తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Contestant In Rc 16: రామ్‍చరణ్ సినిమాలో బిగ్‍బాస్ కంటెస్టెంట్‍.. స్టేజీపైనే ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు

Bigg Boss Contestant in RC 16: రామ్‍చరణ్ సినిమాలో బిగ్‍బాస్ కంటెస్టెంట్‍.. స్టేజీపైనే ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు

12 November 2023, 19:44 IST

google News
    • RC 16: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‍లో రూపొందనున్న సినిమాలో బిగ్‍బాస్ కంటెస్టెంట్‍కు అవకాశం లభించింది. ఈ విషయాన్ని బిగ్‍బాస్ స్టేజీపైనే దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. వివరాలివే..
డైరెక్టర్ బుచ్చిబాబు
డైరెక్టర్ బుచ్చిబాబు

డైరెక్టర్ బుచ్చిబాబు

RC 16: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తదుపరి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాకు చేయనున్నారు రామ్‍చరణ్. ఇది రామ్‍చరణ్‍కు 16వ సినిమా (RC16)గా ఉండనుంది. వచ్చే ఏడాది ఆర్‌సీ 16 పట్టాలు ఎక్కనుంది. కాగా, ఈ ఆర్‌సీ 16 సినిమాలో బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍ కంటెస్టెంట్ ఒకరు నటించడం పక్కా అయింది.

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో నేడు (నవంబర్ 11) దీపావళి స్పెషల్ ఎపిసోడ్‍కు డైరెక్టర్ బుచ్చిబాబు సాన.. అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఓ విషయం వెల్లడించారు. ఆర్‌సీ 16 చిత్రంలో బిగ్‍బాస్ కంటెస్టెంట్ అంబటి అర్జున్.. మంచి క్యారెక్టర్ చేస్తున్నారని స్టేజ్‍పైనే ప్రకటించారు.

“సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావ్ ఇప్పుడు రామ్‍చరణ్ ఫిల్మ్‌లో” అని అంబటి అర్జున్‍తో డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు. దీంతో సంతోషంతో థాంక్యూ బుచ్చి అన్న.. థాంక్యూ అని అన్నారు అంబటి అర్జున్. దీంతో రామ్‍చరణ్ సినిమాలో అర్జున్ నటించడం ఖరారైంది.

స్టార్ మా ఛానెల్‍ సీరియల్ దేవత ద్వారా అంబటి అర్జున్ పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా రామ్‍చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.

రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‍లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‍లో మూవీ ఉండనుంది. భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందనుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుడటంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఉంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు తొలి చిత్రం ఉప్పెనలోనూ సేతుపతి కీరోల్ చేశారు.

శంకర్ డైరెక్షన్‍లో రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. అయితే, ఇండియన్ 2 సినిమాను కూడా శంకర్ చేస్తుండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమవుతోంది. దీపావళికి రావాల్సిన తొలి పాట జరగండి రిలీజ్ కూడా వాయిదా పడింది. వచ్చే ఏడాది చివర్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం