి చేస్తున్నారని ధాన్యం అంటే.. ప్రకాశం కౌంటర్స్ వేస్తాడు. తర్వాత కావ్యను కిందకు తీసుకొస్తుంది స్వప్న. అందరూ చూసి అవాక్కవుతారు. నచ్చనివాళ్లవి దిష్టి కళ్లు, నచ్చినవాళ్లవి ఆశీర్వదించే కళ్లు అని స్వప్న అంటుంది. దాంతో నోరు కట్టేసిందిగా అని రుద్రాణి అనుకుంటుంది.

అంతా బాగుందని అంటారు. స్వప్నను మెచ్చుకుంటారు. దిష్టి కళ్లు అనుకున్నా సరే నాకు మాత్రం నచ్చలేదు. పద్ధతిగా ఉండాల్సిన దుగ్గిరాల కోడలు ఇలా వెళ్తే ముక్కున వేలు వేసుకోరు. ఇలానే ఆఫీస్‌కు వెళ్తే ఎలా అని ధాన్యలక్ష్మీ అంటుంది. వెళ్తే తప్పేంటీ.. అక్కడికి గొప్పవాళ్లు వస్తారు. ముక్కున వేలు వేసుకునేందుకు మీ ఊరిలోని అమ్మలక్కలు కాదు అని చెప్పిన అపర్ణ స్వప్న దగ్గరికి వెళ్లి బాగా రెడీ చేశావ్ అని మెచ్చుకుంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ కోపంగా వెళ్లిపోతుంది.

పులి వేషం వేసినట్లు

అందరికీ నచ్చింది కానీ, ఒక్కరికే నచ్చలేదు. అది కావ్య వదినకే. పులి వేషం వేసినట్లు ఫీల్ అవుతుంది అని కల్యాణ్ అంటాడు. నువ్ కరెక్ట్‌గా చెప్పావ్ కల్యాణ్. దానికి అస్సలు ఇష్టం లేదు. కానీ రాజ్ మోడ్రన్‌గా ఉండాలన్నాడట అందుకే రెడీ చేశాను అని స్వప్న అంటుంది. కావ్య మోడ్రన్‌గా ఉండాలని రాజ్ అనుకున్నాడా అని అపర్ణ డౌట్ పడుతుంది. భర్తకు నచ్చినట్లు ఉండటం ధర్మమే కదా అని ఇందిరాదేవి అంటుంది.

మరోవైపు కిడ్నాపర్స్ ఉన్న చోటికి అప్పు వాళ్లు వెళ్తారు. ఇంట్లోకి అప్పు, కస్టమర్ మేడమ్ వెళ్తారు. ఒక రౌడీ బిర్యానీ తీసుకొస్తా. పాప జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. మిగతా ఇద్దరూ రౌడీలు మొబైల్ చూసుకుంటూ ఉంటారు. దాంతో వెనుక నుంచి మెల్లిగా లోపలికి వెళ్తారు. అక్కడ పాప ఉన్న గదిలోకి వెళ్లి పాపను చూస్తారు. బ్రహ్మముడి సీరియల్ తర్వాతి ఎపిసోడ్‌లో పాపను అప్పు కాపాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫీస్‌లో శ్వేతను కావ్య కలుస్తుంది. మనం డైరెక్ట్‌గా కలవడం ఇదే తొలిసారి కదా అని శ్వేత అంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం