Guppedantha Manasu Shailendra: కొత్త సీరియ‌ల్ కోసం దేవ‌యాని, శైలేంద్ర విల‌న్ కాంబో రిపీట్-guppedantha manasu shailendra devayani villain combo repeat foe suryakantham serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Shailendra: కొత్త సీరియ‌ల్ కోసం దేవ‌యాని, శైలేంద్ర విల‌న్ కాంబో రిపీట్

Guppedantha Manasu Shailendra: కొత్త సీరియ‌ల్ కోసం దేవ‌యాని, శైలేంద్ర విల‌న్ కాంబో రిపీట్

Nelki Naresh Kumar HT Telugu
Sep 06, 2024 02:55 PM IST

Guppedantha Manasu Shailendra: గుప్పెడంత మ‌న‌సు విల‌న్ జోడీ దేవ‌యాని, శైలేంద్ర కాంబో మ‌రో కొత్త సీరియ‌ల్‌లో క‌నిపించ‌బోతున్నారు. జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సూర్య‌కాంతం సీరియ‌ల్‌లో వీరిద్ద‌రు త‌ల్లీకొడుకులుగా న‌టిస్తున్నారు.

గుప్పెడంత మనసు శైలేంద్ర
గుప్పెడంత మనసు శైలేంద్ర

Guppedantha Manasu Shailendra: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ విల‌న్స్‌గా క‌నిపించారు దేవ‌యాని, శైలేంద్ర‌. తాజాగా మ‌రో కొత్త సీరియ‌ల్‌లో విల‌న్ కాంబో రిపీట్ అయ్యింది గుప్పెడంత మ‌న‌సులో ఎండీ సీట్ కోసం రిషి, వ‌సుధార‌ల‌ను ఇబ్బందులు పాలు చేయ‌డం, కుట్ర‌ల ప‌న్నే క్యారెక్ట‌ర్‌లో దేవ‌యాని, శైలేంద్ర త‌మ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. త‌మ ల‌క్ష్యం కోసం ఎంత‌కైనా తెగించే పాత్ర‌ల్లో క‌న్నింగ్ యాక్టింగ్‌తో మెప్పించారు. దేవ‌యాని పాత్ర‌లో కొండ‌వీటి సంగీత క‌నిపించ‌గా...శైలేంద్ర క్యారెక్ట‌ర్‌ను సురేష్‌బాబు చేశారు. ఇటీవ‌లే గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు శుభంకార్డు ప‌డింది.

సూర్య‌కాంతం సీరియ‌ల్‌లో...

ఈ సీరియ‌ల్ పూర్త‌యినా విల‌న్ కాంబోను మ‌ళ్లీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు చూసే అవ‌కాశం దొరికింది. జీ తెలుగులో ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతున్న సూర్య‌కాంతం సీరియ‌ల్‌లో సురేష్‌బాబు, సంగీత త‌ల్లికొడుకులుగా న‌టిస్తోన్నారు. వీరి క్యారెక్ట‌ర్స్‌ను ఇటీవ‌లే స‌డెన్‌గా ప్ర‌వేశ‌పెట్టి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు మేక‌ర్స్‌. గుప్పెడంత మ‌న‌సుకు మించి ఈ సీరియ‌ల్స్‌లో సురేష్‌బాబు, సంగీత విల‌నిజం సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ముత్యాల ముగ్గు సీరియ‌ల్‌తో...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో పాపుల‌రైన సురేష్‌బాబు గ‌తంలో ముత్యాల ముగ్గు, ఆడ‌దే ఆధారం, సూర్య‌వంశం, సిరిసిరి మువ్వ‌లు, రాజారాణితో పాటు తెలుగులో ప‌లు సీరియ‌ల్స్ చేశాడు. అల్లు అర్జున్ స‌రైనోడుతో పాటు చిన్న‌దానా నీకోసం లాంటి సినిమాల్లో చిన్న పాత్ర‌లు చేశాడు.

బిగ్‌బాస్ కోస‌మే...

దాదాపు నాలుగేళ్ల పాటు స్టార్ మాలో టెలికాస్ట్ అయిన గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 31 నాటి ఎపిసోడ్‌తో ముగిసింది. బిగ్‌బాస్ కార‌ణంగానే ఈ సీరియ‌ల్‌కు అర్థాంత‌రంగా ఎండ్ కార్డ్ వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం 1168 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయినా ఈ సీరియ‌ల్ ఒక‌ప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో నిలిచింది. అయితే మ‌ధ్య‌లో రిషి పాత్ర‌ను చేసిన ముఖేష్ గౌడ త‌ప్పుకోవ‌డం సీరియ‌ల్ క్రేజ్ త‌గ్గింది. రంగాగా కొత్త పాత్ర‌లో అత‌డు రీఎంట్రీ ఇచ్చిన అనుకున్న మేర సీరియ‌ల్‌కు ఆద‌ర‌ణ రాలేక‌పోయింది. దాంతో మేక‌ర్స్ ముగింపు ప‌లికారు.

సీక్వెల్ రానుందా...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి, వ‌సుధార‌లుగా ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ త‌మ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకున్నారు. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్‌బాస్ ముగిసిన త‌ర్వాతే సీక్వెల్‌గా క‌న్ఫ‌ర్మేష‌న్ రానున్న‌ట్లు స‌మాచారం.

గుప్పెడంత మ‌న‌సు పూర్త‌యినా ఈ సీరియ‌ల్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూసే వెసులుబాట‌ను మేక‌ర్స్ క‌ల్పించారు. అన్ని ఏపిసోడ్స్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి.

సూర్య‌కాంతం టైమింగ్స్‌...

సూర్య‌కాంతం సీరియ‌ల్ టైమ్‌ను మేక‌ర్స్‌ను ఛేంజ్ చేశారు. జూన్ 10 నుంచి మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి మూడున్నర‌ వ‌ర‌కు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.