Brahmamudi November 15th Episode: బ్రహ్మముడి - కావ్యపై రాజ్ దొంగ ప్రేమ - తుస్సుమన్న దుగ్గిరాల వారసుడి బిల్డప్‌లు
15 November 2024, 9:24 IST
Brahmamudi :బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్‌లో కావ్య కంపెనీకి దక్కిన కాంట్రాక్ట్‌ను ఎలాగైనా చెడగొట్టేయాలని ఫిక్సవుతుంది అనామిక. రాజ్, కావ్య గొడవలు పడి విడిపోయారని, ఈ గొడవల వల్లే రాజ్‌ను సీఈవో పదవి నుంచి తీశారనని కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తిని కలిసి బురిడీ కొట్టిస్తుంది అనామిక.
బ్రహ్మముడి నవంబర్ 15 ఎపిసోడ్
కావ్య తన క్యాబిన్‌లోకి వెళ్లబోతుంది. ఆమెను రాజ్ అడ్డుకుంటాడు. ఈ క్యాబిన్ సీఈవో మాత్రమే వాడాలని అంటాడు. నేను సీఈవోనే కదా అని కావ్య అంటుంది. అది నిన్నటి వరకు అని రాజ్ బదులిస్తాడు. తాతయ్య కట్టిన పందెంలో గెలిచిన వాళ్లే సీఈవో అవుతారని, అప్పటివరకు నువ్వు వేరే క్యాబిన్‌లో కూర్చోవాలని కావ్యకు ఆర్డర్ వేస్తాడు రాజ్.
పోటీలో గెలిచే వరకు పాతవాళ్లే పదవిలో ఉంటారు మిస్టర్ భూత్ బంగ్లా అంటూ రాజ్‌పై సెటైర్లు వేస్తుంది కావ్య. ఈ పోటీలో గెలిచేది నేనే...ఓడిపోయేది నువ్వే...చివరిసారిగా నీ సీట్‌ను చూసుకో అంటూ కావ్యకు దారి ఇస్తాడు.
రాజ్‌కు పంచ్...
స్టాఫ్ అందరిని మీటింగ్‌కు రమ్మని అంటాడు రాజ్. రేపటి నుంచి నియంతృత్వ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం రాబోతుందని , వెట్టిచాకిరి వ్యవస్థ నుంచి బయటపడి స్వేచ్ఛగా ఆఫీస్‌లో అడుగుపెట్టవచ్చని రాజ్ అంటాడు. అంటే రేపటి నుంచి ఆఫీస్‌కు మీరు రావడం లేదా ఎంప్లాయ్స్‌లోని ఓ వ్యక్తి రాజ్‌పై సెటైర్‌వేస్తాడు.
రాజ్‌కు హ్యాండిచ్చిన టీమ్...
ఒక మహిళ అహంకారం, అధికారం కింద పురుషుల ఉనికి తొక్కివేయబడుతుందని రాజ్ స్పీచ్ ఇస్తాడు. మహిళా పాలననను నిరసిస్తూ తాను చేసిన ఉద్యమం ఫలించిందని, ఛైర్మన్‌గారు ఓ పోటీ పెట్టారని అంటాడు. ఈ పోటీలో తాను కావ్యతో పోటీపడనున్నట్లు చెబుతాడు.
ఈ పోటీలో తనకు సపోర్ట్ ఇచ్చేవారు తనవైపుకు రమ్మని ఎంప్లాయ్స్‌తో అంటాడు రాజ్. అందరూ రాజ్‌కు హ్యాండిచ్చి కావ్య వైపుకు వెళ్లడంతో రాజ్ షాకవుతాడు. చీటీలు వేసి తన టీమ్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు రాజ్.
అనామిక అబద్ధాలు...
కావ్య టీమ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చిన జగదీష్‌ప్రసాద్‌ను కలుస్తుంది అనామిక. స్వరూజ్ గ్రూప్‌కు కాంట్రాక్ట్ ఇచ్చి తప్పుచేశారని, మార్కెట్‌లో ఇప్పుడు ఆ కంపెనీ నంబర్ వన్ కాదని అతడితో చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీలో ఉన్న గొడవల వల్ల రాజ్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే కావ్యను సీఈవోను చేశారని చెబుతుంది.
రాజ్, కావ్య ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లుగా నమ్మిస్తున్నారని, కానీ వాళ్లు గొడవలు పడి చాలా రోజుల క్రితమే విడిపోయారని, కావ్య పుట్టింటి నుంచే ఆఫీస్‌కు వస్తుందని జగదీష్ ప్రసాద్ మాయ మాటలతో బోల్తా కొట్టిస్తుంది. కావ్యకు ఇచ్చిన మాట కంటే మీకు మీ పరువు ముఖ్యమని జగదీష్ ప్రసాద్‌తో అంటుంది.
