Youtube: యూట్యూబ్‌లో రిలీజైన బిగ్‌బాస్ బ్యూటీ క్రైమ్ కామెడీ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్
10 October 2024, 8:36 IST
Youtube: బిగ్‌బాస్ బ్యూటి ఇనయ సుల్తానా హీరోయిన్‌గా నటించిన నటరత్నాలు మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సుదర్శన్, రంగస్థలం మహేష్ కీలక పాత్రలు పోషించారు. శివనాగు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
యూట్యూబ్
Youtube: బిగ్‌బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ మూవీ నటరత్నాలు యూట్యూబ్‌లో రిలీజైంది. బుధవారం నుంచి వోల్గా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. నటరత్నాలు మూవీకి నర్రా శివనాగు దర్శకత్వం వహించాడు.
టాలీవుడ్ కమెడియన్లు…
అర్చనతో పాటు టాలీవుడ్ కమెడియన్లు సుదర్శన్, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైంది. అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. నటరత్నాలు మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
నటరత్నాలు కథ ఏంటంటే?
బంగార్రాజు (అర్జున్‌తేజ్), వరప్రసాద్(సుదర్శన్), పీకే నాయుడు(రంగస్థలం మహేష్) ప్రాణ స్నేహితులు. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలుపడుతుంటారు. వరప్రసాద్ దర్శకత్వం వహించిన సినిమా పెద్ద హిట్టవుతుంది. తన స్నేహితుడు బంగార్రాజు, అతడి ప్రియురాలు సువర్ణ (ఇనయ సుల్తానా) హీరోహీరోయిన్లు మరో సినిమా ప్లాన్ చేస్తాడు వరప్రసాద్.
నటరత్న పేరుతో సినిమా మొదలుపెట్టాలని అనుకుంటున్న టైమ్‌లోనే బంగార్రాజు, వరప్రసాద్‌తో పాటు సువర్ణ ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటారు? వారికి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ముగ్గురిని కేసులో ఇరికించింది ఎవరు? ఈ మర్డర్ కేసు నుంచి ముగ్గురు ఎలా బయటపడ్డారు అన్నదే నటరత్నాలు మూవీ కథ.
సినిమా కష్టాలు…
మర్డర్ మిస్టరీ అంశాలతో పాటు అంతర్లీనంగా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అవుదామని అడుగుపెట్టేవారికి ఎలాంటి కష్టాలు ఎదురవుతుంటాయన్నది దర్శకుడు ఈ మూవీలో చూపించాడు. నటరత్నాలు మూవీలో టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. నటరత్నాలు మూవీలో టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. డైరెక్టర్ క్యారెక్టర్‌లోనే కనిపించాడు. అర్చన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసింది. ఈ సినిమాకు శంకర్ మహదేవ్ మ్యూజిక్ అందించాడు.
బిగ్‌బాస్ సీజన్ 6
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది ఇనయా సుల్తానా. టైటిల్ రేసులో నిలిచిన ఇనయ సుల్తానా అనూహ్యంగా 98వ రోజు ఎలిమినేట్ అయ్యింది. టాప్ సెవన్ కంటెస్టెంట్స్‌గా ఒకరిగా నిలిచింది.
తెలుగులో నటరత్నాలు మూవీతో పాటు బుజ్జి ఇలా రా, క్రాంతి, వాలెంటైన్స్ నైట్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది ఇనయ సుల్తానా. ఈ ఏడాది రిలీజైన శివం భజేలో ఓ చిన్న పాత్ర చేసింది.