Balakrishna |ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు...
21 May 2022, 10:27 IST
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను 2023 మే 28 వరకు నిర్వహించబోతున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ నెల 28 నిమ్మకూరులో ఈ వేడుకలను మొదలుపెట్టబోతున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బాలకృష్ణ వెల్లడించారు.
బాలకృష్ణ
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించబోతున్నట్లు సినీ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ 28న నిమ్మకూరులో ఈ వేడుకలను ప్రారంభిస్తామని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 28 నుంచి 2023 మే 28 వరకు 365 రోజుల పాటు శతపురుషుని శత జయంతి వేడుకలను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న నిమ్మకూరులో జరిగే కార్యక్రమంతో శతజయంతి వేడుకలు ప్రారంభమవుతాయని, అందులో తాను పాల్గొనబోతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. ఆ తర్వాత తెనాలి చేరుకుంటానని అన్నారు.
అక్కడే శతాబ్ది వేడుకలను ప్రారంభిస్తానని బాలకృష్ణ చెప్పారు. ఈ శతజయంతి వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ భాగస్వాములవుతారని వెల్లడించారు. 365 రోజుల పాటు వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సులతో శతజయంతి ఉత్సవాలను జరుపనున్నామని పేర్కొన్నారు. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలను నిర్వహిస్తామని బాలకృష్ణ చెప్పారు.