Telugu News  /  Entertainment  /  Adi Reddy Became New Captain Of Bigg Boss 6 Telugu
కొత్త కెప్టెన్‌గా ఆదిరెడ్డి
కొత్త కెప్టెన్‌గా ఆదిరెడ్డి (Twitter)

Bigg Boss 6 Telugu Episode 20: బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆదిరెడ్డి.. ఇనాయాను కావాలనే రెచ్చగొట్టానన్న గీతూ..!

24 September 2022, 7:05 ISTMaragani Govardhan
24 September 2022, 7:05 IST

Adi Reddy As New Captain of House: ఈ రోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా ఆది రెడ్డి ఎంపికయ్యాడు. కెప్టెన్సీ టాస్క్‌లో అందరి కంటే మెరుగైన ప్రదర్శన చేసిన ఆదిరెడ్డి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.

Bigg Boss 6 telugu day 19 Episode 20: బిగ్‌బాస్ సీజన్ 6 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. క్రితం ఎపిసోడ్‌తో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గినప్పటికీ.. ఇంటికి కొత్త కెప్టెన్ వచ్చాడు. అడవిలో దొంగలు పడ్డారు అనే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్‌లో భాగంగా ఐదుగురు కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ పడగా.. రెండో దశకు చేరుకున్నారు. శ్రీసత్య, శ్రీహాన్ ఆది రెడ్డి ఈ ముగ్గురు కెప్టెన్సీ రెండో టాస్క్‌లో తీవ్రంగా పోటీ పడ్డారు. మూడు ఇసుక తొట్టెలు ఇచ్చి.. డబ్బాలతో ఇసుకు తీసుకుని వెళ్లి ఆ తొట్టెలు నింపాలని.. ముందుగా ఎవరి తొట్టె అయితే నిండుతుందో వాళ్లు హౌస్‌కు కెప్టెన్ అవుతారని చెప్పారు. అయితే ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి తీవ్రంగా శ్రమించి తొట్టె నింపి కెప్టెన్ అయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆరున్నర అడుగులున్న ఆదిరెడ్డికి హైట్ కూడా అడ్వాంటేజ్ కావడంతో అతడి పని ఇంకా తేలికైంది. అయితే శ్రీహాన్ కూడా ఆదిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చాడు. ఆదిరెడ్డి తొట్టె అలా పైకి లేస్తుందనగా.. శ్రీహాన్ తొట్టె నిండుతుంది. సెకన్ల వ్యవధిలో ఆదిరెడ్డి ముందు ఉండటంతో అతడు కెప్టెన్ అయ్యాడు. చివరి వరకు వచ్చి ఓడినందుకు శ్రీహాన్ నిరుత్సాహపడతాడు. ఇలాంటి ఫిజికల్ టాస్క్‌లు మగవారితో ఆడవాళ్లు పోటీ పడటం కాస్త కష్టమే. శ్రీసత్య వీరిద్దరితో పోటీ పడినప్పటికీ.. ఫిజికల్ టాస్క్ అయినందున శ్రీసత్య చివర్లో నిలిచింది. కెప్టెన్ అయిన ఆదిరెడ్డి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఐ లవ్యూ కవితా.. నువ్వు హ్యాపీనా అంటూ తన భార్యను తలచుకుని హ్యాపీగా ఫీలయ్యాడు. కెప్టెన్ అయిన ఉద్వేగంలో కేకలు వేశాడు. ఇక్కడ వరకు రావడమే ఎక్కువ.. అలాంటిది బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్‌ కావడం మరింత ఆనందంగా ఉందని స్పష్టం చేశాడు.

గత ఎపిసోడ్‌లో నాగార్జున మందలించినప్పటికీ.. ఆది, గీతూ ఇద్దరూ రివ్యూలు ఇచ్చుకోవడం మానలేదు. ఇనాయాను కావాలనే ట్రిగర్ చేశానని, తనకి అదే ఇష్టమని చెప్పింది గీతూ. నెగిటవ్ బయటకు తీయడమే ఇక్కడ గేమ్ అని, అది బయటకు తీయాలంటే ఆమెను రెచ్చగొట్టాలని అదే నేను చేశానని స్పష్టం చేసింది. అయితే తనకు అలా చేయడం ఇష్టముండదని ఆదిరెడ్డి చెప్పాడు. నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీహాన్.. ఇనాయాను పిట్ట అని పిలవడంతో ఆమె పెద్దగా శ్రీహాన్‌పై విరుచకుపడింది. వీరిద్దరి మధ్య గొడవ ఓ రేంజ్‌లో జరిగింది. మధ్యలో గీతూ దూరి ఇనాయాను రెచ్చగొట్టేలా మాట్లాడింది.

గంట ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల్లో ఎవరికి ఎక్కువ టైమ్ వస్తుందని అనుకుంటున్నారో తేల్చుకోమని బిగ్‌బాస్ ఆదేశించారు. ఇందులో భాగంగా అందరికంటే ఎక్కువగా 10 నిమిషాల ఫుటేజ్ ఎవరికి ఉంటుందనే ప్రశ్నకు.. గీతూ తన గురించి తెలియజేసింది. పాజిటివో, నెగటివో తను ఎక్కువగా అన్ని టాస్క్‌ల్లో ఇన్వాల్వ్ అవుతానని స్పష్టం చేసింది. దీంతో ఇంటి సభ్యులు కూడా ఆమె వాదన సరైందేనని చెప్పి ఆ బ్యాడ్జ్ ఆమెకు ఇచ్చారు. అనంతరం 7 నిమిషాల ఫుటేజ్ రేవంత్‌కు ఇచ్చారు. ఈ విషయంలో వీరిద్దరికి సరైన నిర్ణయమే తీసుకున్నారని అనిపించింది. కానీ తర్వాత వాసంతి కృష్ణన్‌కు ఐదు నిమిషాల ఫుటేజ్ ఇవ్వడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. మూడు వారాల్లో ఆమె పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయినా ఓటింగ్ ప్రకారం ఆమెకు ఇచ్చారు. చివరకు ఎలాంటి ఫుటేజ్ లేని వారిగా కీర్తి, ఆరోహి, అర్జున్ ఉన్నారు.

ఈ ముగ్గురిలో ఒకరు తేల్చుకుని జైలుకు వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో మహిళలకు బదులు తాను వెళ్తానని అర్జున్ నిర్ణయించుకోవడంతో అతడు జైలుకు వెళ్తాడు. అయితే తనను వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంచుకోవడంపై కీర్తి తెగ ఎడ్చేసింది. మేకప్ ఏస్తే ఒక విధంగా.. లేకపోతే మరో విధంగా ఉంది కీర్తి. మరోపక్క ఈ మూడు వారాల్లో పెద్దగా ప్రదర్శన చేయని వాసంతి కృష్ణన్ ఈ వారం తనే ఎలిమినేట్ అవుతానని ఫిక్స్ అయింది. ఇనాయా దగ్గర కూర్చుని నువ్వు, నేను, ఆరోహి డేంజర్ జోన్‌లో ఉన్నామని తెలిపింది.

ఆరోహి, ఆర్జే సూర్య సరసాలు శ్రుతి మించేలా ఉన్నాయి. ఆరోహితో ఎప్పుడు చూసిన పులిహోర కలుపుతూ కనిపిస్తున్న సూర్య.. బిగ్‌బాస్ హౌస్‌కు దీనికేనా వచ్చింది అనేలా ప్రవర్తిస్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం కాస్త తేడాగానే ఉంది. ఆరోహిని, సూర్య మరింత దగ్గరగా తీసుకోవడం అస్సలు నచ్చలేదు. అర్ధరాత్రి ముచ్చట్లు, కెప్టెన్‌కు మాత్రమే యాక్సెస్ ఇచ్చిన బాల్కనీ ఏరియాలో ఉన్న ఫుడ్ ఐటెమ్స్ దొంగిలించడం లాంటి చేష్టలతో చిరాకు పుట్టిస్తున్నారు.