Allu Arjun: అల్లు అర్జున్‌కు ఆరోగ్య సమస్య.. పుష్ప 2 షూటింగ్ వాయిదా.. అసలు ఏమైందంటే?
03 December 2023, 12:12 IST
Allu Arjun Health Issue: స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆరోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు అయింది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
అల్లు అర్జున్‌కు ఆరోగ్య సమస్య.. పుష్ప 2 షూటింగ్ వాయిదా.. అసలు ఏమైందంటే?
Pushpa 2 Shooting Postponed: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) (Pushpa: The Rule) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇప్పటికే తెగ ఆకట్టుకుంది. పుష్ప మూవీ హిట్‌తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే నటీనటుల నుంచి సీన్స్, ఐటమ్ సాంగ్ వరకు చాలా పక్కాగా తెరకెక్కిస్తున్నాడు లెక్కల మాస్టర్ సుకుమార్.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను దాదాపుగా 30 రోజుల నుంచి చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే జాతర నేపథ్యంలో సాగే ఓ పాటను సుమారు వెయ్యి మంది డ్యాన్సర్లతో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటతో పాటు అక్కడ భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ క్రమంలోనే షూటింగ్‌లో అల్లు అర్జున్‌కు తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిందని సమాచారం. దీంతో పుష్ప 2 చిత్రీకరణను డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా భారీ కాస్ట్యూమ్స్‌తో ఫైటింగ్ సన్నివేశంలో అల్లు అర్జున్ రిస్క్ చేయడం వల్లే ఆయనకు ఈ ఆరోగ్య సమస్య ఎదురైందని అంటున్నారు.
పుష్ప 2 సినిమా షూటింగ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతున్నందున వెన్ను నొప్పి ఉన్న కూడా చిత్రీకరణ కొనసాగిద్దామని అల్లు అర్జున్‌ను సుకుమార్ కోరాడట. కానీ, అందుకు బన్నీ మాత్రం అంగీకరించలేదని టాక్ నడుస్తోంది. దీంతో పుష్ప 2 సినిమా షూటింగ్‌ను టెంపరరీగా ఆపేసినట్లు వినికిడి. ఒకవేళ షూటింగ్ కొనసాగిస్తే వెన్ను నొప్పి మరింత ఎక్కువై ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని బ్రేక్ తీసుకుందామని సుక్కు అన్నాడట.
అల్లు అర్జున్ వెన్ను నొప్పి కారణంగా పుష్ప 2 షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న పుష్ప 2 సినిమాను ఆగస్ట్ 15, 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.