Bimbisara Movie: కళ్యాణ్‌రామ్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కన్ఫార్మ్
24 July 2022, 17:47 IST
నందమూరి కళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram)హీరోగా నటిస్తున్న బింబిసార (bimbisara) చిత్రం ఆగస్ట్ 5న రిలీజ్‌కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది.
నందమూరి కళ్యాణ్‌రామ్
kalyanram bimbisara pre release event: హిస్టారికల్ ఫాంటసీ కథాంశంతో హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన చిత్రం బింబిసార. ఇందులో త్రిగర్తల రాజు బింబిసారుడిగా, ,నేటితరం ఆధునిక యువకుడిగా డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ కనిపించబోతున్నారు.
ఇటీవల విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాతో వశిష్ట్ మల్లిడి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 5న బింబిసార రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్‌ను ఆదివారం చిత్ర యూనిట్ ఫైనలైజ్ చేసింది. జూలై 29న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో ప్రీరిలీజ్ వేడుకను జరుపబోతున్నట్లు వెల్లడించింది. ఈ ఈవెంట్ కు అగ్రహీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. అతడితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారని చెబుతున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్ ఈ సినిమా చూసినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ నటనకు ఫిదా అయినట్లు చెబుతున్నారు. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. దాదాపు నలభై కోట్లకుపైగా వ్యయంతో ఈ సినిమాను రూపొందినట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ పాటలు సమకూర్చగా...నేపథ్య సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు. కె హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంయుక్త మీనన్,,కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
టాపిక్