Tejas OTT Release Date: కంగనా రనౌత్ యాక్షన్ థ్రిల్లర్ ‘తేజస్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: వివరాలివే-tejas ott release date announced officially by zee5 platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tejas Ott Release Date: కంగనా రనౌత్ యాక్షన్ థ్రిల్లర్ ‘తేజస్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: వివరాలివే

Tejas OTT Release Date: కంగనా రనౌత్ యాక్షన్ థ్రిల్లర్ ‘తేజస్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: వివరాలివే

Tejas OTT Release Date: తేజస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలోకి.. ఎప్పుడు రానుందంటే..

Tejas OTT Release Date: కంగనా రనౌత్ యాక్షన్ థ్రిల్లర్ ‘తేజస్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Tejas OTT Release Date: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘తేజస్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు కంగనా. ట్రైలర్ ఆకట్టుకోవడంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు తేజస్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

తేజస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జీ5 ప్లాట్‍ఫామ్‍లోకి ఈ మూవీ రానుంది. 2024 జనవరి 5వ తేదీన తేజస్ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జీ5 అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ మూవీ తెలుగులో ఈ మూవీ అందుబాటులోకి వస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

తేజస్ చిత్రంలో ఆనుశ్ చౌహాన్, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్, కశ్యప్ సంఘారీ, రియో కపాడియా, మోహన్ అగ్సే కీలకపాత్రలు పోషించారు. సర్వేశ్ మేవర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శశ్వాంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. ఆర్ఎస్‍వీపీ మూవీస్ పతాకంపై రోనీ స్క్రీవాలా ఈ మూవీని నిర్మించారు.

సుమారు రూ.60 కోట్ల బడ్జెట్‍తో తేజస్ చిత్రం రూపొందింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం రూ.10కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేదని లెక్కలు బయటికి వచ్చాయి. మొత్తంగా కంగనా కెరీర్లో మరో డిజాస్టర్‌గా తేజస్ నిలిచింది.

దేశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉన్న భారతీయ స్పైని కాపాడే మిషన్‍ను భారత వైమానిక దళం పైలట్ తేజస్ గిల్ (కంగనా రనౌత్) చేపడతారు. ఆ స్పైని తేజస్ కాపాడారా? మిషన్ సక్సెస్ అయిందా అనేదే తేజస్ సినిమా ప్రధాన కథగా ఉంది.