Akhanda Sequel: అఖండ సీక్వెల్ క‌న్ఫార్మ్ చేసిన బాల‌కృష్ణ‌-balakrishna confirms akhanda sequel at iffi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhanda Sequel: అఖండ సీక్వెల్ క‌న్ఫార్మ్ చేసిన బాల‌కృష్ణ‌

Akhanda Sequel: అఖండ సీక్వెల్ క‌న్ఫార్మ్ చేసిన బాల‌కృష్ణ‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 27, 2022 02:38 PM IST

Akhanda Sequel: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ గ‌త ఏడాది టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.ఈ సినిమా సీక్వెల్ రాబోతున్న‌ట్లు బాల‌కృష్ణ ప్ర‌క‌టించారు.

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

Akhanda Sequel: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌పై ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో(ఇఫీ)లో బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. అఖండ సీక్వెల్‌కు సంబంధించి క‌థ సిద్ధ‌మైన‌ట్లు తెలిపాడు. స‌రైన టైమ్ చూసి సీక్వెల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని అన్నాడు. వ‌చ్చే ఈ ఏడాది ఈ సీక్వెల్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు బాల‌కృష్ణ పేర్కొన్నాడు.

ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో(ఇఫీ)లో ఇండియ‌న్ ప‌నోర‌మా కేట‌గిరీలో ఇటీవ‌ల అఖండ సినిమాను స్క్రీనింగ్ జ‌రిగింది. ఈ ప్రీమియ‌ర్‌కు బాల‌కృష్ణ‌తో పాటు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అఖండ సీక్వెల్‌ను బాల‌కృష్ణ అనౌన్స్ చేశాడు.

అఖండ సినిమా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద 85 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న ఈ సినిమా 2021లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ రెండో తెలుగు సినిమాగా నిలిచింది. బాల‌కృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

త‌న కుటుంబానికి ఎదురైన ఆప‌ద‌ను అఖండ అనే అఘొరా ఎలా ఎదురించాడ‌నే పాయింట్‌కు యాక్ష‌న్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడించి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను అఖండ‌ సినిమాను తెర‌కెక్కించాడు. అఘోరా పాత్ర‌లో బాల‌కృష్ణ త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు.

శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా క‌నిపించింది. కాగా ప్ర‌స్తుతం బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌.