తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koffee With Karan: మలైకా అరోరా నెంబర్‌ను అర్జున్ ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా?

Koffee With Karan: మలైకా అరోరా నెంబర్‌ను అర్జున్ ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా?

09 August 2022, 14:23 IST

    • హిందీ పాపులర్ సెలబ్రెటీ షో కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ హాజరయ్యారు. కరణ్‌తో కలిసి సందడి చేసిన వీరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కాఫీ విత్ కరణ్ షోలో అర్జున్, సోనమ్
కాఫీ విత్ కరణ్ షోలో అర్జున్, సోనమ్ (Twitter)

కాఫీ విత్ కరణ్ షోలో అర్జున్, సోనమ్

బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ దిగ్విజయంగా నడుస్తోంది. ఇప్పటికే తెలుగు స్టార్లు సమంత, విజయ్ దేవరకొండ కూడా హాజరై షోనూ విజయవంతం చేశారు. తాజాగా బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ హాజరయ్యారు. ఈ అన్నా, చెల్లేళ్లు ఇద్దరూ హాజరై సందడి చేశారు. తాజాగా వీరద్దరూ హాజరైన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోలో అర్జున్, సోనమ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

ప్రోమోను పరిశీలిస్తే.. కరణ్ జోహార్.. అర్జున్, సోనమ్‌లను పరిచయం చేస్తూ ఓ మై గాడ్ S-N-M అని సంబోధిస్తాడు. సోనమ్ తన గురించి చాలా బాధపడే విషయం గురించి అర్జున్‌ను అడుగుతుంది. కాంప్లిమెంట్ ఎవరైనా ఇస్తారేమో అని ఎదురుచూడకు అని అతడు బదులిస్తాడు.

మరోపక్క కరణ్‌.. మలైకా అరోరా నంబర్‌ను ఎలా సేవ్ చేశావు అని అర్జున్ కపూర్‌ను అడుగ్గా.. ఇందుకు అతడు నాకు ఆమె పేరు అంటే చాలా ఇష్టం అని బదులిచ్చాడు. దీంతో ఆమె పేరుతోనే మలైకా నంబర్‌ను సేవ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ర్యాంప్‌పై మలైకా అరోరాతో నడచిన క్షణాన్ని గురించి అర్జున్ కపూర్ గుర్తు చేసుకున్నాడు.

దీని పూర్తి ఎపిసోడ్ గురువారం రాత్రి 12 గంటలకు వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా కాఫీ విత్ కరణ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ షో ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్-సమంత హాజరయ్యారు. కరీనా కపూర్-ఆమీర్ ఖాన్, అనన్యా పాండే-విజయ్ దేవరకొండ లాంటి ప్రముఖులు కాఫీ విత్ కరణ్ 7వ సీజన్‌లో పాల్గొన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం