తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movies: బడ్జెట్ రూ.85 కోట్లు.. వసూళ్లు రూ.3.77 కోట్లు.. ఈ బీజేపీ ఎంపీని నిండా ముంచిన రెండు సినిమాలు ఇవే..

Biggest Flop Movies: బడ్జెట్ రూ.85 కోట్లు.. వసూళ్లు రూ.3.77 కోట్లు.. ఈ బీజేపీ ఎంపీని నిండా ముంచిన రెండు సినిమాలు ఇవే..

Hari Prasad S HT Telugu

07 June 2024, 19:52 IST

google News
    • Biggest Flop Movies: బడ్జెట్ రూ.85 కోట్లు.. వసూళ్లు రూ.3.77 కోట్లు.. మరో సినిమా బడ్జెట్ రూ.70 కోట్లు.. వసూలు చేసింది కేవలం రూ.5.6 కోట్లు.. ఈ రెండు సినిమాలు తాజాగా బీజేపీ ఎంపీగా గెలిచిన బాలీవుడ్ హీరోయిన్‌ను నిండా ముంచాయి.
బడ్జెట్ రూ.85 కోట్లు.. వసూళ్లు రూ.3.77 కోట్లు.. ఈ బీజేపీ ఎంపీని నిండా ముంచిన రెండు సినిమాలు ఇవే..
బడ్జెట్ రూ.85 కోట్లు.. వసూళ్లు రూ.3.77 కోట్లు.. ఈ బీజేపీ ఎంపీని నిండా ముంచిన రెండు సినిమాలు ఇవే..

బడ్జెట్ రూ.85 కోట్లు.. వసూళ్లు రూ.3.77 కోట్లు.. ఈ బీజేపీ ఎంపీని నిండా ముంచిన రెండు సినిమాలు ఇవే..

Biggest Flop Movies: కంగనా రనౌత్ తెలుసు కదా. ఇంతకాలం బాలీవుడ్ హీరోయిన్ గానే పరిచయం ఉన్న ఈమె.. ఇక నుంచి బీజేపీ ఎంపీగానూ ప్రజల్లో పేరు సంపాదించబోతోంది. బాలీవుడ్ లో హిట్ సినిమాల్లో నటించిన పేరు ఈమెకు ఎంతగా ఉందో.. అంతకంటే ఎక్కువగా రెండు డిజాస్టర్ సినిమాల నటిగానూ ఉంది. ఆమె కెరీర్లో ఈ రెండు సినిమాలు మాయని మచ్చగా మిగిలిపోయాయి.

కంగనా రనౌత్ బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్

సుమారు రెండు దశాబ్దాల కిందట కేవలం 17 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో అడుగుపెట్టింది కంగనా రనౌత్. గ్యాంగ్‌స్టర్ అనే ఆ మూవీలో ఇమ్రాన్ హష్మితో కలిసి కొన్ని సీన్లలో రెచ్చిపోయి నటించి పేరు సంపాదించింది. ఆ తర్వాత కొన్ని హిట్ సినిమాల్లో నటించింది. అయితే రెండు ఫిమేల్ లీడ్ సినిమాలు మాత్రం ఆమెతోపాటు నిర్మాతలను నిండా ముంచాయి.

భారీ నష్టాలను మిగిల్చాయి. వీటిలో ఒక సినిమా ధాకడ్ కాగా.. మరొకటి తేజస్. ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ధాకడ్ మూవీ అయితే ఏకంగా రూ.85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. చివరికి బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.3.77 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చిన డబ్బు కూడా కలుపుకున్నా.. ఈ మూవీ వల్ల రూ.78 కోట్ల నష్టం వాటిల్లినట్లు అప్పట్లో కంగనానే వెల్లడించింది.

ఇక మరో సినిమా తేజస్. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్ పాత్రలో కంగనా నటించింది. ఈ సినిమాను రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది కేవలం రూ.5.6 కోట్లు. అంటే 90 శాతం బడ్జెట్ నష్టపోయారు. వెళ్లి ఈ సినిమా చూడండంటూ కంగనా ఎన్నోసార్లు వేడుకున్నా.. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు.

నేషనల్ అవార్డుల నుంచి డిజాస్టర్ వరకు..

కంగనా తన కెరీర్లో అన్నీ చూసింది. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి సినిమాలకుగాను నేషనల్ అవార్డులు అందుకుంది. అదే సమయంలో గేమ్, రెడీ, రజ్జో, రివాల్వర్ రాణి, సిమ్రన్, నో ప్రాబ్లెం, నాకౌట్ లాంటి ఫ్లాపులనూ చేసింది. కానీ ఆమె కెరీర్లో మాత్రం అతిపెద్ద డిజాస్టర్లుగా ఈ ధాకడ్, తేజస్ మిగిలిపోయాయి. తేజస్ మూవీ గతేడాది 12th ఫెయిల్ సినిమాతో పోటీ పడింది.

ఆ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.70 కోట్లు వసూలు చేస్తే.. తేజస్ మాత్రం రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి అందులో పది శాతం కూడా వసూలు చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఎమర్జెన్సీ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించింది.

ఈ మూవీ నుంచి చాలా రోజులుగా అప్డేట్స్ వస్తున్నా.. రిలీజ్ డేట్ ఇంకా వెల్లడించలేదు. ఈలోపే ఆమె ఈ మధ్యే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి 74 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం