Brahmamudi Today Episode: బ్రహ్మముడి - కావ్యతో రాజ్ రొమాన్స్ - కాపురం చక్కదిద్దుకోవాలని కోడలికి అపర్ణ క్లాస్
18 July 2024, 9:01 IST
Brahmamudi Today Episode: నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్‌లో సమస్యలను పరిష్కరించడమే పనిగా పెట్టుకోవడం కాకుండా నీ కాపురం చక్కదిద్దుకోవడంపై దృష్టిపెట్టమని కావ్యకు క్లాస్ ఇస్తుంది అపర్ణ. భార్య బాధను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని రాజ్‌ను నిలదీస్తుంది ఇందిరాదేవి.
బ్రహ్మముడి సీరియల్
Brahmamudi Today Episode: అప్పు,కళ్యాణ్...ఆ తర్వాత రాజ్...ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ కావడంతో పోలీస్ స్టేషన్ నుంచి వారిని విడిపించేందుకు కావ్య వస్తుంది. అప్పుపై కేసు పెట్టిన వారు తమదే తప్పు అని ఒప్పుకునేలా వారితోనే చెప్పిస్తుంది కావ్య. ఇందులో తన మరిది కళ్యాణ్ తప్పు ఏం లేదని కావ్య అంటుంది. కావ్య కేవలం కళ్యాణ్ పేరు మాత్రమే చెప్పడంతో నా పరిస్థితి ఏంటని రాజ్ కంగారు పడతాడు.
తనను జైల్లోనే ఉంచి కావ్య వెళ్లిపోతుందని కంగారు పడతాడు. కళ్యాణ్‌ను మాత్రమే ఎస్ఐ వదిలిపెడతాడు. అన్నయ్యను కూడా జైలు నుంచి విడిపించుకొని వెళ్లిపోదామని కళ్యాణ్ అంటాడు. ఆడవాళ్లకు ఏం తెలుసు...మా మగవాళ్లకు అన్ని తెలుసు అంటూ తనను తక్కువ చేసి మాట్లాడాడని, జైలు నుంచి తనను తాను విడిపించుకుంటాడని రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది కావ్య.
కమీషనర్ క్లాస్‌మేట్...
రాజ్, పోలీస్ కమీషనర్ క్లాస్‌మేట్స్ కదా...ఒక్క ఫోన్ చేస్తే కమీషనర్ వచ్చి ఆయన్ని విడిపిస్తాడని ఎస్ఐకి వినపడేలా కావ్య అంటుంది. కమీషనర్ పేరు వినగానే ఎస్ఐ కంగారు పడి రాజ్‌ను వదిలిపెడతాడు. కమీషనర్‌తో మాట్లాడి మీకు ప్రమోషన్ ఇప్పిస్తాననిఎస్ఐతో చెబుతుంది కావ్య.
అప్పు ఎమోషనల్...
తనకు జరిగిన అవమానాన్నికావ్యతో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పు. తనను బజారుదానిని చేసి మాట్లాడారని, హోటల్ రూమ్ బుక్ చేస్తాను వస్తావా అంటూ నీచంగా మాట్లాడారని...ఆ కోపాన్ని సహించలేక వారిని కొట్టానని కావ్యతో అంటుంది అప్పు. తాను ఏం తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇచ్చిన అందరూ అనామిక ప్రచారం చేసిన పుకార్లనే నమ్ముతున్నారని అప్పు బాధపడుతుంది. ఇకపై కూడా తనను ఎవరైనా ఏమైనా అంటే సహించనని ఇలాగే కొడతానని చెప్పి అప్పు వెళ్లిపోతుంది.
తన వల్లే అప్పు మాటలు పడాల్సిరావడం చూసి కళ్యాణ్ బాధపడతాడు. ఏం జరిగిందని ధాన్యలక్ష్మి, ప్రకాశం అడిగిన సమాధానం చెప్పడు.
రాజ్ కౌగిలిలో బందీ...
