తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Vs Rrr: రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2..

Pushpa 2 vs RRR: రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2..

Hari Prasad S HT Telugu

04 December 2024, 10:07 IST

google News
    • Pushpa 2 vs RRR: పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో మరో రికార్డు అందుకుంది. ఇప్పటికే బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్ల మార్క్ అందుకున్న ఈ అల్లు అర్జున్ సినిమా.. ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసింది.
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2..
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2..

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2..

Pushpa 2 vs RRR: పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మరోసారి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైన నేపథ్యంలో అల్లు అర్జున్ మూవీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఈసారి రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును పుష్ప 2 తిరగరాసింది. ఇక ఇప్పుడు బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల రికార్డులపై కన్నేసింది.

పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు

పుష్ప 2 మూవీ రిలీజ్ కు మరో రోజు మాత్రమే సమయం ఉంది. గురువారం (డిసెంబర్ 5) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నా.. బుధవారం రాత్రి 9.30 గంటల షోల నుంచే సందడి మొదలు కానుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసే రికార్డుల గురించి చర్చ మొదలు కాగా.. అంతకుముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పలు రికార్డులు తిరగరాస్తోంది.

ఇప్పటికే బుక్ మై షో పోర్టల్ లో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్ముడైన మూవీగా బాహుబలి 2, కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప 2.. ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ రికార్డునూ వెనక్కి నెట్టింది.

ఇప్పటి వరకూ కేవలం ఇండియాలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పుష్ప 2 మూవీ రూ.62.55 కోట్లు వసూలు చేసినట్లు Sacnilk.com వెల్లడించింది. ఇండియా మొత్తం 28 వేల షోల కోసం మొత్తంగా 20 లక్షలకుపైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడవడం విశేషం. గతంలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సాధించిన రూ.58.73 కోట్ల రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది.

నెక్ట్స్ టార్గెట్ బాహుబలి 2

పుష్ప 2 జోరు చూస్తుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.100 కోట్ల మైలురాయిని అందుకునేలా కనిపిస్తోంది. నిజానికి ఓవర్సీస్ సేల్స్ కూడా కలుపుకుంటే ఇప్పటికే ఆ మార్క్ అందుకోగా.. కేవలం ఇండియాలో అయితే ఇంకాస్త వెనుకబడే ఉంది. ఈ విషయంలో బాహుబలి 2 మూవీ రూ.90 కోట్ల అడ్వాన్స్ సేల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

ఆ తర్వాత కేజీఎఫ్ 2 రూ.80 కోట్లతో ఉంది. పుష్ప 2 మూవీ ఇప్పుడీ రెండు సినిమాల రికార్డులపై కన్నేసింది. ఇప్పటికే బుక్ మై షో ఫాస్టెస్ట్ మిలియన్ టికెట్ల మార్క్ లో ఈ రెండు సినిమాలను వెనక్కి నెట్టగా.. వసూళ్లలోనూ అదే రిపీట్ చేయాలని చూస్తోంది. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటిగా ఉంది.

ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో అల్లు అర్జున్ పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు నార్త్ ఇండియా, కేరళల్లోనూ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. దీంతో పుష్ప 2 మూవీ ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అన్ని రికార్డులను తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.

తదుపరి వ్యాసం