తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anchor Suma As Kumari Aunty: కుమారి ఆంటీలా సుమ.. డీజే మిక్సింగ్‍తో.. వైరల్ అవుతున్న వీడియో

Anchor Suma as Kumari Aunty: కుమారి ఆంటీలా సుమ.. డీజే మిక్సింగ్‍తో.. వైరల్ అవుతున్న వీడియో

09 February 2024, 14:15 IST

    • Anchor Suma as Kumari Aunty: ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ ఇటీవల పాపులర్ అయ్యారు. దీంతో ఆమె మాటలతో ఓ స్పూఫ్ వీడియో చేసేశారు ప్రముఖ యాంకర్ సుమ. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Anchor Suma as Kumari Aunty: కుమారి ఆంటీలా సుమ.. డీజే మిక్సింగ్‍తో
Anchor Suma as Kumari Aunty: కుమారి ఆంటీలా సుమ.. డీజే మిక్సింగ్‍తో

Anchor Suma as Kumari Aunty: కుమారి ఆంటీలా సుమ.. డీజే మిక్సింగ్‍తో

Anchor Suma - Kumari Aunty: హైదరాబాద్‍లోని కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ ఇటీవల ఫుల్ ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలతో ఆమె ఫుడ్ సెంటర్ ఫేమస్ అవడం, జనాలు భారీగా రావడం, మూసేయాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పడం.. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకోవడంతో మరింత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు కుమాటీ ఆంటీ ఫుడ్ పాయింట్‍కు జనాలు మరింత భారీగా వెళుతున్నారు. సోషల్ మీడియాలోనూ కొన్నాళ్లుగా ఈ విషయం ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ తరుణంలో ప్రముఖ యాంకర్ సుమ.. కుమారి ఆంటీలా స్ఫూఫ్ వీడియో చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

కుమారి ఆంటీ మాటలకు డీజే మిక్సింగ్ చేసి ఈ స్పూఫ్ వీడియో చేశారు సుమ. ఓ షూటింగ్ లొకేషన్‍లో ప్రొడక్షన్ టీమ్ వాళ్లు తెచ్చిన ఫుడ్‍తో ఈ వీడియో చేశారు. చుట్టూ కొందరు ప్లేట్లు పట్టుకొని నిలబడగా.. ఫుడ్ ఐటమ్‍ల గురించి కుమారి ఆంటీ చెబుతున్నట్టుగా ఉంది. దీనికి డీజే మిక్సింగ్ చేశారు. క్యాష్ షోకు వచ్చిన సమయంలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ వేసిన పంచ్‍ను కూడా ఈ వీడియోలో యాడ్ చేశారు సుమ.

కుమారి ఆంటీ ఫుడ్ ఐటమ్స్ గురించి, రేట్ల గురించి చెప్పిన మాటలు ఈ స్ఫూఫ్ వీడియోలో ఉన్నాయి. టూ లివర్స్ ఎక్స్‌ట్రా అనే డైలాగ్‍ను కూడా హైలైట్ చేశారు. డీజే మిక్సింగ్‍తో మొత్తంగా ఈ వీడియో ఆకట్టుకునేలా ఉంది. "ఫుడ్ బాగుంది.. మీరు కూడా ట్రై చేయండి” అని క్యాష్ ప్రోగ్రాంలో బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్‍తో ఈ స్ఫూఫ్ వీడియో ఎండ్ అయింది. ఈ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో సుమ పోస్ట్ చేశారు.

కుమారి ఆంటీలా సుమ చేసిన ఈ స్ఫూఫ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సుమక్క సూపర్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. త్వరలో రెస్టారెంట్ పెట్టండి అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇలా సరదాగా ఈ వీడియోకు చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

బీబీ ఉత్సవ్‍లో..

కుమారి ఆంటీ త్వరలో బిగ్‍బాస్ ఉత్సవ్ (బీబీ ఉత్సవ్) అనే ప్రోగ్రాంలో టీవీలో కనిపించనున్నారు. బిగ్‍బాస్ కంటెస్టెంట్లు పాల్గొనే ఈ కార్యక్రమానికి ఆమె రానున్నారు. బిగ్‍బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆమెను స్టేజీ మీదకు తీసుకొస్తున్నట్టు ఇటీవల ఓ వీడియో బయటికి వచ్చింది.

కుమారి ఆంటీగా పాపులర్ అయిన సాయి కుమారి.. హైదరాబాద్‍లోని మాదాపూర్‌లో రోడ్ సైడ్ చాలా ఏళ్లుగా ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. అయితే, ఇటీవల కొందరు ఫుడ్ స్టాల్‍‍కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని వీడియోలు వైరల్ అవడంతో ఈ ఫుడ్ సెంటర్ చాలా పాపులర్ అయింది. జనాలు విపరీతంగా వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటంతో ఫుడ్ స్టాల్ తెరవకూడదని పోలీసులు చెప్పే వరకు వెళ్లింది. అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. ఆమెను అక్కడే ఫుడ్ స్టాల్ నడుపుకోనివ్వాలని పోలీసులను ఆదేశించారు.

మొత్తంగా కుమారి ఆంటీ చాలా పాపులర్ అయ్యారు. ఏకంగా యాంకర్ సుమ స్ఫూఫ్ చేసేశారు. ముందుముందు మరిన్ని టీవీ ప్రోగ్రామ్‍ల్లోనూ కుమారి ఆంటీ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం