Samantha: నన్ను, నాగచైతన్యని ఒకే రూమ్‌లో ఉంచారో.. ఇక అంతే: సమంత
Samantha: టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో నాగచైతన్య, సమంత విడాకులపై జరిగినంత చర్చ మరేదానిపై జరగలేదు. అయితే ఈ విడాకులపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సమంత.. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో మొత్తం చెప్పేసింది.
సమంత, నాగచైతన్య మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. చైతూ తన లేటెస్ట్ మూవీ థ్యాంక్యూతో ఉండగా.. సమంత మాత్రం అతనితో విడాకుల విషయంలో నోరు విప్పి వార్తల్లో నిలిచింది. ముందుగానే ఊహించినట్లే కాఫీ విత్ కరణ్ షోలో సమంత తన విడాకుల విషయంపై మాట్లాడింది. నాగ చైతన్యతో విడాకులకు దారి తీసిన పరిస్థితులు, ప్రస్తుతం అతనితో సంబంధాలపై సామ్ తన మనసులో మాట చెప్పింది.
చైతూతో విడాకుల సమయంలో ఫ్యాన్స్ మొత్తం ఆమెనే నిందించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చైతన్యపై చాలా మంది సానుభూతి చూపించారు. సామ్‌ను ట్రోల్స్‌తో ఆడుకున్నారు. ఇదే విషయాన్ని కరణ్ తన షోలో ప్రస్తావించగా.. అదేమీ తనను బాధించలేదని, అయితే ఆ సమయంలో తన దగ్గర సమాధానం లేకపోవడం సైలెంట్‌గా ఉన్నట్లు చెప్పింది.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా, స్ట్రాంగ్‌గా ఉన్నట్లు సామ్ తెలిపింది. అయితే ప్రస్తుతం చైతూతో రిలేషన్ ఎలా ఉంది అని కరణ్ అడిగిన ప్రశ్నకు మాత్రం సమంత ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతోంది. మరీ ఎక్కువ వ్యక్తిగత ప్రశ్నలు అడగను అంటూనే.. కరణ్ వరుసగా విడాకుల టాపిక్‌ను కంటిన్యూ చేశాడు. అందులో భాగంగానే మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడిగాడు.
దీనికి సమంత స్పందిస్తూ.. "అంటే మీరు మమ్మల్ని ఒక రూమ్‌లో ఉంచారనుకోండి.. మీరు కచ్చితంగా పదునైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచేయాల్సిందే. నిజంగా ప్రస్తుతానికైతే అదీ పరిస్థితి. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో ఏమైనా మెరుగుపడొచ్చు" అని సమంత చెప్పడం విశేషం.
సంబంధిత కథనం