AK63: మరో సినిమాకు ఓకే చెప్పిన అజిత్ కుమార్.. దర్శకుడు ఎవరంటే..
21 January 2024, 20:19 IST
- AK63: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తర్వాతి చిత్రానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. అజిత్‍కు ఇది 63వ మూవీగా ఉండనుంది. ప్రస్తుతం విదా ముయర్చి చేస్తున్న అజిత్.. నెక్ట్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
అజిత్ కుమార్
AK63: తమిళ సీనియర్ స్టార్ హీరో అజిత్ కుమార్.. గతేడాది తునివూ మూవీతో మంచి హిట్ కొట్టారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ హీస్ట్ సినిమా విజయం సాధించింది. అజిత్ కుమార్ ప్రస్తుతం విదా ముయర్చి చిత్రం చేస్తున్నారు. మగిళ్ తురుమేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఏప్రిల్‍లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఈ తరుణంలో అజిత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
అజిత్ కుమార్ తన 63వ సినిమా (AK63)కు ఓకే చెప్పారని సంబంధిత వర్గాలు హెచ్‍టీకి తెలిపాయి. మార్క్ ఆంటోనీ ఫేమ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఏకే63కు దర్శకత్వం వహించనున్నారు. అధిక్ రవిచంద్రన్‍తో అజిత్ మూవీ చేయనున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఇది ఖరారైనట్టు హెచ్‍టీకి సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
“అవును, ఏకే63 చిత్రానికి మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ సైన్ చేశారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది” అని ఆ వర్గాలు చెప్పాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్‍లో అజిత్ - అధిక్ రవిచంద్రన్ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
మార్క్ ఆంటోనీ సినిమాతో గతేడాది బ్లాక్‍బాస్టర్ కొట్టారు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. విశాల్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ సూపర్ హిట్ అయింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. విశాల్ కెరీర్లో తొలి రూ.100కోట్ల మూవీగా నిలిచింది.
ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్, యాక్షన్, కామెడీని కలగలిపి మార్క్ ఆంటోనీ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్‍కు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో విశాల్, ఎస్‍జే సూర్య ఇద్దరూ డ్యుయల్ రోల్ చేశారు. మార్క్ ఆంటోనీతో హిట్ అందుకున్న అధిక్ ఏకంగా.. ఇప్పుడు అజిత్‍తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.
ప్రస్తుతం విదా ముయర్చి షూటింగ్‍లో అజిత్ కుమార్ బిజీగా ఉన్నారు. అజర్‌బైజాన్‍లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్‍లో అజిత్‍తో దిగిన ఫొటోలను ఇటీవలే ఫొటోలు కూడా షేర్ చేశారు నటుడు ఆరవ్. విదా ముయర్చి చిత్రం ఏప్రిల్‍లో విడుదల కానుంది. ఆ నెలాఖరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విదా ముయర్చి చిత్రంలో అర్జున్ సర్జా కీలకపాత్ర పోషిస్తున్నారు. అజిత్ సరసన హీరోయిన్‍గా త్రిష నటిస్తున్నారు. రెజీనా కసాండ్ర, అరవ్ కీరోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మరోవైపు, విదా ముయర్చి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వెర్షన్‍లలో విదా ముయర్చిని థియేట్రికల్ రన్ తర్వాత తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఇటీవలే ప్రకటించింది.
టాపిక్