తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ugram Making Video: 'ఉగ్రం'తో ఉర్రూతలూగిస్తున్న అల్లరి నరేష్.. పవర్‌ఫుల్ ఫైట్ మేకింగ్ వీడియోపై వచ్చేసింది

Ugram Making Video: 'ఉగ్రం'తో ఉర్రూతలూగిస్తున్న అల్లరి నరేష్.. పవర్‌ఫుల్ ఫైట్ మేకింగ్ వీడియోపై వచ్చేసింది

19 April 2023, 13:40 IST

    • Ugram Making Video: అల్లరి నరేష్ నటిస్తున్న సరికొత్త చిత్రం ఉగ్రం. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. పవర్ ఫుల్ పోలీసు అధికారి పాత్ర చేస్తున్న అల్లరి నరేష్.. ఈ సినిమా కోసం బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది.
ఉగ్రంలో అల్లరి నరేష్ ఇంటెన్స్ లుక్
ఉగ్రంలో అల్లరి నరేష్ ఇంటెన్స్ లుక్

ఉగ్రంలో అల్లరి నరేష్ ఇంటెన్స్ లుక్

Ugram Making Video: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నాంది సక్సెస్‌తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు ఓ ఫార్మాట్‌లో మూవీస్ చేసుకుంటూ వెళ్లిన మన అల్లరోడు.. అప్పటి నుంచి ట్రాక్ మార్చి కంటెంట్ ఉన్న కథలకు ఓటేస్తున్నాడు. ప్రస్తుతం ఉగ్రం అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇది కూడా నాంది లాంటి విజయాన్ని అతడికి అందించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకుల ముందుకు రాగా.. తాజాగా మరో అప్డేట్‌ను విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నట్లు ఇప్పటికే టీజర్ ద్వారా తెలిసిందే. దీంతో ఈ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఉగ్రం సెట్స్‌లో అల్లరి నరేష్ పోరాటాలు, అందుకు సంబంధించిన విజువల్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా అడవిలో జరిగే ఓ సీన్ కోసం బాగా కష్టపడినట్లు ఈ వీడియోను చూస్తే తెలుస్తోంది. కెరీర్‌లో తొలిసారిగా మన నరేష్ ఇంటెన్స్ పాత్రలో కనిపించాడు.

ఉగ్రం.. పేరుకు తగ్గట్లుగానే అల్లరి నరేష్ లుక్, బాడీ లాంగ్వేజ్ సీరియస్‌గా ఉంది. ఇంటెన్స్ లుక్‌తో విలన్ల భరతం పట్టడమే కాకుండా, తనకు అలవాటు లేని పంచ్ డైలాగ్స్‌ను అదిరిపోయేలా చెప్పాడు. టీజర్‌ను గమనిస్తే అల్లరి నరేష్ పోలీసు అధికారి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విజయ్ కనకమేడల అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 5న ప్రపంచ వ్యాప్తంగాప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం