Filmfare Awards Winners: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఆ రెండు సినిమాలదే హవా-filmfare awards winners full list is here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Filmfare Awards Winners: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఆ రెండు సినిమాలదే హవా

Filmfare Awards Winners: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఆ రెండు సినిమాలదే హవా

Hari Prasad S HT Telugu
Apr 28, 2023 10:22 AM IST

Filmfare Awards Winners: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో గంగూబాయి, బధాయి దో హవా నడిచింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్ లాంటి ప్రధాన అవార్డులు ఈ మూవీలకు దక్కడం విశేషం.

గంగూబాయి కఠియావాడిలో ఆలియా భట్, బధాయి దోలో రాజ్‌కుమార్ రావ్, భూమి పడ్నేకర్
గంగూబాయి కఠియావాడిలో ఆలియా భట్, బధాయి దోలో రాజ్‌కుమార్ రావ్, భూమి పడ్నేకర్

Filmfare Awards Winners: బాలీవుడ్ లో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం గురువారం (ఏప్రిల్ 27) ఘనంగా జరిగింది. ఈ అవార్డుల్లో ఆలియా భట్ నటించిన గంగూబాయి కఠియావాడి, రాజ్‌కుమార్ రావ్ నించిన బధాయి దో మూవీలు అవార్డుల పంట పండించాయి. బెస్ట్ ఫిల్మ్స్ తోపాటు బెస్ట్ యాక్టర్స్ అవార్డులు కూడా ఈ సినిమాలకే దక్కడం విశేషం.

గతేడాది రిలీజైన గంగూబాయి కఠియావాడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఆలియా నటనకు వందకు వంద మార్కులూ పడ్డాయి. అటు రాజ్‌కుమార్ రావ్ గే పాత్రలో నటించిన బధాయి దో కూడా అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీకి క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు లభించింది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పూర్తి లిస్టు ఇదే

బెస్ట్ ఫిల్మ్: గంగూబాయి కఠియావాడి

బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్): బధాయి దో

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్): రాజ్‌కుమార్ రావ్ (బధాయి దో)

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (ఫిమేల్): ఆలియా భట్ (గంగూబాయి కఠియావాడి)

బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): సంజయ్ మిశ్రా (వధ్)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): భూమి పడ్నేకర్ (బధాయి దో), టబు (భూల్ భులయ్యా 2)

బెస్ట్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూలీ బాయి కఠియావాడి)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ (మేల్): అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో)

బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ (ఫిమేల్): షీబా చద్దా (బధాయి దో)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బం: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)

బెస్ట్ డైలాగ్: ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూలీబాయి కఠియావాడి)

బెస్ట్ స్క్రీన్ ప్లే: అక్షత్, సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణి (బధాయి దో)

బెస్ట్ స్టోరీ: అక్షత్, సుమన్ అధికారి (బధాయి దో)

బెస్ట్ డెబ్యూ(మేల్): అంకుష్ గెదా్ (ఝుండ్)

బెస్ట్ డెబ్యూ(ఫిమేల్): ఆండ్రియా కెవిచుసా (అనేక్)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వాల్ (వధ్)

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్: ప్రేమ్ చోప్రా

బెస్ట్ లిరిక్స్: అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్): అరిజిత్ సింగ్ (కేసరియా-బ్రహ్మస్త్ర)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): కవితా సేఠ్ (రంగిసారి-జుగ్ జుగ్ జియో)

Whats_app_banner

సంబంధిత కథనం