Aha OTT: ఓటీటీలో వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌తో దూసుకుపోతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ
08 September 2024, 6:10 IST
Aha OTT: అశ్విన్ బాబు హీరోగా నటించిన శివంభజే మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. కొద్ది రోజుల్లో వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకున్నది. ఈ మిస్టర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
శివం భజే ఓటీటీ
Aha OTT: అశ్విన్ బాబు హీరోగా నటించిన శివంభజే మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో శివం భజే మూవీ రిలీజైంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకున్నది.
రెండు ఓటీటీలలో శివం భజే మూవీ టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిందని సినిమా యూనిట్ చెబుతోంది. కంటెంట్ బాగుంటే థియేటర్, ఓటీటీ అనే భేదాలు లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి మా శివంభజే నిరూపించిందని మేకర్స్ అన్నారు.
సల్మాన్ ఖాన్ బ్రదర్...
శివంభజే మూవీకి అప్సర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అశ్విన్‌బాబుకు జోడీగా దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్‌గా నటించింది. శివంభజే మూవీలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ విలన్‌గా కనిపించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు అర్భాజ్ ఖాన్. గతంలో తెలుగులో చిరంజీవి జై చిరంజీవతో పాటు మరికొన్ని సినిమాల్లో అర్భాజ్ ఖాన్ నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేశాడు.
శివుడి అండతో...
శివుడి అండతో ఓ యువకుడు ఎలా శత్రుసంహారం చేశాడనే పాయింట్‌తో శివంభజే మూవీని తెరకెక్కించాడు దర్శకుడు అప్సర్. చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. లోన్ రికవరీ టైమ్‌లో పరిచయమైన శైలజను (దిగంగాన సూర్యవన్షీ) ప్రేమిస్తుంటాడు. చందు మంచి మనసు చూసి శైలజ కూడా అతడిని ఇష్టపడుతుంది. ఓ గొడవలో చందు కంటిచూపు పోతుంది. పొరపాటుగా డాక్టర్లు అతడికి మనిషి కళ్ల బదులు డోగ్రా అనే కుక్క కళ్లను అమర్చుతారు.
ఆ తర్వాత చందు జీవితం పూర్తిగా మారిపోతుంది. కొందరిని చూడగానే వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అసలు వాళ్లు ఎవరు? డోగ్రా ఎలా చనిపోయింది? సిటీలో జరుగుతోన్న వరుస మరణాల మిస్టరీని పోలీస్ ఆఫీసర్ మురళి (అర్భాజ్ ఖాన్) ఛేదించాడా? భారత్‌లో కుట్రలు పన్నేందుకు చైనా, పాకిస్థాన్ కలిసి వేసిన ప్లాన్‌ను శివుడి సాయంతో చందు ఎలా తిప్పికొట్టాడు అన్నదే శివంభజే మూవీ కథ. కమర్షియల్ యాక్షన్ మూవీలో దర్శకుడు అంతర్లీనంగా డివోషన్ పాయింట్‌ను టచ్ చేశాడు.
విలన్ క్యారెక్టర్ ట్విస్ట్
శివంభజే మూవీలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు విలన్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఆడియెన్స్‌ను మెప్పించింది. థియేటర్లలో ఈ మూవీ మిక్స్‌డ్‌టాక్‌ను తెచ్చుకున్నది. ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. శివంభజే మూవీకి వికాస్ బాడిస మ్యూజిక్ అందించాడు.
రాజుగారిగది సిరీస్...
రాజుగారిగది సిరీస్ సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు అశ్విన్ బాబు. ఈ హారర్ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. గత ఏడాది హిండింబ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశాడు అశ్విన్. ఇటీవలే మరో కొత్త సినిమాను మొదలుపెట్టాడు.