తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapurna Photo Studio Trailer: ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్

Annapurna Photo Studio Trailer: ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్

Hari Prasad S HT Telugu

23 June 2023, 17:02 IST

google News
    • Annapurna Photo Studio Trailer: ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ వచ్చేసింది. గోదావరి పక్కనుండే కపిలేశ్వరపురం ఊళ్లో జరిగే ఓ లవ్ స్టోరీయే ఈ మూవీ.
అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ రిలీజ్
అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ రిలీజ్

అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ రిలీజ్

Annapurna Photo Studio Trailer: ఓవైపు పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు రొటీన్ స్టోరీలతో బోల్తా పడుతున్నాయి. మరోవైపు చిన్న సినిమా అయినా మంచి కథ ఉంటే సక్సెస్ సాధిస్తున్నాయి. ఇప్పుడలాంటిదే మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పేరు అన్నపూర్ణ ఫొటో స్టూడియో.

ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం (జూన్ 23) రిలీజ్ చేశారు. గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న, ఫన్నీ లవ్ స్టోరీనే ప్రధాన కథాంశంగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చైతన్య రావ్ ఇందులో హీరోగా నటించాడు. గోదావరి పక్కనుండే కపిలేశ్వరపురంలో ఓ చిన్న ఫొటో స్టూడియో. దానికి అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే పేరు.

దీనికి మా అమ్మ పేరే పెట్టుకున్నా.. ఫొటో మాత్రం ఏఎన్నార్ ది పెట్టానంటూ హీరో చెబుతాడు. తన పేరు చంటి అని, తనది కపిలేశ్వరపురం అని అంటాడు. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ లో రావుగోపాల రావు వాయిస్ లో హలోహలోహలో హీరోగారు.. మీ కథేంటో వివరంగా చెప్పండి అనే డైలాగు వినబడుతుంది. ఏఎన్నార్ అభిమాని అయిన హీరో.. అచ్చూ అతనిలాంటి వేషధారణ, డైలాగులతో అలరించే ప్రయత్నం చేశాడు.

ఓ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం అతన్ని అర్థం చేసుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. తనను అవమానించిన ఆ అమ్మాయిని చంపాలంటూ హీరోనే అనడం ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా మారుస్తుంది. ఓ డిఫరెంట్ ఫీల్ తో కనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపింది. ఈ అన్నపూర్ణ ఫొటో స్టూడియోకి చెందు ముద్దు దర్శకత్వం వహించగా.. యశ్ రంగినేని ప్రొడ్యూస్ చేశాడు.

తదుపరి వ్యాసం