Brahmamudi November 13th Episode: బ్రహ్మముడి - రాజ్‌పై కావ్య డామినేషన్ - పందెంలో కొడుకు ఓటమి కోరుకున్న అపర్ణ
Brahmamudi November 13th Episode: బ్రహ్మముడి నవంబర్ 13 ఎపిసోడ్‌లో గుడి నగల డిజైన్ కాంట్రాక్ట్ విషయంలో రాజ్, కావ్య మధ్య పోటీపెడతాడు సీతారామయ్య. ఈ పోటీలో గెలిచినవారే సీఈవో సీట్‌లో కూర్చుంటారని అంటాడు. ఒకవేళ ఈ పోటీలో రాజ్ ఓడిపోతే కావ్యను తిరిగి ఇంటికి తీసుకురావాలని కండీషన్ పెడతాడు.
Brahmamudi November 13th Episode: కావ్య కంపెనీకి గుడికి నగలు డిజైన్ చేసే పెద్ద ఆర్డర్ వస్తుంది. ట్రెడిషనల్‌గా నగలను డిజైన్ చేయాలని సీతారామయ్య స్నేహితుడు జగదీష్ ప్రసాద్.... కావ్యతో చెబుతాడు. డిజైన్స్ నచ్చితే ఈ డీల్ మీకే ఇస్తానని అంటాడు. అతడి మాటలు విని కావ్య సంబరపడిపోతుంది. మరో కంపెనీ డిజైన్స్‌ను ఫైనల్ చేసి పంపేందుకు ఫైల్‌పై రాజ్ సంతకం అవుతుంది. కానీ కావ్యకు క్రెడిట్ దక్కకుండా ఫైల్ తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు రాజ్. ఆ ఫైల్ కోసం దుగ్గిరాల ఇంటికి ఆవేశంగా వస్తుంది కావ్య.
రాజ్‌తో తేల్చుకుంటా...
వచ్చి రావడంతోనే మీ మనవడు ఎక్కడున్నాడని ఇందిరాదేవిని కోపంగా అడుగుతుంది కావ్య. ఏమైందని ఇందిరాదేవి అడిగితే...ఆయనతోనే తేల్చేకోవాల్సిన విషయం ఒకటి ఉందని, మీరు పిలుస్తారా...నన్నే పిలవమంటారా అని కావ్య బదులిస్తుంది. రాజ్ కనిపించగానే సుగుణ గ్రూప్ వాళ్లకు డిజైన్స్ పంపించకుండా ఫైల్ తీసుకొని ఎందుకు ఇంటికొచ్చారని భర్తను నిలదీస్తుంది కావ్య.
ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకోవడం నాకు ఇష్టం లేదని రాజ్ అంటాడు. మీ ఇష్టాలు ఎవరికి కావాలి అని రాజ్‌పై డామినేషన్ చేస్తుంది. కంపెనీతో డీల్ వద్దని నాతో ఒక్క మాట చెప్పాలి...ఎందుకు చెప్పలేదు అని రాజ్‌ను నిలదీస్తుంది.
మిస్టర్ మేనేజర్...
నేను నిన్ను సుపీరియర్‌గా గుర్తించలేదని కావ్యకు బదులిస్తాడు రాజ్. సీఈవో సీట్‌లో ఎవరు ఉన్నా వారిని గౌరవించాలని రాజ్‌కు క్లాస్ ఇస్తుంది. నేను తీసుకునే నిర్ణయాల గురించి నా కింది స్థాయి ఉద్యోగులతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని తెలుసుకో మిస్టర్ మేనేజర్ రాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది కావ్య.
తాతయ్య ఇచ్చిన అలుసు...
ఈ అహంకారం నీకు తాతయ్య ఇచ్చిన అలుసు వల్ల వచ్చిందని కావ్యపై రాజ్ ఫైర్ అవుతాడు. నాది అహంకారం అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేనని కావ్య అంటుంది. నేను తీసుకున్న నిర్ణయం ఏది ఫెయిల్ కాలేదని మీకు తెలుసునని అంటుంది. నా చేతులు కట్టేసే అధికారం మీకు లేదని చెబుతుంది.
ఆఫీస్‌కు సంబంధించిన ఏ విషయంలోనూ రాజ్ తనకు సపోర్ట్ చేయడం లేదని సీతారామయ్యకు కావ్య కంప్లైంట్ ఇస్తుంది. చెబుతుంది. ఇంత పురుషఅహంకారం పనికిరాదని రాజ్ నిందలు వేస్తుంది. నీది స్త్రీ అహంకారం అని రాజ్ వాదిస్తాడు.
శత్రువులకే బాగా తెలుసు...
గుడికి సంబంధించిన డిజైన్స్ ఆర్డర్ తమ కంపెనీకి వచ్చిన సంగతి సీతారామయ్యకు చెబుతుంది కావ్య. రాజ్‌కు ఉన్న సమర్థత, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అతడు సపోర్ట్ చేస్తేనే ఈ కాంట్రాక్ట్ మనకు దక్కుతుందని కావ్య అంటుంది. నా కెపాసిటీ, టాలెంట్ ఏమిటో మీ కంటే నా శత్రువులకే బాగా తెలుసు తాతయ్యతో అంటాడు రాజ్. కావ్యను శత్రువు అంటే పళ్లు రాలగొడుతానని ఇందిరాదేవి, అపర్ణ రాజ్‌కు వార్నింగ్ ఇస్తారు.
రుద్రాణి ఫిట్టింగ్...
కంపెనీ నడిపించే సమర్థత కావ్య కంటే రాజ్‌కే ఎక్కువగా ఉందని రుద్రాణి అంటుంది. రాజ్‌ను కాదని డిజైన్స్ వేసే కావ్యకు అప్పగించి తప్పుచేశారని తల్లిదండ్రులపై ఫైర్ అవుతుంది. కావ్య కంపెనీకి అడుగుపెట్టగానే పదిహేను కోట్లు లాభాలు తెచ్చిపెట్టిన సంగతి రుద్రాణికి గుర్తుచేస్తుంది స్వప్న. పక్క కంపెనీని మోసం చేసి సంపాదించిన డబ్బు అదని రుద్రాణి నోటికి పనిచెబుతుంది. రాజ్ టాలెంట్‌తో పోలిస్తే ఇదెంతా అని కావ్యను చులకన చేసి మాట్లాడుతుంది.
కావ్యతో రాజ్ పోటీ...
టెంపుల్ కాంట్రాక్ట్ విషయంలో రాజ్, కావ్య మధ్య పోటీపెడతాడు సీతారామయ్య. ఈ డిజైన్స్ ఎవరు వేసి కాంట్రాక్ట్ మన కంపెనీ దక్కేలా చేస్తారో వాళ్లే సీఈవో సీట్‌లో కూర్చుంటారని సీతారామయ్య అంటాడు.
రాజ్ పోటీకి ఓకే చెబుతాడు. మీ మనవడు నా చేతిలో ఘోరంగా ఓడిపోతే అనామిక ఫేస్‌లా ఎలా డల్ అవుతాడో ముందే ఊహించుకుంటున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఛాలెంజ్‌కు ఒప్పుకుంటుంది. మీతో పోటీలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని అంటుంది. ఎవరి సాయం లేకుండా ప్రాజెక్ట్‌ను ఓకే చేయగలనని రాజ్‌కు సవాల్ చేస్తుంది.
గెలిచిన వారికి బహుమతి...
ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతి ఉండాలని సుభాష్ అంటాడు. పోటీలో గెలిచిన వాళ్లే సీఈవో సీట్‌లో కూర్చుంటారని మరోసారి సీతారామయ్య గుర్తుచేయగానే రాజ్ చప్పట్లు కొడతాడు. తన గెలుపును తానే సెలబ్రేట్ చేసుకున్నానని చెబుతాడు.
ఈ పోటీలో గెలిచి సీఈవో సీట్‌లో కూర్చునేది తానేనని అంటాడు. ఒకవేళ నువ్వు ఈ పోటీలో ఓడిపోతే కావ్యను భార్యగా మనస్ఫూర్తిగాఅంగీకరించి ఆమెను ఇంటికి తీసుకురావాలని సీతారామయ్య కండీషన్ పెడతాడు. రుద్రాణి ఫిట్టింగ్ పెట్టబోతుంది. అందరూ కలిసి ఆమె నోరు మూయిస్తారు.
రాజ్ కండీషన్...
రోజ్ ఓడిపోతాడని అనుమానంగా ఉందని అపర్ణ అంటుంది. మిగిలినవాళ్లు కూడా ఆమె మాటలే నిజమవుతాయని అనిపిస్తుందని అంటాడు. నేను ఓడిపోతే కావ్యను ఇంటికి తీసుకొస్తానని రాజ్ ఒప్పుకుంటాడు. కావ్య ఓడిపోతే జీవితంలో మళ్లీ ఆఫీస్ ముఖం చూడకూడదని రాజ్ కండీషన్ పెడతాడు. రాజ్ కండీషన్‌కు సీతారామయ్య ఓకే అంటాడు.
కావ్య కంగారు...
ఈ పోటీలో తాను గెలిస్తే...రాజ్ ఓడిపోతాడని...ఒకవేళ తాను ఓడిపోతే కాపురమే పోతుందని కావ్య కంగారుపడుతుంది. మీ కాపురం చక్కదిద్దడానికే ఈ పోటీ పెట్టామని కావ్యకు సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ సర్ధిచెబుతారు. నువ్వు ఇంటికి దూరంగా ఉండి రాజ్ మనసు మార్చడం సాధ్యం కాదని అంటాడు.
తల్లికి సీరియస్ కావడంతోనే రాజ్ నీపై అరిచాడు కానీ...అతడికి నీపట్ల మనసులో ప్రేమ ఉందని కావ్యతో అంటాడు సీతారామయ్య. రాజ్ మనసులో నీ పట్ల దాగి ఉన్న ప్రేమ బయటకు రావాలంటే నువ్వు ఈ పందెంలో గెలవాలని కావ్యలో కాన్ఫిడెన్స్ నింపుతారు. పోటీలో గెలిస్తే జీవితంలో గెలుస్తావని కావ్యతో అంటాడు సీతారామయ్య. వారి మాటలతో పోటీలో ఎలాగైనా గెలిచిన తీరుతానని కావ్య అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
టాపిక్