Abhinaya Sri comments on Bigg Boss: బిగ్‌బాస్‌ తనకు అన్యాయం చేశాడని అభినయ ఆవేదన.. 5 లక్షల పారితోషికంపై క్లారిటీ..!-abhinaya sri fires on bigg boss show and she called unfair
Telugu News  /  Entertainment  /  Abhinaya Sri Fires On Bigg Boss Show And She Called Unfair
అభినయశ్రీ
అభినయశ్రీ

Abhinaya Sri comments on Bigg Boss: బిగ్‌బాస్‌ తనకు అన్యాయం చేశాడని అభినయ ఆవేదన.. 5 లక్షల పారితోషికంపై క్లారిటీ..!

20 September 2022, 13:21 ISTMaragani Govardhan
20 September 2022, 13:21 IST

Abhinaya Sri Comments on Bigg Boss: బిగ్‌బాస్ 6 రెండో వారంలో ఎలిమినేట్ అయిన అభినయశ్రీ బయటకు వచ్చిన తర్వాత ఆ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ తనకు అన్యాయం చేశాడని స్పష్టం చేసింది.

Abhinaya Sri Shocking Comments on Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6 మొదటి వారం ఎలిమినేషన్ జరగని సంగతి తెలిసిందే. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో షానీ, అభినయశ్రీ ఇద్దరూ బయటకు వచ్చారు. అయితే ప్రతిసారి ఎలిమినేట్ అయినవారు తమ బాధను, అసంతృప్తిని బయటకు వెళ్లగక్కడం సాధారణమే. కానీ ఇటీవలే ఎలిమినేట్ అయిన అభినయశ్రీ మాత్రం ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంది. బిగ్‌బాస్ తనకు అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రెండో వారం నామినేషన్‌లో తక్కువ ఓట్లు తనకు రాలేదని, అయినా నేను ఇక్కడ ఉండటానికి కారణమేంటో తెలియడం లేదని తెలిపింది. మరోపక్క మొదట బయటకు వచ్చిన షానీ మాత్రం పెద్దగా ఎక్కడ మాట్లాడకపోవడం గమనార్హం.

అభినయశ్రీ ఈ విధంగా రెండో వారమే బయటకు రావడాన్ని జీర్ణించుకోలేపోతుంది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా షోపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంది. బిగ్‌బాస్ అంటే అంతా మోసమని అసహనం వ్యక్తం చేస్తోంది. హౌస్‌లో ఉన్నప్పుడు తన ఫుటేజే సరిగ్గా ఇవ్వలేదని, స్క్రీన్‌పై తనను అస్సలు చూపించలేదని స్పష్టం చేసింది. 24 గంటల ఎపిసోడ్‌లోనూ తనను చూపించలేదని స్పష్టం చేసింది.

"నా లాంటి వాళ్లను తీసుకొచ్చి ఈ విధంగా బయటకు పంపడం అన్యాయం. నేను బెస్ట్ అవ్వకపోయినా.. బెస్ట్ ఎఫర్ట్స్ మాత్రం పెట్టాను. నేను ఆడలేదంటే అస్సలు ఒప్పుకోను. హౌస్‌లో అందరితో మాట్లాడుతూ కలిసిపోయాను. స్క్రీన్‌పై అస్సలు చూపించలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం నాకు మా అమ్మ, నా స్నేహితులు చెబితే తెలిసింది. బయటకు వచ్చాక చూసుకుంటే నాకు ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో అర్థమైంది. నేనోంటో ప్రూఫ్ చేసుకుని ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇద్దామని ఆశతో వచ్చిన నాకు బిగ్‌బాస్ పెద్దగా ఉపయోగపడలేదు." అని అభినయశ్రీ స్పష్టం చేసింది.

రెండు వారాలు బిగ్‌బాస్‌లో ఉన్నందుకు రోజుకు 40 వేల చొప్పున దాదాపు రూ.5 లక్షల పారితోషికం అందుకున్నారా? అనే ప్రశ్నకు అభినయశ్రీ అస్సలు కాదని సమాధానమిచ్చింది. రెమ్యూనరేషన్‌పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసింది. తనది అంత పెద్ద పారితోషికం కాదని, బిగ్‌బాస్ షోలో తనకు రూ.5 లక్షసు ఇచ్చాడని వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని స్పష్టం చేసింది.

సంబంధిత కథనం

టాపిక్