Bimbisara: కల్యాణ్‌రామ్ బింబిసార రన్‌టైమ్ ఎంతో తెలుసా?
28 July 2022, 10:24 IST
- Bimbisara: నందమూరి కల్యాణ్‌రామ్ ఓ పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలోని త్రిగర్తల రాజ్యాధినేత బింబిసారుడిగా అతడు కనిపించనున్నాడు.
బింబిసార మూవీలో కల్యాణ్ రామ్
ఇన్నాళ్లూ మాస్ ఎంటర్‌టైనర్స్‌కే పరిమితమైన నందమూరి కల్యాణ్‌రామ్.. తొలిసారి ఓ డిఫరెంట్ లుక్, స్టోరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతడు నటించిన బింబిసార మూవీ వచ్చే నెల 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్లు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. కల్యాణ్‌రామ్ నట విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ ట్రైలర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బింబిసార మూవీ ఫైనల్ ఎడిట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలుగా ఉంది. ఈ మూవీ ఇంకా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకోవాల్సి ఉంది. బింబిసార మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
ఈ సినిమా రెండో ట్రైలర్‌ను బుధవారం (జులై 27) జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రాక్షస రాజు బింబిసారుని పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అదే బింబిసారుడు టైమ్ ట్రావెల్ చేసి ఆధునిక యుగంలోకి వచ్చినట్లుగా ఈ ట్రైలర్‌లో చూపించారు.
ఈ మూవీలో కల్యాణ్ రామ్ సరసన కేథరిన్ ట్రెసా నటిస్తోంది. సంయుక్త మేనన్, వరీనా హుస్సేన్, ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బింబిసారకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కీరవాణి అందించగా.. చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది.