Ashu Reddy: 75 లక్షల కారు కొన్న బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి.. అతనితో పూజలు.. వాటికి చెక్ పెడుతూ వీడియో!-bigg boss fame ashu reddy buys new luxury range rover car price 75 lakhs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ashu Reddy: 75 లక్షల కారు కొన్న బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి.. అతనితో పూజలు.. వాటికి చెక్ పెడుతూ వీడియో!

Ashu Reddy: 75 లక్షల కారు కొన్న బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి.. అతనితో పూజలు.. వాటికి చెక్ పెడుతూ వీడియో!

Sanjiv Kumar HT Telugu
Nov 01, 2023 10:02 AM IST

Ashu Reddy New Car: బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్‌ ద్వారా తెగ పాపులర్ అయిన బ్యూటిఫుల్ భామ అషు రెడ్డి. తాజాగా ఆమె మరో కొత్త లగ్జరీ కారు కొనడమే కాకుండా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన జ్యోతిష్కుడు వేణుస్వామితో పూజలు కూడా చేయించింది.

రూ 75 లక్షల కారు కొన్న బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి
రూ 75 లక్షల కారు కొన్న బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి (Instagram)

తెలుగు పాపులారిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమందికి సూపర్ క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ ద్వారా చాలా తక్కువ మందికి మంచి క్రేజ్ వస్తే.. చాలా మందికి నెగెటివ్ అయింది. మంచి పేరుతోపాటు పాపులర్ అయిన బిగ్ బాస్ ముద్దుగుమ్మల్లో అషు రెడ్డి ఒకరు. సోషల్ మీడియా వాడకంగా ఎక్కువగా లేని సమయంలో డబ్‌స్మాష్ వీడియోలతో సూపర్ క్రేజ్ అందుకున్న అషు రెడ్డి తర్వాత బిగ్ బాస్ ద్వారా చాలా పాపులర్ అయింది.

సినిమాలతో కాకుండా

కింగ్ నాగార్జున హోస్టుగా బాధ్యతలు చేపట్టిన మొదటి సీజన్ బిగ్ బాస్ తెలుగు 3లోకి అడుగు పెట్టిన అషు రెడ్డి తన అందచందాలు, ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సింగర్ అండ్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చనువుగా ఉంటూ మరింత హైలెట్ అయింది. బిగ్ బాస్ తర్వాత చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, పోకస్ వంటి సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సినిమాల పరంగా హిట్ కానీ అషు రెడ్డి సోషల్ మీడియాలో అందాలతో మాత్రం తెగ హైలెట్ అయింది.

ప్రత్యేక పూజలు

ఇన్ స్టా వేదికగా హాట్ షోతో రెచ్చిపోయే అషు రెడ్డి తాజాగా మరో వీడియోతో నెటిజన్లను, తెలుగు ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. తాజాగా అషు రెడ్డి మరో కొత్త లగ్జరీ కారు అయిన రేంజ్ రోవర్‌ను కనుగోలు చేసింది. దాని ఖరీదు సుమారు రూ. 70 లక్షలు. అంత ఖరీదైన కారుకు సెలబ్రిటీల జాతకం చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయిన జ్యోతిష్కుడు వేణు స్వామితో పూజలు చేయించింది. అషు రెడ్డి ఇంట్లో కొత్త కారు రేంజ్ రోవర్‌రు వేణుగోపాల స్వామి ప్రత్యేక పూజలు చేశారు.

విసిగించకుండా

ఇదిలా ఉంటే సాధారణంగా సెలబ్రిటీలు చేసే పనులకు, చేష్టలకు నెట్టింట్లో ట్రోలింగ్ అవుతుంటారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతుంటారు. కాబట్టి, ఆ కామెంట్లకు చెక్ పెడుతూ కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసి మరి కొత్త కారు పూజకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది అషు రెడ్డి. అంటే నెటిజన్లు విసిగించే మాటలు, కామెంట్ల బారిన తప్పించుకోవడానికి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే, అషు రెడ్డి కొత్త కారు వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

టీ20 వరల్డ్ కప్ 2024