Ali Meets Chiranjeevi: మెగాస్టార్‌ను కలిసి కూతురు వివాహానికి ఆహ్వానించిన అలీ దంపతులు
10 November 2022, 16:41 IST
- Ali Meets Chiranjeevi: టాలీవుడ్ కమెడియన్ అలీ.. మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన కుమార్తే వివాహానికి మెగాస్టార్‌ను స్వయంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
చిరంజీవిని కలిసిన అలీ దంపతులు
Ali Meets Chiranjeevi: ప్రముఖ హాస్య నటుడు అలీ ఇంట మరికొన్ని రోజుల్లో శుభకార్యం జరగనుంది. ఆయన పెద్ద కుమార్తే ఫాతిమా నిశ్చితార్థం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. త్వరలో ఆమె వివాహం జరగనుండగా.. అలీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. సతీ సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్లిన ఆయన.. తన కూతురు ఫాతిమా వివాహానికి స్వయంగా ఆహ్వానించారు. ఈ మేరకు చిరుకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కాసేపు అక్కడే గడిపిన మెగాస్టార్ సరదాగా మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న అలీ.. ఆయనకు తన కుమార్తే వివాహ ఆహ్వాన పత్రిక తొలి ప్రతిని అందజేశారు. పెళ్లి పత్రిక స్వీకరించిన జగన్.. తప్పకుండా వివాహానికి వస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి ఆయన నివాసానికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్‌ను హైదరాబాద్ రాజ్ భవన్‌లో కలిసి వారిని కూడా అలీ ఆహ్వానించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్‌కు కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఇటీవలే అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియామితులయ్యారు. తనకు ఆ పదవీని ఇవ్వడంపై అలీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి జగన్‌తో తన ప్రయాణం కొనసాగిందని, ఈ సందర్భంగా అలీ గుర్తు చేసుకున్నారు. పార్టీలో చేరి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన సమయంలో కూడా జగన్‌ను కలిసినప్పుడు అండగా ఉంటానని, తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
టాపిక్