Filmfare Awards 2024 nominees: యానిమల్ హవా.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఏకంగా 19 నామినేషన్లు
Filmfare Awards 2024 nominees: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలో యానిమల్ మూవీ సత్తా చాటింది. ఏకంగా 19 నామినేషన్లతో టాప్ లో నిలిచింది. ఈ నామినీల పూర్తి జాబితా ఇక్కడ చూడొచ్చు.
Filmfare Awards 2024 nominees: యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది. ఈ మూవీ ఏకంగా 19 నామినేషన్లను సొంతం చేసుకుంది. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. 12th ఫెయిల్ మూవీ కూడా కొన్ని కేటగిరీల్లో పోటీ పడుతోంది.
యానిమల్ మూవీ గతేడాది రిలీజై ఏకంగా రూ.900 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులోనూ నిలిచింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రణ్‌బీర్, రష్మిక నటించారు. మరోవైపు ఈసారి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో షారుక్ ఖాన్.. జవాన్, డంకీ మూవీస్ కోసం నామినేట్ కావడం విశేషం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లు ఇవే
ఉత్తమ చిత్రం
12th ఫెయిల్
యానిమల్
జవాన్
ఓఎంజీ 2
పఠాన్
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
ఉత్తమ దర్శకుడు
అమిత్ రాయ్ (Omg 2)
అట్లీ (జవాన్)
కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)
విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్
12th ఫెయిల్ (విధు వినోద్ చోప్రా)
భీడ్ (అనుభవ సిన్హా)
ఫరాజ్ (హన్సల్ మెహతా)
జోరామ్ (దేవాశిష్ మఖిజా)
సామ్ బహదూర్ (మేఘనా గుల్జార్)
త్రీ ఆఫ్ అజ్ (అవినాష్ అరుణ్ ధావేర్)
జ్విగాటో (నందితా దాస్)
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్)
రణబీర్ కపూర్ (యానిమల్)
రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
షారూఖ్ ఖాన్ (డంకీ)
షారూఖ్ ఖాన్ (జవాన్)
సన్నీ డియోల్ (గదర్ 2)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)
జైదీప్ అహ్లావత్ (త్రీ ఆఫ్ అజ్)
మనోజ్ బాజ్‌పేయి (జోరం)
పంకజ్ త్రిపాఠి (Omg 2)
రాజ్‌కుమార్ రావు (భీడ్)
విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
విక్రాంత్ మస్సీ (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ లీడ్ రోల్ (ఫిమేల్)
అలియా భట్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
భూమి పెడ్నేకర్ (థ్యాంక్యూ ఫర్ కమింగ్)
దీపికా పదుకొణె (పఠాన్)
కియారా అద్వానీ (సత్యప్రేమ్ కథ)
రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)
తాప్సీ పన్ను (డంకీ)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్
దీప్తి నావల్ (గోల్డ్ ఫిష్)
ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)
రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)
సయామి ఖేర్ (ఘూమర్)
షహనా గోస్వామి (జ్విగాటో)
షెఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్
యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురీందర్ సీగల్)
డంకీ (ప్రీతమ్)
జవాన్ (అనిరుధ్ రవిచందర్)
పఠాన్ (విశాల్, శేఖర్)
రాకీ ఔర్ రాణి ప్రేమ కథ (ప్రీతమ్)
తూ ఝూటీ మై మక్కార్ (ప్రీతమ్)
జరా హట్కే జరా బచ్కే (సచిన్-జిగర్)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)
అరిజిత్ సింగ్ (లుట్ పుట్ గయా- డంకి)
అరిజిత్ సింగ్ (సత్రంగ- యానిమల్)
భూపిందర్ బబ్బల్ (అర్జన్ వాలీ- యానిమల్)
షాహిద్ మాల్యా (కుడ్మయి- రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
సోను నిగమ్ (నిక్లే థే కభీ హమ్ ఘర్ సే- డంకీ)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్)
దీప్తి సురేష్ (ఆరారారి రారో- జవాన్)
జోనితా గాంధీ (హే ఫికర్- 8 A.M. మెట్రో)
శిల్పా రావు (బేషరం రంగ్- పఠాన్)
శిల్పా రావు (చలేయ- జవాన్)
శ్రేయా ఘోషల్ (తుమ్ క్యా మైల్-రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
శ్రేయా ఘోషల్ (వే కమ్లేయ- రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)