Romantic Comedy OTT: థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వస్తోన్న బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ!
Romantic Comedy OTT: సంజయ్ దత్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఘడ్‌ఛడీ థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 9 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Romantic Comedy OTT: కేజీఎఫ్ 2 (Kgf 2) తర్వాత సంజయ్ దత్, రవీనా టాండన్ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతోంది. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ విలన్‌గా నటించగా...రవీనా టాండన్ ప్రైమ్ మినిస్టర్ రోల్ చేసింది. కానీ ఈ అప్‌కమింగ్ బాలీవుడ్ మూవీలో వీరిద్దరు భార్యభార్తలుగా కనిపించబోతున్నారు. ఘడ్‌ఛడీ పేరుతో తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకుండానే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది.
ఓటీటీ రిలీజ్ డేట్...
ఘడ్‌ఛడీ మూవీ జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ బాలీవుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో సినిమా మంగళవారం ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. రొమాంటిక్ కామెడీ కథతో రూపొందిన ఘడ్‌ఛడీ మూవీ ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. సినిమా కొత్త పోస్టర్‌ను జియోఓటీటీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
19 రోజుల్లో షూటింగ్ కంప్లీట్...
ఘడ్‌ఛడీ మూవీలో సంజయ్ దత్, రవీనా టాండన్‌తో పాటు మరో యువ జంటగా పార్థ్ సమతాన్, కుషాలీ కుమార్ కనిపించబోతున్నారు. 2022లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కేవలం 19 రోజుల్లో సింగిల్ షెడ్యూల్‌లో ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేశారు. ఈ సినిమా కథ మొత్తం ఓ ప్యాలెస్ చుట్టూ తిరుగుతుందని సమాచారం.
ఘడ్‌ఛడీ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీసిరీస్ పతాకంపై క్రిషన్‌కుమార్, భూషణ్ కుమార్ నిర్మించారు. 2022లోనే ఈ రొమాంటిక్ కామెడీ మూవీని థియేటర్లో రిలీజ్ చేయాలని ప్రయత్నించారు. సరైన బజ్ లేకపోవడంతో ఇతర కారణాల వల్ల మూవీ రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది.
గుల్షన్ కుమార్ తనయగా..
తాజాగా ఘడ్‌ఛడీ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. టీ సిరీస్ ఫౌండర్, దివంగత బాలీవుడ్ ప్రొడ్యూసర్ గుల్షన్ కుమార్ కూతురిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కుషాలీ కుమార్. ధోకా, స్టార్‌ఫిష్‌తో పాటు బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చసింది. కాగా టీవీ షో, సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన పార్థ్‌సమతాన్‌కు హీరోగా ఇదే ఫస్ట్ మూవీ.
తెలుగులో రెండు సినిమాలు...
కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ తర్వాత సౌత్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నాడు సంజయ్ దత్. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ రాజాసాబ్ లో ఓ కీలక పాత్ర పోషిస్తోన్నాడు. మారుతి దర్శకత్వంలో సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అలాగే రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న డబుల్ ఇస్మార్ట్‌లో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.
గత ఏడాది రిలీజైన దళపతి విజయ్ తమిళ మూవీ లియోలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం కన్నడంలో కేడీ అనే మూవీ చేస్తోన్నాడు సంజయ్ దత్. హిందీ, పంజాబీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.