Shilpa Shirodkar: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్‌బాబు మరదలు - తెలుగులోనూ సినిమాలు చేసిన నమ్రతా సోదరి!
Shilpa Shirodkar: బిగ్‌బాస్ హిందీలో మహేష్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 18 ఆదివారం మొదలైంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. శిల్పా శిరోద్కర్‌తో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హిందీ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు.
Shilpa Shirodkar: మహేష్‌బాబు మరదలు శిల్పా శిరోద్కర్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 18 ఆదివారం గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. బిగ్‌బాస్ షోకు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నాడు. మొత్తం పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వారిలో నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కూడా ఉంది.
జీవితంలో కొత్త అధ్యాయం...
బిగ్‌బాస్ సీజన్ 18లోకి నాలుగో కంటెస్టెంట్‌గా శిల్పా శిరోద్కర్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ ద్వారా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని శిల్పా శిరోద్కర్ అన్నది. బిగ్‌బాస్ షోకు తాను పెద్ద ఫ్యాన్‌నని, బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్ వెళ్లమని కూతురు ఎప్పుడు తనను అడుగుతుండేదని శిల్పా శిరోద్కర్ అన్నది.
బిగ్‌బాస్‌లోకి వెళ్లడం పట్ల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారని, అందరికంటే ఎక్కువ తన కూతురుఆనందిస్తుందని చెప్పింది. యాక్టర్‌గా ఛాన్స్‌ల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని, తెలిసిన వారిని అడిగినా కూడా అవకాశాలు లేవంటూ తప్పించుకున్నారని ఎమోషనల్ అయ్యింది. బిగ్‌బాస్‌తో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్...
1990 దశకంలో బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా పేరుతెచ్చుకున్నది శిల్పా శిరోద్కర్. అంఖే, గోపీకిషన్, బందీష్, మృత్య్‌దండ్, హమ్, త్రినేతతో పాటు హిందీలో వంద వరకు సినిమాలు చేసింది. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది. 2000 సంవత్సరంలో వచ్చిన గజగామిని తర్వాత బాలీవుడ్‌కు దూరమైంది. వరుస పరాజయాలతో ఆమె కెరీర్ ముగిసింది. ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ చేసింది.
నాగార్జున తో హిందీ సినిమా...
మోహన్‌బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా శిరోద్కర్. తెలుగులో ఆమె చేసిన స్ట్రెయిట్ మూవీ ఇదొక్కటే కావడం గమనార్హం. నాగార్జునతో హిందీలో ఖుదాగవా సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో మమ్ముట్టి, రోజాలతో ఓ సినిమా చేసింది.
బిగ్‌బాస్ 18 కంటెస్టెంట్స్ వీళ్లే...
బిగ్‌బాస్ 18లోకి శిల్పా శిరోద్కర్‌తో పాటు హిందీ టీవీ, సినిమా నటులతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. చాహత్ పాండే, షెహ్‌జాదా ధిమి, అవినాష్ మిశ్రా, తజిందర్ సింగ్ బగ్గా, శృతిక అర్జున్, నైర్రా బెనర్జీ, చమ్ దరంగ్, కరణ్ వీర్ మెహ్రా, రజత్ దళాల్, ముస్కాన్, అఫ్రీన్ ఖాన్ అతడి భార్య సారా అఫ్రీన్ ఖాన్, హేమా శర్మ, గన్ రతన్ కంటెస్టెంట్స్‌గా హౌజ్‌లో అడుగుపెట్టారు. టీవీ నటి ఐషాసింగ్, వివిన్ సేనా, అలీస్ కౌషిక్ , గద్‌రాజ్ కూడా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి ఈ షోకు హోస్ట్‌గా కొనసాగుతోన్నాడు సల్మాన్ ఖాన్.