Bigg Boss 8 Telugu Today Promo: బిగ్ బాస్‌లో మొదలైన నామినేషన్లు.. హౌజ్‌లో రచ్చ రచ్చ.. ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమో చూశారా?
03 September 2024, 13:58 IST
- Bigg Boss 8 Telugu Today Promo: బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ప్రేరణ, సోనియా, బేబక్క, నాగ మణికంఠ, శేఖర్ బాషా మధ్య తీవ్రంగా ఫైట్ జరిగింది.
బిగ్ బాస్‌లో మొదలైన నామినేషన్లు.. హౌజ్‌లో రచ్చ రచ్చ.. ఇవాళ్టి ఎపిసోడ్ ప్రోమో చూశారా?
Bigg Boss 8 Telugu Today Promo: బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభమైన తొలి రోజు నుంచే హౌజ్‌లో కంటెస్టెంట్ల మధ్య వాడీవేడిగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. మంగళవారమే (సెప్టెంబర్ 3) నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ రచ్చ మరింత ఎక్కువైంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ కాగా.. అందులో ప్రేరణ, సోనియా, బేబక్క, నాగ మణికంఠ, శేఖర్ బాషా మధ్య ఫైట్ తీవ్రంగా జరిగినట్లు కనిపిస్తోంది.
బిగ్ బాస్ 8 తెలుగు ఇవాళ్టి ప్రోమో
బిగ్ బాస్ 8 తెలుగు మంగళవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో హౌజ్ చీఫ్స్ అనౌన్స్‌మెంట్స్ తో మొదలైంది. ఈసారి హౌజ్ చీఫ్స్ గా నిఖిల్, యష్మి, నైనిక ఎంపికైనట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఆ ముగ్గురూ అక్కడున్న దండలను వేసుకొని తమకు కేటాయించిన చీఫ్ గద్దెల మీది నుంచి నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.
మొదటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని బిగ్ బాస్ చెప్పగానే సోనియా లేచి ఫస్ట్ బేబక్క అని చెప్పింది. ఆమె బాధ్యరహితంగా ఉంటుందని, కిచెన్ లో ఆమె పని తమకు నచ్చలేదని చెప్పింది. దీనికి బేబక్క ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది.
శేఖర్ బాషా వర్సెస్ నాగ మణికంఠ
ఆ తర్వాత నాగ మణికంఠ, శేఖర్ బాషా మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఊకే కట్టేసిన కుక్కలాగా అరవడం తనకు రాదని మొదట నాగ మణికంఠ అన్నాడు. నువ్వేమీ బిగ్ బాస్, జడ్జ్ కాదని శేఖర్ బాషా కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం నడిచింది.
ఆ తర్వత ప్రేరణ, సోనియా మధ్య కూడా బాగానే వాగ్వాదం నడిచింది. తన గురించి తాను డిఫెండ్ చేసుకుంటానని ప్రేరణ వాదించింది. నువ్వెవరు చెప్పడానికి నాకు అంటూ ప్రేరణ తీవ్రంగా స్పందించింది. ఇలా ఈ ప్రోమో అంతా కంటెస్టెంట్ల మధ్య ఫైట్ తోనే సాగిపోయింది. ఆ లెక్కన మంగళవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ చాలా హాట్ హాట్ గా నడిచే అవకాశం కనిపిస్తోంది.
బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్లు వీళ్లే..
బిగ్ బాస్ 8 తెలుగు ఆదివారం (సెప్టెంబర్ 1) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి ఎంటరయ్యారు. వీళ్లలో యష్మి గౌడ, నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్ అఫ్రిది ఉన్నారు.