Anupam Kher on Prakash Raj: అతని స్థాయి అదే మరి.. ప్రకాశ్ రాజ్‌పై మండిపడిన అనుపమ్ ఖేర్
17 February 2023, 22:32 IST
Anupam Kher on Prakash Raj: అతని స్థాయి అదే మరి అంటూ నటుడు ప్రకాశ్ రాజ్‌పై మండిపడ్డాడు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. కశ్మీర్ ఫైల్స్ మూవీపై ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ.. అనుపమ్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అనుపమ్ ఖేర్, ప్రకాశ్ రాజ్
Anupam Kher on Prakash Raj: కశ్మీర్ ఫైల్స్ మూవీ రిలీజై ఏడాది కావస్తున్న దానిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ మూవీని సమర్థించేవాళ్లు, విమర్శించే వాళ్లు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో నటుడు ప్రకాశ్ రాజ్ ఒకడు. మొదటి నుంచీ ఈ సినిమాపై అతడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యే ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ కు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదని అన్నాడు.
అతని వ్యాఖ్యలపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీవ్రంగా స్పందించాడు. ప్రకాశ్ రాజ్ ఓ అర్బన్ నక్సల్ అని విమర్శించాడు. తాజాగా ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కాస్తా ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. ఎవరి స్థాయి వ్యాఖ్యలు వాళ్లు చేస్తారంటూ ప్రకాశ్ రాజ్ ను పరోక్షంగా విమర్శించాడు.
"వారి వారి స్థాయిని బట్టి వ్యక్తులు వ్యాఖ్యలు చేస్తారు. కొందరు జీవితం మొత్తం అబద్ధాలే చెబతారు. కొంత మంది ఎప్పుడూ నిజమే మాట్లాడతారు. జీవితం మొత్తం నిజం చెప్పేవాళ్లలో నేనూ ఒకడిని. అబద్ధం చెబుతూ బతకాలని అనుకుంటే అది వాళ్ల ఇష్టం" అని అనుపమ్ ఖేర్ అన్నాడు. నవ్‌భారత్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఇలా స్పందించాడు.
కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మాట్లాడాడు. అంతర్జాతీయ జ్యూరీ కూడా వాళ్లపై ఉమ్మేసినా సిగ్గు లేదని, ఇప్పటికే డైరెక్టర్ తన సినిమా ఆస్కార్ ఎందుకు రాదని అడుగుతున్నాడని ప్రకాశ్ రాజ్ అన్నాడు. ఆస్కార్ కాదు కదా భాస్కర్ కూడా రాదని సెటైర్ వేశాడు. కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు తీయడానికే ఇలాంటి వాళ్ల దగ్గర 2 వేల కోట్ల బడ్జెట్ సిద్ధంగా ఉన్నదని కూడా ప్రకాశ్ రాజ్ అనడం గమనార్హం.
టాపిక్