కావ్య గోరింటాకు గిన్నెతో బెడ్‌రూమ్‌లోకి వస్తుంది. అది గోంగూర పచ్చడి అంటూ రాజ్‌తో అబద్ధం ఆడుతుంది. నిజంగానే పచ్చడి అనుకొని టేస్ట్ చూస్తాడు రాజ్. అది గోరింటాకు అని చెప్పి భర్తను ఏడిపిస్తుంది కావ్య. ఆమెను కొట్టబోతాడు రాజ్. ఆమెను గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఎక్కడికిపోతావని అంటాడు. ఎక్కడికి పోనని, మీ కౌగిలిలో ఇలాగే బందీ అవుతానని రొమాంటిక్‌గా కావ్య బదులిస్తుంది.
కావ్యకు గోరింటాకు పెట్టిన రాజ్...
తనకు గోరింటాకు పెట్టమని రాజ్‌ను అడుగుతుంది కావ్య. ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అమ్మమ్మ చెప్పిందని అంటాడు. ఇదో ఆచారం ఉందా అంటూ అని రాజ్ గొణుక్కుంటాడు. కావ్యకు గోరింటాకు పెట్టడానికి రాజ్ ఒప్పుకోడు. తనకు డిజైన్స్ రావని చెబుతాడు. కావ్య బుజ్జగిస్తూ అడగటంతో గోరింటాకు పెట్టడానికి రాజ్ ఒప్పుకుంటాడు.
రాజ్ గోరింటాకు పెడుతోండగా కావ్య అతడినే చూస్తూ ఉంటుంది. గోరింటాకు పేరుతో రాజ్‌తో సేవలు చేయించుకుంటుంది కావ్య. కావ్యకు గోరింటాకు పెడుతూ ఆమెకు ముద్దు ఇవ్వబోతాడు రాజ్. వారిద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉండగా ఫోన్ మోగుతుంది. దాంతో కావ్యకు దూరంగా జరుగుతాడు రాజ్.
కళ్యాణ్ ఆలోచనలు...
అప్పు చెప్పిన మాటలతో ఆమెను తన కళ్లముందే అవమానిస్తూ ఇతరులు మాట్లాడిన మాటల్ని కళ్యాణ్ గుర్తుచేసుకుంటాడు. దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావని కళ్యాణ్‌ను అడుగుతాడు రాజ్. అనామిక గురించి ఆలోచిస్తున్నావా అని కళ్యాణ్‌తో అంటాడు రాజ్.
పీడకలగా అదంతా ఎప్పుడో మర్చిపోయానని అన్నయ్యకు బదులిస్తాడు కళ్యాణ్. కానీ తన వల్ల అప్పుకు చాలా అన్యాయం , ఆమె జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత తనపై పడిందని అంటాడు. నువ్వు ఏం చేయాలన్నా ఆ కుటుంబం నీకు అవకాశం ఇవ్వాలని తమ్ముడిని ఓదార్చుతాడు రాజ్.
ఇందిరాదేవి, అపర్ణ క్లాస్...
కళ్యాణ్‌తో రాజ్ మాట్లాడిన మాటల్ని ఇందిరాదేవి వింటుంది. ఒక అన్నయ్యగా తమ్ముడి బాధను అర్థం చేసుకున్నావు. ఒక భర్తగా కావ్య బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావని అని రాజ్‌ను కడిగేస్తుంది ఇందిరాదేవి. మరోవైపు ఎప్పుడు అందరి సమస్యలు పరిష్కరించడమే పనిగా పెట్టుకున్నావా అంటూ కావ్యకు క్లాస్ ఇస్తుంది అపర్ణ.
నీకు నీ కాపురం సమస్యగా మారిందని గుర్తులేదా...పెళ్లి చేసుకున్నందుకు నీ బతుకు పండాలి. కడుపు పండాలి. ఇకపై విడిగా ఉండొద్దు...మీరిద్దరు ఒక్కటి కావాలి అంటూ కావ్యతో అంటుంది అపర్ణ. అపర్ణ, ఇందిరాదేవి చెప్పినట్లే చేయాలని రాజ్, కావ్య నిర్ణయించుకుంటారు. ఇక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.