తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Best Sci-fi Movies On Otts: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే.. తెలుగు మూవీస్ కూడా..

Best Sci-Fi movies on OTTs: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే.. తెలుగు మూవీస్ కూడా..

Hari Prasad S HT Telugu

23 April 2024, 16:44 IST

    • Best Sci-Fi movies on OTTs: ఓటీటీల్లో అన్ని జానర్లలాగే సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ జానర్ లో ఇంగ్లిష్ తోపాటు కొన్ని మంచి తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి.
ఓటీటీల్లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే.. తెలుగు మూవీస్ కూడా..
ఓటీటీల్లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే.. తెలుగు మూవీస్ కూడా..

ఓటీటీల్లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే.. తెలుగు మూవీస్ కూడా..

Best Sci-Fi movies on OTTs: సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) జానర్ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ సినిమాలను మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇలాంటి సినిమాలు తీయడంలో హాలీవుడ్ వాళ్లది అందెవేసిన చేయి. అయితే తెలుగులోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ జానర్ నుంచి వచ్చాయి. ఆ సినిమాలు ఏంటి? వాటిని ఏ ఓటీటీల్లో చూడాలో ఒకసారి చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Prasar Bharati OTT: ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఆనెలలో ప్రారంభం కానుందా?

Aranmanai 4 Collection: యావరేజ్ టాక్‌తో దుమ్ముదులుపుతున్న తమన్నా హారర్ మూవీ అరణ్మనై 4.. ఎన్ని కోట్లో తెలుసా?

Kalvan OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ కల్వన్.. తెలుగులో కూడా..

Super Jodi Winner: జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ విజేతలుగా శ్రీసత్య-సంకేత్​

ఓటీటీల్లోని బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సై-ఫి మూవీస్ ఉన్నాయి. ఈ జానర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాలను చూడొచ్చు.

ఒకే ఒక జీవితం - సోనీలివ్

టైమ్ ట్రావెల్ కథతో తెలుగులో రూపొందిన మూవీ ఒకే ఒక జీవితం. శర్వానంద్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అమల అక్కినేని నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ - ప్రైమ్ వీడియో

ఇది కూడా తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. వరుణ్ తేజ్, అదితి రావ్, లావణ్య త్రిపాఠీ నటించిన ఈ సినిమాను సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇదొక స్పేస్ అడ్వెంచర్ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.

యశోద - ప్రైమ్ వీడియో

సరోగసీ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ మూవీ యశోద. సమంత లీడ్ రోల్లో నటించింది. థియేటర్లలో ఈ మూవీకి అంతగా రెస్పాన్స్ లేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

2.0 - జియో సినిమా

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 2.0. ఇందులో అక్షయ్ కుమార్ కూడా నటించాడు. మొబైల్ టవర్ల వల్ల పక్షులు మృత్యువాత పడటం, వాటిని కాపాడటానికి ఓ పక్షి ప్రేమికుడు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జియో సినిమాలో ఈ మూవీ చూడొచ్చు.

బెస్ట్ హాలీవుడ్ సై-ఫి మూవీస్

ఇంటర్‌స్టెల్లార్ - ప్రైమ్ వీడియో

క్రిస్టఫర్ నొలాన్ డైరెక్ట్ చేసిన ఇంటర్‌స్టెల్లార్ మూవీ మనల్ని మొత్తంగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మన గెలాక్సీ దాటిపోయి తారాలోకంలోకి చేసే ప్రయాణమే ఈ ఇంటర్‌స్టెల్లార్. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూసే వీలుంది.

ది మ్యాట్రిక్స్ - నెట్‌ఫ్లిక్స్

జురాసిక్ పార్క్ - నెట్‌ఫ్లిక్స్

హర్ - ప్రైమ్ వీడియో

అవతార్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

బ్లేడ్ రన్నర్ 2049 - ప్రైమ్ వీడియో

ది మార్షన్ - హాట్‌స్టార్

ఇన్సెప్షన్ - ప్రైమ్ వీడియో

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - నెట్‌ఫ్లిక్స్

అరైవల్ - ప్రైమ్ వీడియో

గ్రావిటీ - ప్రైమ్ వీడియో

ఎ క్వైట్ ప్లేస్ - ప్రైమ్ వీడియో

ది టర్మినేటర్ - ప్రైమ్ వీడియో

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం