తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Ott Release Date: యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. 8 నిమిషాలు ఎక్కువ నిడివితో..

Animal OTT Release Date: యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. 8 నిమిషాలు ఎక్కువ నిడివితో..

Hari Prasad S HT Telugu

22 January 2024, 13:33 IST

google News
    • Animal OTT Release Date: రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అంతేకాదు థియేటర్లలో కంటే 8 నిమిషాలు ఎక్కువ నిడివితో రానుండటం విశేషం.
యానిమల్ మూవీలో రణ్‌బీర్, రష్మిక
యానిమల్ మూవీలో రణ్‌బీర్, రష్మిక

యానిమల్ మూవీలో రణ్‌బీర్, రష్మిక

Animal OTT Release Date: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చి గతేడాది తీవ్ర దుమారం రేపిన మూవీ యానిమల్ ఓటీటీలోకి వచ్చే తేదీ కన్ఫమ్ అయింది. ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ఓటీటీలో కొన్ని అదనపు సీన్లను కూడా చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనున్నట్లు తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి.

యానిమల్.. 8 నిమిషాలు ఎక్కువగా..

యానిమల్ మూవీ ఓటీటీలో 8 నిమిషాలు ఎక్కువ నిడివితో రానుండటం విశేషం. నిజానికి థియేటర్లలోనే ఈ సినిమా 3 గంటల 21 నిమిషాలతో చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఓటీటీలో ఈ నిడివి కాస్తా 3 గంటల 29 నిమిషాలకు చేరనుంది. ఈ అదనపు సమయంలో థియేటర్లలో డిలీట్ చేసిన రష్మిక మందన్నాకు సంబంధించిన కొన్ని సీన్లను యాడ్ చేయనున్నారు.

నిజానికి యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్ కు చాలా రోజులుగా లీగల్ సమస్యలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని టీ సిరీస్ తో కలిసి నిర్మించిన సినీ 1 స్టూడియోస్ ఆ సంస్థతోపాటు నెట్‌ఫ్లిక్స్ పై కేసు వేసింది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించిన తర్వాతే మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించాలని సినీ 1 స్టూడియోస్ కోర్టుకెక్కింది.

అయితే ఇప్పుడీ లీగల్ సమస్యలు తొలగి జనవరి 26నే మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక మూవీకి మరో 8 నిమిషాలు కూడా చేర్చడంతో మూడున్నర గంటల సమయం యానిమల్ కు కేటాయించాల్సి రానుంది. యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.

ఈ సినిమాలో మితిమీరిన హింస, ఆడవాళ్లను కించపరిచేలా డైలాగులు, సీన్లు ఉండటంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎంతో మంది ప్రముఖులు కూడా సినిమాపై విమర్శలు గుప్పించారు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మూవీ సక్సెసైంది. ఎ సర్టిఫికెట్ మూవీ అయిన ఈ యానిమల్ ఇప్పుడు ఓటీటీలోకి అదనపు సమయంతో వస్తోంది. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీకి ఎలాంటి ఆదరణ లభిస్తుందన్నది చూడాలి.

యానిమల్ మూవీపై విమర్శలు వచ్చినా.. దీనికి సీక్వెల్ తీస్తున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశాడు. ఆ మూవీకి యానిమల్ పార్క్ అనే పేరు కూడా పెట్టాడు. యానిమల్ మూవీలో రణ్‌బీర్, రష్మితోపాటు అనిల్ కపూర్ తృప్తి దిమ్రిలాంటి వాళ్లు కూడా నటించారు.

మరోవైపు యానిమల్ మూవీ అటు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీ నుంచి ఏకంగా 19 నామినేషన్లు ఉండటం విశేషం. మరే ఇతర సినిమా నుంచి ఇన్ని నామినేషన్లు లేవు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం