Akhanda in Hindi: హిందీలో రిలీజ్‌ కానున్న అఖండ-akhanda in hindi to release on january 20th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhanda In Hindi: హిందీలో రిలీజ్‌ కానున్న అఖండ

Akhanda in Hindi: హిందీలో రిలీజ్‌ కానున్న అఖండ

Hari Prasad S HT Telugu
Jan 04, 2023 10:28 PM IST

Akhanda in Hindi: హిందీలో రిలీజ్‌ కానుంది బాలకృష్ణ నటించిన అఖండ మూవీ. ఓవైపు తెలుగులో బాలయ్య వీర సింహారెడ్డి రిలీజ్‌ కానుండగా.. మరోవైపు అతని సూపర్‌ హిట్‌ మూవీ అఖండ హిందీలో రాబోతుండటం విశేషం.

అఖండ మూవీలో బాలకృష్ణ
అఖండ మూవీలో బాలకృష్ణ

Akhanda in Hindi: బాలకృష్ణ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమాల్లో అఖండ ఒకటి. ఈ సినిమా ఊహించిన దాని కంటే కూడా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణలోని మరో రూపాన్ని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాధించిన మూవీగా అఖండ నిలిచింది.

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రిలీజ్‌ కాబోతోంది. ఆర్ఆర్‌ఆర్‌ మూవీని హిందీలో రిలీజ్‌ చేసిన పెన్‌ మూవీసే ఈ అఖండను కూడా నార్త్‌లో రిలీజ్‌ చేయబోతోంది. జనవరి 20న హిందీలో అఖండి రిలీజ్‌ కానుంది. సౌత్‌ నుంచి మాస్‌ మూవీస్‌కు నార్త్‌లో మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అఖండకు కూడా అలాంటి ఆదరణే లభిస్తుందని మేకర్స్‌ ఆశతో ఉన్నారు.

అఖండ హిందీ ట్రైలర్‌ గురువారం (జనవరి 5) రిలీజ్‌ కానుంది. అఖండ సినిమా 2021, డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 85 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న ఈ సినిమా ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ రెండో తెలుగు సినిమాగా నిలిచింది. బాల‌కృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

త‌న కుటుంబానికి ఎదురైన ఆప‌ద‌ను అఖండ అనే అఘొరా ఎలా ఎదురించాడ‌నే పాయింట్‌కు యాక్ష‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను అఖండ‌ సినిమాను తెర‌కెక్కించాడు. అఘోరా పాత్ర‌లో బాల‌కృష్ణ త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా క‌నిపించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం