తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bichagadu 2 Collections: దుమ్ము రేపిన బిచ్చగాడు 2.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అదుర్స్

Bichagadu 2 Collections: దుమ్ము రేపిన బిచ్చగాడు 2.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అదుర్స్

Hari Prasad S HT Telugu

22 May 2023, 18:06 IST

google News
    • Bichagadu 2 Collections: దుమ్ము రేపింది బిచ్చగాడు 2 మూవీ. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కూడా కలెక్షన్లకు కలిసొచ్చింది.
బిచ్చగాడు 2
బిచ్చగాడు 2

బిచ్చగాడు 2

Bichagadu 2 Collections: అప్పుడెప్పుడో వచ్చిన బిచ్చగాడు మూవీకి సీక్వెల్ గా వచ్చిన సినిమా బిచ్చగాడు 2. ఆరున్నరేళ్ల కిందట ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా సీక్వెల్ మాత్రం తొలి రోజు నుంచే దుమ్ము రేపుతోంది. తమిళనాడులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ బిచ్చగాడు 2 మంచి కలెక్షన్లు సాధించింది.

విజయ్ ఆంటోనీ నటించి, డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.9.5 కోట్లు వసూలు చేయడం విశేషం. ఓ చిన్న తమిళ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం మామూలు విషయం కాదు. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ వారం కూడా బిచ్చగాడు 2 కలెక్షన్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

నిజానికి తమిళనాడు కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం. విజయ్ ఆంటోనీతోపాటు కావ్యా థాపర్, దేవ్ గిల్, జాన్ విజయ్, యోగి బాబులాంటి వాళ్లు ఇందులో నటించారు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా విజయ్ ఆంటోనీయే అందించాడు.

విజ‌య్ గురుమూర్తి, స‌త్య‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తోకూడిన క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ ఆంటోనీ న‌ట‌న బాగుంది. పాజిటివ్‌, నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. అత‌డి క్యారెక్ట‌ర్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. హీరోగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా ఫ‌స్ట్ సినిమానే మంచి మార్కులు కొట్టేసాడు. అత‌డు అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్ల‌స్స‌యింది. హేమ‌గా కావ్య‌థాప‌ర్ ప‌ర్వాలేద‌నిపించింది. దేవ్‌గిల్‌, రాధార‌వి త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

పేరుకే సీక్వెల్ గానీ రెండు క‌థ‌ల‌కు పెద్ద‌గా సంబంధం ఉండ‌దు. బిచ్చ‌గాడు సెంటిమెంట్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తే సీక్వెల్ మాత్రం బ్రెయిన్ మార్పిడి అనే ప్ర‌యోగాత్మ‌క పాయింట్‌కు యాక్ష‌న్ అంశాల‌ను జోడించి న‌డిపించారు. చివ‌రి వ‌ర‌కు క‌థ‌ను ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు విజ‌య్ ఆంటోనీ. బ్రెయిన్ మార్పిడి త‌ర్వాత విజ‌య్ ప్లేస్‌లోకి వ‌చ్చిన సత్యం ఏం చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఊహ‌ల‌కు అందకుండా చ‌క్క‌టి మ‌లుపుల‌తో స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు.

తదుపరి వ్యాసం