Bigg Boss 6 Telugu Episode 24: ఇనాయాకు సారీ చెప్పిన మెరీనా.. అర్జున్ పులిహోర వేస్ట్.. అస్సలు పట్టించుకోని శ్రీసత్య..!
28 September 2022, 6:43 IST
- Bigg Boss 6 Fourth week captaincy Contender Task: బిగ్‌బాస్ 6 నాలుగో వారం కెప్టెన్సీ కంటెండెర్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా చంటీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. మరోపక్క అర్జున్ మాత్రం శ్రీసత్యకు పులిహోర కలపడం మారలేదు. అయితే ఆమె మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.
బిగ్‌బాస్ 6 లేటెస్ట్ ఎపిసోడ్
Bigg Boss 6 Telugu Day 23 Episode 24: సోమవారం జరిగిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నామినేషన్‌లు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఎవరినైనా టార్గెట్ చేస్తే వారి గ్రాఫ్ బీభత్సంగా పెరిగిపోతుందనే చిన్న విషయాన్ని విస్మరించిన హౌస్ మేట్స్.. వరుస పెట్టి ఇనాయాను నామినేట్ చేశారు. ఎంతలా అంటే 9 మంది ఆమెను వెళ్లిపోవాలని నామినేషన్ చేశారు. అయితే లోపల ఎలా ఉన్నప్పటికీ బయట మాత్రం ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బిగ్‌బాస్ టాప్-5లో ఉన్న ఆశ్చర్యోపోనక్కర్లేదు అనేంతగా ఓటింగ్ పోల్ అవుతోంది. ఇక మంగళవారం ఎపిసోడ్ దగ్గరకొస్తే.. కెప్టెన్స్ కంటెండెర్ కోసం ఇచ్చిన హోటెల్ టాస్క్ రంజుగా సాగింది.
ఇనాయాకు మెరీనా సారీ..
ఎపిసోడ్ ప్రారంభంలో ఇనాయను నామినేట్ చేసిన మెరీనా రోహిత్.. ఈ రోజు ఆమె దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని ఓదార్పు యాత్ర ప్రారంభించింది. నామినేట్ చేసినందుకు వీరిద్దరూ ఆమెకు సారీ చెప్పారు. మరోపక్క ఫైమా.. సొంత టీమ్‌లో ఉండి ఎవరూ స్టాండ్ తీసుకోకపోయినా బాధపడలేదని, మెరీనా-రోహిత్ నామినేట్ చేయడం తనను ఎంతో బాధించిందని స్పష్టం చేసింది ఇనాయ. అనంతరం వాసంతి దగ్గర కూర్చొని గ్రూపులో ఎవరి గేమ్ వాళ్లు ఆడుకున్నారు. తాను మాత్రం గెలవాలని ఆడానని, అందుకే అందరి దృష్టిలో చెడ్డదాన్ని అయిపోయానని తెలిపింది.
మరోపక్క శ్రీహాన్ తనలో తాను మాట్లాడుకుంటూ కనిపించాడు. ఈ నామినేషన్స్ ఏంటో.. ఒకడేమో ఏం మాట్లాడతాడో వాడికో తెలియదు.. ఈమె(ఇనాయ) ఏమో అన్నది ఒకటి అయితే దాంట్లో వేరే నానార్థాలు తీస్తుంది. నా ఏజ్ ఎక్కువ అని చెప్పుకుంటే.. నాకు ఏజ్ ఎక్కువనా.. బాడీ షేమింగ్ అంటుంది. ఈమెకు ఆస్కార్ కూడా తక్కువే అంటూ స్పందించాడు.
నాగార్జున చెప్పినా.. ఇంకా ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం ఇంకా మానుకోలేదు. ఈ సారి ఎలిమినేషన్ చాలా టఫ్‌గా ఉంటుందని ఎవరైనా వెళ్లవచ్చని తెలిపాడు. సూర్య, రేవంత్, గీతూ, శ్రీహాన్ ఈ నలుగురు మినహా ఎవరైనా వెళ్లే అవకాశముందని తెలిపాడు. ఇనాయా కూడావెళ్లదని రేవంత్ అంటే.. అవును ఆమె కూడా వెళ్లదని జోస్యం చెప్పాడు. పైకి ధైర్యంగా ఉన్నా.. నాకు కూడా భయంగా ఉందని రేవంత్ అంటే.. నువ్వు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావ్.. నిన్ను ఎలిమినేట్ చేయరు అది పక్కా అని ఆదిరెడ్డి స్పష్టం చేశాడు.
