Brahmamudi May 28th Episode: మాయనే తన కోడలిగానే ఫిక్సైన అపర్ణ - కావ్యకు రాజ్ థాంక్స్ - రుద్రాణికి స్వప్న వార్నింగ్
28 May 2024, 7:28 IST
Brahmamudi May 28th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యకు విడాకులు ఇప్పించి మాయతో రాజ్ పెళ్లి జరిపించాలనే అపర్ణ నిర్ణయాన్ని ఇందిరాదేవి, సీతారామయ్య వ్యతిరేకిస్తారు. కావ్య అన్యాయం చేస్తే తాను ఊరుకోనని ఇందిరాదేవి అంటుంది. కావ్య కోసం ఎంత దూరమైన వెళతానని చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్
Brahmamudi May 28th Episode: రాజ్‌తో కావ్యకు విడాకులు ఇవ్వాలని అపర్ణ నిర్ణయించుకుంటుంది. లాయర్ ద్వారా విడాకుల పేపర్స్ తెప్పిస్తుంది. మాయ ద్వారా రాజ్ బిడ్డను కనడంతో ఆమెతో రాజ్ పెళ్లి జరిపించి ఇంటికి కోడలిగా మాయకు స్థానం ఇవ్వాలని అపర్ణ నిర్ణయించుకుంటుంది. కానీ రాజ్‌కు విడాకులు ఇవ్వడానికి కావ్య అంగీకరించదు. ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరు ఎలా ఇస్తారని అపర్ణను ఎదురిస్తుంది. తప్పు చేసిన రాజ్‌ను వదిలిపెట్టి నాకు ఎలా అన్యాయం చేస్తారని అపర్ణను కడిగిపడేస్తుంది కావ్య.
దుగ్గిరాల కోడలిగా...
నేను దుగ్గిరాల ఇంటి కోడలిగా నా బాధ్యతలు మొత్తం సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తున్నానని కావ్య అంటుంది. నా భర్త ఓ బిడ్డను తెచ్చినా...ఆ బిడ్డ తల్లి ఇంటికొచ్చినా నేను వీధికి ఎక్కలేదు. రాజ్ భార్యగా ఆయన మంచి చెడు, తప్పు ఒప్పు, సుఖం, దుఃఖం అన్ని కలిసే పంచుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్య ఖరాఖండిగా తేల్చేస్తుంది. కావ్య మాటలతో అపర్ణతో పాటు రుద్రాణి షాకవుతారు.
ఇందిరాదేవి ప్రశంసలు...
కావ్య నిర్ణయాన్ని చెప్పిన తీరుపై ఇందిరాదేవి ప్రశంసలు కురిపిస్తుంది. ఆడతనం అంటే ఇది...పెళ్లికి ముందే తొందరపడి సర్వస్వం సమర్పించుకున్న ఆడదానికి నా మనవరాలి ముందు నిలబడే అర్హత లేదని మాయకు ఝలక్ ఇస్తుంది.
ఇందిరాదేవి మాటలతో మాయ ముఖం చిట్టించుకుంటుంది. విడాకులపై రాజ్ నిర్ణయాన్ని సీతారామయ్య అడగ్గా దీని గురించి నేనేం మాట్లాడలేనని, నాకు అర్హత లేదని బదులిస్తాడు. విడాకుల టాపిక్ పక్కనపెట్టమని సీతారామయ్య అందరికి గట్టిగా చెబుతాడు.
అపర్ణపై సెటైర్స్...
ఆ తర్వాత అపర్ణను ఒంటరిగా కలిసిన ఇందిరాదేవి కోడలి దుమ్ముదులిపేస్తుంది. నీ పరివారం అంత ఎక్కడ? అంటూ సెటైర్స్ వేస్తుంది. నువ్వు కోటకు మహారాణివి? నువ్వు ఆజ్ఞలు వేస్తే పాటించడం తప్పితే ఈ ఇంట్లో నీకు ఎవరూ ఎదురునిలబడలేరు అంటూ నిష్టూరంగా మాట్లాడుతుంది. కావ్యకు విడాకులు ఇప్పించి మాయకు...రాజ్‌కు పెళ్లిచేయాలని అనుకుంటే కుదరదని అపర్ణతో అంటుంది ఇందిరాదేవి.
కొడుకు సంతోషంగా గురించి ఆలోచించి కావ్యకు ఎలా అన్యాయం చేస్తావని అపర్ణను ప్రశ్నిస్తుంది. విడాకులు ఇప్పటించి కావ్యకు మంచే చేస్తున్నానని అపర్ణ అంటుంది. ఇష్టం లేని భర్తతో కాపురం చేయడం కంటే విడిపోయి తన జీవితం తాను చూసుకొని సంతోషంగా బతకడం మంచిదే కదా అని ఇందిరాదేవితో అపర్ణ అంటుంది.
