Dubbing Movies: కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ పోస్ట్‌పోన్ ఎఫెక్ట్ - త‌మిళంలో హ‌నుమాన్‌, సైంధ‌వ్‌ల‌కు దొర‌క‌ని థియేట‌ర్లు-captain miller ayalaan telugu version out of sankranthi race theaters issues for saindhav hanuman tamil versions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dubbing Movies: కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ పోస్ట్‌పోన్ ఎఫెక్ట్ - త‌మిళంలో హ‌నుమాన్‌, సైంధ‌వ్‌ల‌కు దొర‌క‌ని థియేట‌ర్లు

Dubbing Movies: కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ పోస్ట్‌పోన్ ఎఫెక్ట్ - త‌మిళంలో హ‌నుమాన్‌, సైంధ‌వ్‌ల‌కు దొర‌క‌ని థియేట‌ర్లు

Nelki Naresh Kumar HT Telugu
Jan 09, 2024 10:13 AM IST

Dubbing Movies: సంక్రాంతి బ‌రిలో నుంచి ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌, శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. తెలుగులో ఈ సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క్క‌పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ సైంధ‌వ్‌, హ‌నుమాన్ సినిమాల‌పై ప‌డిన‌ట్లు స‌మాచారం.

ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌
ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌

Dubbing Movies: తెలుగులో సంక్రాంతి బ‌రి నుంచి ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌, శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ త‌ప్పుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతి వీక్ కాకుండా వారం ఆల‌స్యంగా ఈ సినిమాలు తెలుగు ప్రేక్ష‌క‌లు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సంక్రాంతికి తెలుగులో మ‌హేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ‌, వెంక‌టేష్ సైంధ‌వ్‌తో పాటు తేజా స‌జ్జా హ‌నుమాన్ రిలీజ్ అవుతోన్నాయి.

ఈ స్ట్రెయిట్ సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌డం స‌మ‌స్య‌గా మారింది. దాంతో డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించ‌డం క‌ష్టం కావ‌డంతో కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్స్ రిలీజ్ పోస్ట్‌పోన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 19న కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ తెలుగులో ఈ సినిమా రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ డ‌బ్బింగ్ సినిమాల‌ పోస్ట్‌పోన్‌పై రేపు లేదా ఎల్లుండి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. డ‌బ్బింగ్ సినిమాలు పోస్ట్‌పోన్ కావ‌డంతో స్ట్రెయిట్ సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది.

కోలీవుడ్ రివేంజ్‌...

ధ‌నుష్, శివ‌కార్తికేయ‌న్ సినిమాలు తెలుగు వెర్ష‌న్స్‌ పోస్ట్‌పోన్ ఎఫెక్ట్ సైంధ‌వ్‌, హ‌నుమాన్‌ల‌పై ప‌డిన‌ట్లు స‌మాచారం. త‌మ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో కోపంగా ఉన్న త‌మిళ నిర్మాత‌లు తెలుగు సినిమాల‌కు థియేట‌ర్ల కేటాయింపు విష‌యంలో అడ్డంకుల‌ను సృష్టిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హ‌నుమాన్‌, సైంధవ్‌ల‌కు ముందుగా ఒప్పుకున్నవాటి కంటే త‌క్కువ సంఖ్య‌లోనే థియేట‌ర్ల‌ను కేటాయించాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు తెలిసింది.

న‌ల‌భై లోపే...

హ‌నుమాన్ త‌మిళ వెర్ష‌న్‌కు న‌ల‌భై కంటే త‌క్కువే థియేట‌ర్లు దొరికే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. సైంధ‌వ్‌కు అంత‌కంటే త‌క్కువే థియేట‌ర్లు ల‌భించ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతే కాకుండా చెన్నైలో గుంటూరు కారం తెలుగు వెర్ష‌న్ రిలీజ్ కానుంది. మ‌హేష్ గ‌త సినిమాల‌తో పోలిస్తే త‌క్కువ థియేట‌ర్ల‌లోనే గుంటూరు కారం రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కోలీవుడ్ రివేంజ్‌పై టాలీవుడ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల్ని తెలుగు ఆడియెన్స్ ఆద‌రిస్తుంటే అక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్‌గా ఉంద‌ని అంటున్నారు. తెలుగు హీరోల సినిమాల‌కు థియేట‌ర్లు కూడా ఇవ్వ‌డం లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌...

దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో కెప్టెన్ మిల్ల‌ర్ సినిమా రూపొందింది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీకి అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిష‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఐమాక్స్ ఫార్మెట్‌లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. మ‌రోవైపు శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న‌ది. ఎలియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయ‌లాన్ సినిమాల‌కు ఆర్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024