చంటికి సీక్రెట్ టాస్క్..
ఉదయం పైసా వసూల్ సాంగ్‌తో బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌ను నిద్రలేపారు. అనంతరం కాసేపటికే పడుకుని ఉన్నా చలాకీ చంటిని లేపి కన్‌ఫెషన్ రూమ్‌కు రమ్మని పిలిచాడు. దీంచో చిరాగ్గానే చంటి అక్కడకు వెళ్లాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం బీబీ హోటెల్ అనే టాస్క్ ఇస్తున్నట్లు, అలాగే తనకు సీక్రెట్ టాస్క్ ఇస్తున్నానని బిగ్‌బాగాస్ చెప్తారు. ఈ టాస్క్ సరిగ్గా పూర్తి చేస్తే కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధిస్తావని స్పష్టం చేశాడు. ఇంతలో కన్‌ఫెషన్ రూమ్ తలుపు దగ్గర ఉండి.. బిగ్‌బాస్ ఏం చెబుతున్నాడో సీక్రెట్‌గా వినేందుకు ప్రయత్నించింది గీతూ. దీంత బిగ్‌బాస్ గీతూను.. నీకు అక్కడ ఏం పని అంటూ చురకలంటిస్తాడు.
హోటెల్ vs హోటెల్ అనే ఈ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇస్తాడు. ఇందులో బీబీ హోటెల్‌తో గ్లామ్ ప్యారడైజ్ అనే మరో హోటెల్ ఉంటుంది. మొదటి హోటెల్‌కు సుదీప మేనేజర్ కాగా.. రెండో హోటెల్‌కు ఫైమా మేనేజర్‌గా బాధ్యతలను ఇచ్చారు. చంటి బీబీ హోటెల్‌లో సహాయకుడిగా ఉంటూనే.. కస్టమర్లను తమ హోటెల్‌కు కాకుండా.. గ్లామ్ ప్యారడైజ్ హోటెల్‌కు పంపేలా ప్రేరేపించాలని సీక్రెట్ టాస్క్ ఉంటుంది. అయితే మనోడు సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. మరి తర్వాత ఎపిసోడ్‌లోనైనా ఎలా ఉంటుందో చూడాలి.
అర్జున్‌ను నాకిస్తున్న శ్రీసత్య.. అస్సలు దేకడం లేదు..
మరోపక్క అర్జున్ కల్యాణ్.. శ్రీసత్యకు పులిహోర కలపడం మాత్రం మానలేదు. ఇంకా తన ట్రైల్స్ ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇదే అదునుగా శ్రీసత్య కూడా అతడికి సేవలన్నీ చేస్తూనే డబ్బు మాత్రం బాగా గుంజుతుంది. అతడు కూడా వర్కౌట్ అయితే చాలు అనేంతగా.. శ్రీసత్యకు డబ్బు తెగ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతానికి మిగిలిన వారి కంటే ఆమె వద్దే ఎక్కువగా డబ్బులున్నట్లు తెలుస్తోంది. సుదీప, బాలాధిత్య హెచ్చరిస్తున్నప్పటికీ అర్జున్ కల్యాణ్.. శ్రీసత్య కోసం ఆరాట పడుతూనే ఉన్నాడు. అయితే ఆమె మాత్రం టాస్క్‌లో భాగంగా అతడితో క్లోజ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుందే తప్పా.. కనీసం వేరే టైమ్‌లో అస్సలు పట్టించుకోవడలేదు. నోట్లో భోజనం పెడితే.. టిప్ ఇస్తానని చెబుతాడు అర్జున్. ఇందుకు శ్రీ సత్య కూడా సానుకూలంగా స్పందించి అతడికి నోట్లో భోజనం పెడుతుంది. అయితే ఎఫెక్షన్‌తో పెడతుందో, టాస్క్‌లో భాగంగా పెడుతుందో అస్సలు అర్ధం చేసుకోవడం లేదు. పైపెచ్చు.. నువ్వు కూడా తినొచ్చుగా అని అర్జున్ అడుగ్గా.. నీకు చేత్తో పెడుతూ.. నేనెలా తింటాను? అని ప్రశ్నించింది శ్రీ సత్య. ఇక్కడే అర్థమవుతుంది.. అర్జున్‌పై తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని. కానీ మనోడు మాత్రం ఆమె కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ.. గేమ్‌ను నాశనం చేసుకుంటున్నాడు.