మీరు ఓకే అంటే ఆ డిజైన్స్‌ను మా కంపెనీ వేస్తుందని జగదీష్ ప్రసాద్‌కు చెబుతుంది. కొంతం టైమ్ తీసుకొని తన నిర్ణయం చెబుతానని అనామికతో జగదీష్ ప్రసాద్ అంటాడు.
అసిస్టెంట్‌గా కళ్యాణ్...
ఆ తర్వాత కళ్యాణ్‌ను తన అసిస్టెంట్‌గా చేర్చుకోవడానికి లిరిసిస్ట్ లక్ష్మికాంత్ ఒప్పుకుంటాడు. తన దగ్గర గతంలో పనిచేసిన వాళ్లు నేను రాసిన పాటల్ని వాళ్లే రాసిననట్లుగా చెప్పుకొని తనకు బ్యాడ్‌నేమ్ తీసుకొచ్చారని లక్ష్మికాంత్ అంటాడు.
మూడేళ్లు తన దగ్గరే పనిచేస్తానని అగ్రిమెంట్ రాసివ్వమని అంటాడు. ఈ టైమ్‌లో సొంత ప్రయత్నాలు చేయద్దని కండీషన్ పెడతాడు. లిరిక్ రైటర్ పెట్టిన కండీషన్స్‌కు కళ్యాణ్ ఒప్పుకుంటాడు. అగ్రిమెంట్‌పై సంతకం పెడతాడు.
రాజ్ ఆఫర్స్...
తనను పోటీలో గెలిపిస్తే అందరికి బోనస్‌లు ఇస్తానని, హౌజింగ్ సొసైటీ పెట్టి ఇళ్లు కట్టిస్తానని ఆఫర్స్ ప్రకటిస్తాడు. రాజ్ ఆఫర్స్‌తో ఎంప్లాయ్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మనమే పోటీలో గెలుస్తామని అంటారు. పోటీ కోసం తొందరపడి పనిచేయద్దని, టైమ్ తీసుకొని అయినా మంచి డిజైన్స్ వేయమని తన టీమ్ మెంబర్స్‌కు సలహా ఇస్తుంది కావ్య. ఎదుటివాళ్లను ఓడించాలన్న ఆలోచనతో కాకుండా మనం గెలవాలనే తపనతో పనిచేయమని అంటుంది.
గెలుపులో న్యాయం ఉండాలి...
రాజ్‌పై మీరు గెలవాలంటే ఎంప్లాయ్స్ కి సేమ్ అలాంటి ఆఫర్స్ ప్రకటించమని కావ్యతో అంటుంది శృతి. సీఈవోగా అయినా...నేను మీలాంటి ఎంప్లాయ్‌ని మాత్రమేనని శృతితో కావ్య అంటుంది. రాజ్ ఎప్పటికైనా కంపెనీ వారసుడేనని చెబుతుంది.
వాగ్ధానాల్ని నిలబెట్టే సత్తా రాజ్‌కు ఉందని, కానీ తనకు లేదని అంటుంది. పిచ్చి పిచ్చి వాగ్ధానాలు చేసి ఆ తర్వాత వాటిని నెరవేర్చలేక వాళ్లను బాధపెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది కావ్య. మన గెలుపులో న్యాయం ఉండాలని, గెలిచిన తర్వాత మనకు అది ఆనందాన్ని ఇవ్వాలని చెబుతుంది.
కావ్యపై రాజ్ ప్రేమ...
రుద్రాణి చెప్పుడు మాటలు నమ్మిన ధాన్యలక్ష్మి తన ప్లాన్ అమలుచేయడం మొదలుపెడుతుంది. డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకి రాదు. ఆస్తి పంపకాలు చేయలేదని ధాన్యలక్ష్మి కోపంగా ఉన్నట్లుందని అపర్ణ అంటుంది.
అనామిక మాటలు నమ్మిన జగదీష్ ప్రసాద్ కావ్య, రాజ్‌లను కలవడానికి ఆఫీస్‌కు వస్తాడు. కావ్యకు, తనకు మధ్య గొడవలు ఉన్నాయన్నది అబద్ధమని అతడిని రాజ్ నమ్మిస్తాడు. గొడవలు ఉంటే కలిసి ఒకే ఆఫీస్‌లో ఎ లా పనిచేస్తామని చెబుతాడు. జగదీష్ ప్రసాద్ ముందు భార్యపై తనకు ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.