కావ్య నిర్ణయం చెప్పకుండా...
కావ్యకు రాజ్ అంటే ఇష్టం ఉందో లేదో చెప్పకుండా నువ్వు ఎలా విడాకుల నిర్ణయం తీసుకుంటావని అపర్ణను నిలదీస్తుంది ఇందిరాదేవి. కావ్య ఇష్టాలతో నాకు పనిలేదని అపర్ణ బదులిస్తుంది. కోర్డుకు మాత్రం అవసరం అని ఇందిరాదేవి చెబుతుంది. కావ్యకు ఇష్టం లేకుండా రాజ్, మాయ పెళ్లి ఎలా చేస్తావు...కావ్యలో ఏం లోపం ఉందని చూపిస్తావని క్లాస్ ఇస్తుంది.
పెద్ద కోడలివని కాదు...
నీకు ఈ ఇంటి అధికారాలు అప్పగించింది ఇంటి పెద్ద కోడలివని కాదు.అందరిని సమానంగా చూస్తావనే పవర్స్ ఇచ్చాం. కానీ నీలో స్వార్థం కనిపిస్తోంది. కొడుకు గురించి ఆలోచించి కావ్యకు అన్యాయం చేస్తున్నావని అపర్ణపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. కావ్య విషయంలో నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా నీకు అడ్డుగా నిలబడే మొదటి మనిషిని నేనే అవుతా.
కావ్యకోసం ఎంతదూరమైన వెళతానని అంటుంది. కావ్యకు ఇష్టం లేకుండా రాజ్‌కు, మాయకు పెళ్లి చేస్తే ఇంటి పరువు రోడ్డున పడుతుంది. రాజ్ అరెస్ట్ అవుతాడని ఇందిరాదేవి అంటుంది. కావ్యకు న్యాయం చేయడమే మంచిదని ఇందిరాదేవి అపర్ణకు సర్ధిచెబుతుంది. అది జరగని పని అంటూ అపర్ణ బదులిస్తుంది. అయితే రాజ్, మాయ పెళ్లి కూడా జరగదని ఇందిరాదేవి అంటుంది.
మాయ షాక్...
కావ్య విడాకులకు ఒప్పుకోకపోవడంతో మాయ షాకవుతుంది. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతే రాజ్‌కు పెళ్లిచేసుకొని ఇంట్లోనే పర్మినెంట్‌గా సెటిల్ కావాలని అనుకుంటుంది. ఇదే విషయం రుద్రాణితో చెబుతుంది మాయ. కావ్య పద్దతిగా కనిపిస్తుందని ఆమెను తక్కువగా అంచనా వేయద్దనిమాయతో అంటుంది రుద్రాణి. తేడా వస్తే ఎవరిని వదిలిపెట్టదని, ఇంటిని కూడా పెట్రోల్ పోసి తగలపెట్టే రకం అని కావ్య గురించి మాయకు క్లారిటీ ఇస్తుంది రుద్రాణి. ఈ జనరేషన్‌లో పుట్టిన ఆ నాటి సావిత్రి కావ్య అని, విలువల కోసమే కష్టాలను భరిస్తుందని మాయతో చెబుతుంది రుద్రాణి.
స్వప్న ఎంట్రీ...
అపర్ణను రెచ్చగొడితే కావ్యను ఎదురించి మీ పెళ్లి జరిపిస్తుంది. ఈ సారి నేను వేయబోయే ప్లాన్‌తో మీ పెళ్లిని కావ్యనే స్వయంగా జరిపిస్తుందని మాయతో రుద్రాణి అంటుంది. అనుకోకుండా అక్కడికి స్వప్న రావడంతో ఆమె తమ మాటలను విన్నదని ఇద్దరు కంగారు పడతారు. కానీ స్వప్న వారి మాటలు వినదు.
మాయ, రుద్రాణి రహస్యంగా మాట్లాడుకోవడం కోసం చూసి ఇద్దరికి క్లాస్ పీకుతుంది. స్వప్న మాటలకు రుద్రాణి భయపడిపోతుంది. మీ కోడలు అంతగా రెచ్చిపోతే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని రుద్రాణిని అడుగుతుంది మాయ. స్వప్న మామూలుది కాదని, ఆమెతో పెట్టుకోవద్దని, అనుభవంతో ఈ మాట చెబుతున్నానని భయంభయంగా మాయతో అంటుంది రుద్రాణి.
