తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhanda Hindi Trailer: అఖండ హిందీ ట్రైలర్‌ చూశారా?

Akhanda Hindi Trailer: అఖండ హిందీ ట్రైలర్‌ చూశారా?

Hari Prasad S HT Telugu

05 January 2023, 17:09 IST

    • Akhanda Hindi Trailer: అఖండ హిందీ ట్రైలర్‌ వచ్చింది. తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా.. జనవరి 20న హిందీలోనూ రిలీజ్‌ కాబోతోంది. దీంతో ట్రైలర్‌ను గురువారం (జనవరి 5) రిలీజ్‌ చేశారు.
అఖండ మూవీలో బాలకృష్ణ
అఖండ మూవీలో బాలకృష్ణ

అఖండ మూవీలో బాలకృష్ణ

Akhanda Hindi Trailer: నట సింహం బాలకృష్ణ కెరీర్‌లో అతి పెద్ద సక్సెస్‌ సాధించిన మూవీ అఖండ. 2021లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సంచలన వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా హిందీలోనూ రాబోతోంది. తెలుగులో వచ్చిన మూవీని డబ్ చేసి నార్త్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను గురువారం (జనవరి 5) రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

అయితే అఖండ మూవీ అఖండ విజయం సాధించడానికి బాలయ్య బాబు యాక్టింగ్‌తోపాటు అతని డైలాగులు కూడా కీలకపాత్ర పోషించాయి. ఇప్పుడీ హిందీ ట్రైలర్‌ అదే మిస్‌ అయిందని చెప్పొచ్చు. బాలయ్య మంచి బేస్‌ వాయిస్‌లో మాస్‌ డైలాగ్స్‌ చెబుతుంటే.. థియేటర్లు దద్దరిల్లుతాయి. కానీ ఈ హిందీ ట్రైలర్‌లో బాలకృష్ణకు డబ్బింగ్‌ చెప్పిన వాయిస్‌లో అసలు బేసే లేదు.

దీంతో అఖండ మూవీలోని ఆ ఫీల్‌ మిస్‌ అవుతోంది. ఈ మూవీలో బాలయ్య డ్యుయల్‌ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఒక పాత్రలో అతడు అఘోరా రూపంలో కనిపించాడు. మామూలుగానే బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి. అఖండలో అయితే అది మరో రేంజ్‌లో ఉంటుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌ కావడంతో అతని మార్క్‌ టేకింగ్‌, డైలాగ్స్‌ అఖండలో కనిపిస్తాయి.

తెలుగులో ఈ సినిమా చూసిన వాళ్లు హిందీలో ట్రైలర్‌ను జీర్ణించుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఇందులోని మాస్‌, యాక్షన్‌ సీన్స్‌ నార్త్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయేమోగానీ.. ఒరిజినాలిటీని మాత్రం వాళ్లు మిస్‌ అవుతారనడంలో సందేహం లేదు.

అఖండ సినిమా 2021, డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 85 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న ఈ సినిమా ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ రెండో తెలుగు సినిమాగా నిలిచింది. బాల‌కృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

త‌న కుటుంబానికి ఎదురైన ఆప‌ద‌ను అఖండ అనే అఘొరా ఎలా ఎదురించాడ‌నే పాయింట్‌కు యాక్ష‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను అఖండ‌ సినిమాను తెర‌కెక్కించాడు. అఘోరా పాత్ర‌లో బాల‌కృష్ణ త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా క‌నిపించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం