Naga Chaitanya: అవకాశమొస్తే కాఫీ విత్ కరణ్ షోకు వెళ్తా.. చై ఆసక్తికర వ్యాఖ్యలు
నాగచైతన్య బాలీవుడ్‌లో తను నటించిన తొలి చిత్రం లాల్ సింగ్ చడ్ఢా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు చై. తనకు అవకాశమొస్తే కాఫీ విత్ కరణ్ షోలో కూడా పాల్గొంటానని స్పష్టం చేశాడు.
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవలే థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో తన ఆశలన్నీ లాల్ సింగ్ చడ్ఢాపైనే పెట్టుకున్నాడు చై. బాలీవుడ్‌లో ఈ భారీ ప్రాజెక్టుతో అరంగేట్రం చేస్తున్న చై..సినిమాపై గట్టి నమ్మకంగా ఉన్నాడు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమీర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న చై.. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు అవకాశమొస్తే కాఫీ విత్ కరణ్ షోలోనూ పాల్గొంటానని తెలిపాడు.
కరణ్ జోహార్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొంటారా అనే ప్రశ్నకు సమాధానంగా నాగచైతన్య ఈ విధంగా బదులిచ్చాడు. "కాఫీ విత్ కరణ్ షోలోనా? నాకు ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్లను. కరణ్ జోహార్ చాలా గొప్ప వ్యక్తి. అతడు చేసే పని నాకు నచ్చుతుంది. అతడు నన్ను కావాలనుకుంటే ఎందుకు వెళ్లను తప్పకుండా" వెళ్తా అని నాగచైతన్య తెలిపాడు.
నాగచైతన్య మాజీ భార్య సమంత ఇటీవలే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. అంతేకాకుండా చైతో విడిపోవడానికి గల కారణాలను, విడాకుల తర్వాత తను ఎదుర్కొన్న పరిస్థితులను గురించి వివరించింది.
మీ భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కారణం మీరే అని నేను అనుకుంటున్నానని అని కరణ్ ప్రశ్నిస్తుండగా.. మధ్యలోనే అందుకున్న సామ్.. మాజీ భర్త అంటూ సవరించింది. అందుకు కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్తతో విడిపోవడానికి కారణం మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని మీరు భావించారా? జరిగితే ఆ విషయం నుంచి ఎలా బయటపడ్డారు? ఇందుకు సామ్ బదులిస్తూ.. అవును జరిగింది. కానీ నేను ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. నేను విడాకుల మార్గాన్ని ఎంచుకున్నాను. ట్రోలింగ్‌పై ఎక్కువగా అప్ సెట్ కూడా అవ్వలేదు. ఎందుకంటే ఆ సమయంలో నా వద్ద సమాధానాలు లేవు. అని సామ్ చెప్పింది.
అంతేకాకుండా అప్పుడు కష్టంగా అనిపించినప్పటికీ.. ఇప్పుడు బాగుందని, చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యానని చెప్పింది. మీ మధ్య ఏవైనా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని కరణ్ అడుగ్గా.. ఇందుకు అవునని బదులిచ్చింది.
సంబంధిత కథనం