Shobha Shetty: బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడని ఏడ్చేసిన శోభా శెట్టి.. లెటర్‌ అదేనంటూ సీక్రెట్ రివీల్-bigg boss 7 telugu november 1st episode highlights and shobha shetty reveals her boyfriend ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shobha Shetty: బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడని ఏడ్చేసిన శోభా శెట్టి.. లెటర్‌ అదేనంటూ సీక్రెట్ రివీల్

Shobha Shetty: బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడని ఏడ్చేసిన శోభా శెట్టి.. లెటర్‌ అదేనంటూ సీక్రెట్ రివీల్

Sanjiv Kumar HT Telugu
Nov 02, 2023 08:44 AM IST

Bigg Boss Shobha Shetty Boyfriend: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో శోభా శెట్టి తన బాయ్ ఫ్రెండ్ గురించి అసలు సీక్రెట్ బయట పెట్టేసింది. హౌజ్‌లో ఆమె ప్రవర్తన చూసి తన లవర్ వదిలేస్తాడేమోనని తేజతో చెప్పుకుంటూ బోరున ఏడ్చేసింది శోభా శెట్టి.

బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడని ఏడ్చేసిన శోభా శెట్టి.. లెటర్‌ అదేనంటూ సీక్రెట్ రివీల్
బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడని ఏడ్చేసిన శోభా శెట్టి.. లెటర్‌ అదేనంటూ సీక్రెట్ రివీల్ (Instagram)

Bigg Boss 7 Telugu November 1st Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ నవంబర్ 1వ తేది ఎపిసోడ్‌లో శోభా శెట్టి తన బాయ్ ఫ్రెండ్ గురించి అసలు సీక్రెట్ బయటపెట్టేసింది. ఎప్పుడూ అందరిపై అరుస్తూ.. అడ్డదిడ్డంగా వాగే శోభాకు తన ప్రవర్తనపై అనుమానం రావడమే కాకుండా అది చూసి తన బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడేమోనన్న భయం పట్టుకుంది. బిగ్ బాస్ గత ఎపిసోడ్‌లో టేస్టీ తేజతో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

నచ్చనట్లుగా చేస్తున్నా

బుధవారం లైవ్ ఎపిసోడ్‌లో శోభా శెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన టేస్టీ తేజ.. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు. భయంగా ఉంది తేజ. తనపై (బాయ్ ఫ్రెండ్) నమ్మకం ఉంది. కానీ భయంగా కూడా ఉంది. నన్ను వాడు బాగా అర్థం చేసుకుంటాడు. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. కానీ, ఒకవేళ ఏదైనా, నేను వాడికి నచ్చనట్లుగా బిహేవ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. అరవడం గురించి అయితే, అతనికి తెలుసు. కానీ అది కాకుండా ఇంకేదేమైనా ఉందేమో చెప్పలేం కదా అని శోభా అంది.

కామెడీ పీస్ గాడిని

బయట ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉన్నాను. చూసేవాళ్లు వేరే విధంగా ఆలోచించవచ్చు. నీ విషయాన్నే తీసుకుందాం. నీతో కలిసి ఉండటం అతనికి నచ్చకపోవచ్చు. ఎవరికీ తెలుసు. అంతే కదా అని పక్కన ఉన్న గౌతమ్‌ని అడిగింది. అది నీకే తెలియాలి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతారు. ఏదైనా జరగొచ్చు అని గౌతమ్ వెళ్లిపోయాడు. తర్వాత నేను ఒక కామెడీ పీస్ గాడిని, నీ మైండ్‌లో అది తీసేయ్ అని తేజ అన్నాడు.

ఇదే మంచి టైమ్

అది కాదు తేజ. నాకు వచ్చిన లెటర్ ఏదో తేడాగా ఉంది. వాడు కంప్లీట్‌గా మా మమ్మీ చెప్పినట్లే రాసి పంపించాడు. వాడు లాస్టులో స్ట్రాంగ్‌గా ఉండు బుజ్జీ అని మాత్రమే అన్నాడు. ఒకవేళ ఈ వీక్ తర్వాత లెటర్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది. అతని గురించి నేను ఎక్కడా చెప్పలేదు. ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే.. ఇదే మంచి టైమ్ అని అతని గురించి చెప్పాల్సి వచ్చింది అని శోభా అంది.

నేను తట్టుకోలేను

ఏం జరగదనే నమ్మకం అయితే ఉంది. నిజంగానే జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేను తేజా.. బై మిస్టేక్ ఏం జరిగినా తట్టుకోలేను. అతన్ని మర్చిపోలేను. ఇదంతా ఫన్ కోసమే చేస్తున్నానని అతనికీ తెలుసు. మన గురించి ఆ పర్సన్ ఇలా అనుకుంటాడంటే నిన్ను దూరం పెట్టేదాన్ని. కానీ ఒకవేళ అతనికి వేరే విధంగా అర్థం అయితే, నేను అస్సలు తట్టుకోలేను. నాకు బాగా గుర్తుకు వస్తున్నాడు అంటూ తెగ ఏడ్చేసింది శోభా శెట్టి. అలా ఎందుకు ఆలోచిస్తావ్. ఏం కాదు. పాజిటివ్‌గా ఉండూ అంటూ తేజ ఓదార్చే ప్రయత్నం చేశాడు.

Whats_app_banner