కావ్యకు రాజ్ థాంక్స్...
తనకు విడాకులు ఇవ్వనని అన్న కావ్యకు థాంక్స్ చెబుతాడు రాజ్. నువ్వు విడాకులు ఇచ్చుంటే మాయతో నాకు మా అమ్మ పెళ్లిచేసేది అని కావ్యతో అంటాడు రాజ్. మాయను ఇచ్చి పెళ్లిచేస్తారని భయపడుతున్నారా...ఈ కావ్యకు దూరంగా వెళ్లిపోవాల్సివస్తుందని కంగారుపడుతున్నారా..క్లారిటీగా చెప్పండి అని రాజ్‌ను అడుగుతుంది కావ్య.
మాయ మంచిది అయితే నేను విడాకులు ఇచ్చినా పర్లేదా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. నువ్వు నాకు ఎందుకు విడాకులు ఇస్తావు..జీవితాంతం నన్ను సాధిస్తూనే ఉంటావని కావ్యతో అంటాడు రాజ్. తన మాటలతో రాజ్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది కావ్య.
ప్రేమ లేనప్పుడు ఉండలేను...
నా ప్రాణం మాత్రం ఇప్పుడు హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉందని రాజ్ అంటాడు. నా మీద అసలు మీకు ప్రేమ లేదు. మాయ అనే గండం నుంచి తప్పించినందుకు నేను మీతో ఉండాలని కోరుకుంటున్నప్పుడు...నేను ఇంకా ఇక్కడ ఎందుకుండాలి. ఇప్పుడే విడాకులు ఇస్తానని అత్తయ్యతో చెప్పి పుట్టింటికి వెళ్లిపోతానని రాజ్‌ను ఆటపట్టిస్తుంది కావ్య. పెళ్లిరోజు పిలిస్తే నాలుగు అంక్షితలు వేసి వెళ్లిపోతానని ఏడుస్తున్నట్లు నటిస్తుంది కావ్య.
విడాకులు ఇవ్వనని ఎందుకు అన్నారు...
నేను విడాకులు ఇవ్వనని అన్నను సరే మరి మీరేందుకు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాని భర్తను అడుగుతుంది కావ్య. నిజం చెప్పండి నా మీద ప్రేమ ఉందా లేదా అని రాజ్‌ను ప్రశ్నిస్తుంది.
ప్రేమ ఉందని అంటే సంక ఎక్కి కూర్చుంటావు. లేదంటే విడాకులు ఇస్తానని అంటాను. నీతో ఏం మాట్లాడిన చిక్కేనని కావ్యకు సమాధానమిస్తాడు రాజ్. మీ మనసులో నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు అలా మాట్లాడతారు...ఇప్పుడు కారణాలు చెప్పలేనని ఎందుకు అంటారని భర్తతో అంటుంది కావ్య.
చిన్న రాక్షసి పోయి...పెద్ద రాక్షసి నోట్లో పడకుండా ఉండకూడదనే అలా అన్నానని కావ్యతో చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు రాజ్.
రాజ్‌కు నరకం...
మాయ, రాజ్‌ల పెళ్లి జరిగితే మనకు ఒరిగేది ఏం లేదని తల్లితో అంటాడు రాహుల్ మాయ, రాజ్ పెళ్లి జరిగితే కావ్యకు ఇంట్లో ఏం స్థానం లేకుండా పోతుందని , అప్పుడే కావ్య తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని రుద్రాణి అంటుంది. మాయను పెళ్లిచేసుకున్న రాజ్ క్షణక్షణం నరకం అనుభవించేలా చేసి అతడిని ఆఫీస్‌కు దూరం చేస్తానని రుద్రాణి ప్లాన్ వేస్తుంది. ఇద్దరి అడ్డు తొలగిపోతుందని రుద్రాణి తన ప్లాన్ మొత్తం రాహుల్‌కు చెబుతుంది.
షాకిచ్చిన అపర్ణ...
రాజ్‌కు విడాకులు ఇవ్వమని మరోసారి కావ్యను అడుగుతుంది అపర్ణ. విడాకుల విషయంలో తన నిర్ణయం మారదని కావ్య చెబుతుంది. అయితే రాజ్, మాయ పెళ్లి విషయంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేదని నో అబ్జక్షన్ సర్టిఫికెట్ మీద సంతకం చేయమని కావ్య ముందు పేపర్స్ పెడుతుంది అపర్ణ. ఆమె మాటలతో కావ్య, రాజ్ షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.