తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Shree Karthick Movie: ఒకే ఒక జీవితం డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌ మూవీ!

Allu Arjun Shree Karthick Movie: ఒకే ఒక జీవితం డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌ మూవీ!

HT Telugu Desk HT Telugu

14 September 2022, 19:11 IST

google News
    • Allu Arjun Shree Karthick Movie: ఒకే ఒక జీవితం డైరెక్టర్‌ శ్రీ కార్తీక్‌తో అల్లు అర్జున్‌ మూవీ చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ టైమ్‌ ట్రావెల్‌ సైన్స్ ఫిక్సన్‌ మూవీతో కార్తీక్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
పుష్ప మూవీలో అల్లు అర్జున్
పుష్ప మూవీలో అల్లు అర్జున్

పుష్ప మూవీలో అల్లు అర్జున్

Allu Arjun Shree Karthick Movie: అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. పుష్ప మూవీతో అతని రేంజ్‌ టాలీవుడ్‌ నుంచి నేషనల్ లెవల్‌కు వెళ్లింది. అలాంటి హీరోతో మూవీ చేయడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఒకే ఒక జీవితం మూవీ డైరెక్టర్‌ శ్రీ కార్తీక్‌ కూడా చేరాడు. ఈ టైమ్‌ ట్రావెల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీతో సక్సెస్‌ కొట్టిన కార్తీక్‌.. బన్నీతో మూవీ చేయాలన్న కోరికను వ్యక్తం చేశాడు.

అంతేకాదు అల్లు అర్జున్‌ కోసం తన దగ్గర ఓ స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉన్నట్లు చెప్పడం విశేషం. ఓ ఫ్యాంటసీ మూవీ స్క్రిప్ట్‌ను బన్నీ కోసం శ్రీ కార్తీక్‌ రెడీ చేశాడట. త్వరలోనే ఈ స్క్రిప్ట్‌ను బన్నీకి చెప్పాలని ఆరాటపడుతున్నట్లు కూడా కార్తీక్‌ చెప్పాడు. ప్రస్తుతం పుష్ప ద రూల్‌ సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నాడు అల్లు అర్జున్‌. పుష్ప ఫస్ట్ పార్ట్‌ పాన్‌ ఇండియా లెవల్లో హిట్‌ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో ఈ సినిమాపై అతడు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నాడు. గత నెలలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. పుష్ప 2 కోసం అల్లు అర్జున్‌ రూ.125 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇటు డైరెక్టర్‌ శ్రీ కార్తీక్‌.. ఒకే ఒక జీవితం మూవీతో సక్సెస్‌ అందుకున్నాడు. శర్వానంద్‌, రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఒకే ఒక జీవితం మూవీ గురించి..

టైమ్ ట్రావెల్ పాయింట్‌కు మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు శ్రీకార్తిక్ ఒకే ఒక జీవితం క‌థ‌ను రాసుకున్నారు. సైన్స్ ద్వారా విధి రాత‌ను మార్చాల‌ని ప్ర‌య‌త్నించే ఓ ముగ్గురు యువ‌కుల జీవితాల్ని ఎమోష‌న్స్‌, కామెడీ కలబోసి సినిమాలో ఆవిష్క‌రించారు.

సైన్స్ గొప్పదే కానీ గ‌తాన్ని మార్చ‌గ‌లిగే శ‌క్తి దానికి లేదనే సందేశాన్ని సినిమాలో చూపించారు. శ‌ర్వానంద్, అమ‌ల క్యారెక్ట‌ర్స్ ద్వారా ఎమోష‌న్స్ పండిస్తూనే మ‌రోవైపు వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి పాత్ర‌ల నుండి వినోదాన్ని రాబ‌ట్టుకున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం