Balakrishna |బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..
22 May 2022, 6:53 IST
టాలీవుడ్‌లో అపజయమే లేని దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు అనిల్‌రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన ఎఫ్3 చిత్రం మే 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా అనంతరం బాలకృష్ణతో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు అనిల్‌రావిపూడి. ఎఫ్3 ప్రమోషన్స్ లో బాలకృష్ణ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని అనిల్ రావిపూడి వెల్లడించారు.
బాలకృష్ణ, అనిల్ రావిపూడి
అఖండ సినిమాతో గత ఏడాది పెద్ద విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ. కరోనా కారణంగా సంక్షోభంలో మునిగిపోయిన తెలుగు సినీ పరిశ్రమలో ఈ విజయం ఉత్సాహాన్ని నింపింది. ఈ సక్సెస్ తర్వాత సినిమాల స్పీడు పెంచారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
అలాగే అనిల్‌రావిపూడి తో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 3 ప్రమోషన్స్ లో బాలకృష్ణతో చేయబోయే సినిమా గురించి అనిల్ రావిపూడి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభిస్తామని వెల్లడించారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా బాలకృష్ణ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే కథ, కథనాలు పూర్తి విభిన్నంగా ఉంటాయని అన్నారు. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని అన్నారు. నవ్విస్తూనే ఆయన శైలి మాస్ హంగులన్నీ ఇందులో ఉంటాయని చెప్పారు.
అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 చిత్రం మే 27న రిలీజ్ కానుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ ఈసినిమాలో హీరోలుగా నటించారు. కాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
టాపిక్