Captain Miller OTT Release Date: ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే -తెలుగు, తమిళంలో ఒకేరోజు రిలీజ్
Captain Miller OTT Release Date: ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Captain Miller OTT Release Date: సంక్రాంతికి కోలీవుడ్‌లో రిలీజైన ధనుష్ కెప్టెన్ మిల్లర్ వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కెప్టెన్ మిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో కెప్టెన్ మిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
కెప్టెన్ మిల్లర్ కలెక్షన్స్...
సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ వరల్డ్ వైడ్‌గా 100 కోట్లకుపైగా గ్రాస్‌ను, 45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమాపై ఉన్న బజ్ కారణంగా రెండు వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ధనుష్ యాక్టింగ్ బాగున్నా కథలో బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
తమిళంలో వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజవ్వగా...కేవలం కోటి వరకు మాత్రమే వసూళ్లు వచ్చాయి. తెలుగు నేటివిటీకి దూరంగా సాగడమే పరాజాయానికి కారణంగా నిలిచింది. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఓటీటీ వెర్షన్ మాత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్నట్లు సమాచారం.
కెప్టెన్ మిల్లర్ కథ ఇదే...
కెప్టెన్ మిల్లర్ సినిమాలో అగ్నీశ్వర అలియాస్ అగ్నిఅనే పాత్రలో ధనుష్ నటించాడు. ఊరిలో కులవివక్షను భరించలేక బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా చేరిన అగ్ని అక్కడి నుంచి పారిపోయి ఎందుకు దొంగగా మారాడు. అగ్నిని చంపాలని బ్రిటీష్ సైన్యం ఎందుకు ప్రయత్నించింది?
కుల వివక్షతో పాటు తన ఊరిలోని గుడి కోసం అగ్ని ఎలాంటి పోరాటం సాగించాడు అనే కథతో కెప్టెన్ మిల్లర్ సినిమాను డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించాడు. తమిళంలో సానికాయిధాన్, రాకీ తర్వాత అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన మూడో సినిమా ఇది. కెప్టెన్ మిల్లర్‌కు సెకండ్ పార్ట్ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కెప్టెన్ మిల్లర్‌లో శివరాజ్‌కుమార్...
కెప్టెన్ మిల్లర్ సినిమాలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ హీరో సందీప్‌కిషన్ గెస్ట్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌మోహన్, మాళవికా సతీషన్ హీరోయన్లుగా నటించారు. కెప్టెన్ మిల్లర్ తర్వాత శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తోన్నాడు ధనుష్. ఈ సినిమాలో నాగార్జున మరో హీరోగా నటిస్తున్నాడు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ధారావి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మల్టీస్టారర్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.