తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: నాగార్జునతోనే తేల్చుకుంటానన్న టేస్టీ తేజ.. పదో తరగతైన పాస్ అయిండా అంటూ!

Bigg Boss: నాగార్జునతోనే తేల్చుకుంటానన్న టేస్టీ తేజ.. పదో తరగతైన పాస్ అయిండా అంటూ!

Sanjiv Kumar HT Telugu

03 November 2023, 12:43 IST

google News
  • Bigg Boss 7 Telugu Tasty Teja: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో శివాజీ, గౌతమ్, టేస్టీ తేజ మధ్యలో టాస్కుకు సంబంధించి డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే డైరెక్ట్ నాగార్జున సార్‌తోనే తేల్చుకుంటానని టేస్టీ తేజ కామెంట్స్ చేశాడు.

బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 2 ఎపిసోడ్ హైలెట్స్
బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 2 ఎపిసోడ్ హైలెట్స్

బిగ్ బాస్ 7 తెలుగు నవంబర్ 2 ఎపిసోడ్ హైలెట్స్

Bigg Boss 7 Telugu November 2nd Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. గర్జించే పులులు, వీర సింహాలు అంటూ రెండు టీమ్స్ గా విడగొట్టి ఇంటి సభ్యులతో గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు 7 నవంబర్ 2వ తేది ఎపిసోడ్‌లో బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్ జరిగింది. అందులో అర్జున్, అమర్ దీప్ గెలిచారు. శోభా శెట్టి, గౌతమ్ ఓడిపోయారు.

వేలి ముద్రగాళ్లం

ఛాలెంజ్ గెలవడంతో గర్జించే పులులు టీమ్‌‌కు అవతలి టీమ్ నుంచి 500 బాల్స్ తీసుకోవడం, ఒకరిని స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో గర్జించే పులులు టీమ్ బాల్స్ తీసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించి సింగర్ భోలేతో అశ్విని డిస్కషన్ పెట్టింది. ఇక్కడ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు.. మనమేమో ఎల్‌కేజీ కూడా చదువుకోని వేలి ముద్రగాళ్లం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. ఏం అనుకుంటున్నారో ఏమో.. ఒక్కొక్క నా కొడుకు.. మళ్లీ నాకు మంచి మాటలు వస్తాయి అని అశ్విని తన కోపాన్ని వెళ్లగక్కింది.

రైట్ ఎవరిచ్చారు

ఒక్కొక్కడు కనీసం పదో తరగతి అయినా పాస్ అయిండో లేదో.. ఒకరిని జడ్జ్ చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు. ఇక్కడ మనిషిని జడ్జ్ చేయడానికి రైట్ ఎవరు ఇచ్చారు. ఒక ముగ్గురు అయితే ఎంత నవ్వుకుంటున్నారో. వాళ్లను చూస్తే అంటూ అశ్విని ఫైర్ అయింది. దానికి వారంతా హౌజ్ మేట్స్. కంటెస్టెంట్స్ అంతే. వారికి మెచ్యూరిటీ లేదు అని సింగర్ భోలే అన్నాడు. తర్వాత టాస్క్ ముగిసిందని, ఎవరి టీమ్ బాల్స్ వారు సూట్‌కేస్‌లో పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.

ఎథిక్స్ లేకుండా

జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దొంగతనం చేయొచ్చు అని టేస్టీ తేజ, గౌతమ్ అనుకున్నారు. కానీ, అది ఫెయిర్ గేమ్ కాదు, అదే క్యారెక్టర్‌ను డిసైడ్ చేస్తుంది. నువ్ ఒక డాక్టర్‌వి, ఎథిక్స్ లేకుండా మాట్లాడతవా అంటూ శివాజీ అన్నాడు. అది మీ పర్సనల్ వస్తువులు దొంగతనం చేస్తే న్యా క్యారెక్టర్ కి బ్యాడ్. ఇది గేమ్ అన్న. మీకు గేమ్ సరిగా అర్థం కానట్టుంది అని గౌతమ్ అన్నాడు. దీనిపై ఇలాగే చర్చ సాగుతూనే వచ్చింది.

నేనే అడుగుతాను

ఇక రాత్రి బెడ్‌పై పడుకుని టేస్టీ తేజ.. శనివారం రోజున నాగార్జున సార్‌ను నేను అడుగుతాను. గేమ్‌లో ఇలా దొంగతనం చేయొచ్చా.. చేయొచ్చు అంటే.. ప్రతి గేమ్‌లో అలాగే చేద్దాం. లేదు అంటే.. అసలు దాని జోలికి కూడా పోకూడదు అని గౌతమ్, శివాజీతో అన్నాడు. నాకు క్లారిటీ ఉంది. కావాలంటే నువ్ అడుగు. నాకు చెప్పకు అని శివాజీ అన్నాడు. అదే నేనే అడుగుతాను అని టేస్టీ తేజ నాగార్జున సార్‌తోనే తేల్చుకుంటా అన్నట్లుగా బదులిచ్చాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం