Brahmamudi Today Episode: కావ్యపై ధాన్యలక్ష్మి, అపర్ణ వార్ - కోడళ్లకు ఇందిరాదేవి క్లాస్ - మాటిచ్చిన రాజ్
Brahmamudi Today Episode: దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం తనను శత్రువుగా చూడటం కావ్య తట్టుకోలేకపోతుంది. తాను ఏ తప్పు చేయకున్నా అందరూ దోషిగానే చేస్తున్నారని బాధపడుతుంది. కావ్య తప్పు చేయలేదని రాజ్ నమ్ముతాడు. ఇంకా నేటి బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందంటే?
Brahmamudi Today Episode: అనామికను అత్తింట్లో వదిలిపెట్టి ఆమెకు అప్పగింతలు చెబుతారు తల్లిదండ్రులు. అనామిక చేతిని కళ్యాణ్ చేతిలో పెట్టి ఇక నుంచి తమ కూతురు బాధ్యత నీదే అని అంటారు. ప్రాణం పోయినా అనామిక చేతిని ఎప్పటికీ వదలనని మాటిస్తాడు కళ్యాణ్. ఆ తర్వాత రాజ్‌ను పక్కకు పిలిచిన అనామిక తల్లిదండ్రులు ఈ పెళ్లి జరగడానికి కారణం మీరే అని అతడితో అంటారు.
పెళ్లిలో జరిగిన గొడవ గురించే భయపడుతున్నామని చెబుతారు. కావ్య తన చెల్లెలిని కళ్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. కానీ అప్పు స్థానంలో అనామిక రావడంతో కావ్య తమ కూతురుని ఏదైనా చేస్తుందని భయపడుతున్నట్లుగా రాజ్ ముందు సందేహం వ్యక్తం చేస్తారు.
అనామికకు ఏం జరగకుండా ఆమెకు అండగా ఉండాలని కళ్యాణ్‌ను కోరుతారు. కావ్య వల్ల అనామికకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాను చూసుకుంటానని అనామిక తల్లిదండ్రులకు రాజ్ మాటిస్తాడు.
కనకం, కృష్ణమూర్తి బాధ...
కళ్యాణ్ పెళ్లి వేడుకలో తమకు జరిగిన అవమానం తల్చుకొని కనకం, కృష్ణమూర్తి బాధపడతారు. నువ్వు చేసిన పని వల్ల అప్పుతో పాటు కావ్య కూడా దోషిగా మారిందని కనకాన్ని ఆన్నపూర్ణమ్మ కోపగించుకుంటుంది. ఆస్తి మీదున్న ఆశతో కాకుండా అప్పు మీద ఉన్న ప్రేమతో ఇదంతా చేశానని కనకం అంటుంది.
కళ్యాణ్‌ను అప్పు ప్రేమించిందని తెలిసిన తర్వాత దాని ఆశలు నిజం చేయాలని అనుకున్నానని, కానీ దానివల్ల ఏం జరుగుతుందో ఊహించలేదని కనకం బాధపడుతుంది. కానీ తాను చేసిన పని వల్ల తన కూతుళ్లు అప్పు, కావ్య దోషులుగా మారిపోయారని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పు ఈ అవమానాన్ని ఎలా తట్టుకుంటుందో అని కంగారు పడతారు.
అప్పుడే అప్పు తన రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఎలాంటి బాధ లేకుండా కనిపిస్తుంది. చికెన్ సెంటర్‌కు వెళుతున్నానని, చికెన్ తినాలని అనిపిస్తుందని అంటుంది.
రాజ్ సపోర్ట్...
హారతి విషయంలో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ తనను నానా మాటలు అనడం గుర్తొచ్చి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజ్ ఆమెను ఓదార్చుతాడు. తాను తప్పు చేశానని అందరూ అనడం తట్టుకోలేకపోతున్నానని కావ్య అంటుంది. అప్పు ప్రేమ విషయం కళ్యాణ్ పెళ్లి వేడుకలోనే తెలిసిందని కావ్య అంటుంది. ముందుగానే తెలిస్తే అప్పును పెళ్లికి రావొద్దని తానే చెప్పేదానినని కావ్య అంటుంది.
కళ్యాణ్ ను బాధపెట్టి, అప్పుకు అవమానం జరిగినా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోయానని కావ్య అంటుంది. . చివరకు చిన్నత్తయ్య తనను తప్పు పడుతుందని, అనామిక శత్రువుగా చూస్తుందని కావ్య వాపోతుంది.ఒకరికి మన మీద ఎలాంటి అభిప్రాయం ఉందన్నది అనవసరం. మనలో ఏం తప్పు ఉండకుండా ఉంటే చాలు.
ఇలాంటి అభిప్రాయభేదాలు ఎన్ని ఉన్నా కాలమే వారికి సమాధానం చెబుతుందని కావ్యకు సర్ధిచెబుతాడు రాజ్. ఈ ఆరోపణల మధ్య ఇక నుంచి ప్రతిరోజు తాను యుద్దమే చేయాలని కావ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కళ్యాణ్ పెళ్లి విషయంలో కావ్య ఎలాంటి తప్పు చేయలేదని రాజ్ నమ్ముతాడు.
ఇందిరాదేవి క్లాస్...
భోజనాల దగ్గర కావ్యపై నోరు పారేసుకుంటుంది ధాన్యలక్ష్మి. ఆమెను నానా మాటలు అంటుంది. రాజ్,కళ్యాణ్ మినహా మిగిలిన అందరూ కావ్య ను మాటలతో బాధపడెతారు. ఇందిరాదేవి అందరికి క్లాస్ ఇస్తుంది. అన్నం పెట్టిన చేయిని అవమానించొద్దని ధాన్యలక్ష్మితో అంటుంది ఇందిరాదేవి.
కావ్యకు ఇందిరాదేవి సపోర్ట్ చేయడం అపర్ణ సహించలేకపోతుంది. ధాన్యలక్ష్మి కడుపు ఎంత రగిలిపోతుందో మీకు అర్థం కావడం లేదా అంటూ అత్తయ్యకు సలహా ఇస్తుంది అపర్ణ. మీరు కోరుకున్నట్లుగా కొత్త కోడలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ గొడవకు వదిలిపెట్టకుండా ఇంకా దానిని మనసులో ఎందుకు పెట్టుకుంటున్నారని అపర్ణ, ధాన్యలక్ష్మితో అంటుంది కావ్య. సుభాష్, ప్రకాశం కూడా కావ్యకు సపోర్ట్ చేసి గొడవను ఆపేస్తారు.
అనామిక కాఫీ..
ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని అనామిక ప్లాన్ వేస్తుంది. కావ్య బదులు తాను కాఫీ పెట్టి అందరికి ఇస్తుంది. నువ్వు చేసిన కాఫీ తాగి బోర్ కొట్టిందని కావ్యపై సెటైర్ వేస్తాడు రాజ్. అనామిక చేసిన కాఫీ టేస్ట్ చూడగానే అందరి ముఖాలు మారిపోతాయి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.