Mark Antony OTT Trending: ఓటీటీలోనూ సత్తాచాటుతున్న మార్క్ ఆంటోనీ సినిమా.. సంతోషం వ్యక్తం చేసిన విశాల్-mark antony movie trending top on amazon prime video ott platform vishal delighted ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mark Antony Ott Trending: ఓటీటీలోనూ సత్తాచాటుతున్న మార్క్ ఆంటోనీ సినిమా.. సంతోషం వ్యక్తం చేసిన విశాల్

Mark Antony OTT Trending: ఓటీటీలోనూ సత్తాచాటుతున్న మార్క్ ఆంటోనీ సినిమా.. సంతోషం వ్యక్తం చేసిన విశాల్

Mark Antony OTT Trending: మార్క్ ఆంటోనీ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతోంది. ఈ తరుణంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు హీరో విశాల్.

Mark Antony OTT Trending: ఓటీటీలోనూ సత్తాచాటుతున్న మార్క్ ఆంటోనీ సినిమా.. సంతోషం వ్యక్తం చేసిన విశాల్

Mark Antony OTT Trending: గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ మంచి హిట్ సాధించింది. సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‍ తెచ్చుకొని మంచి కలెక్షన్లను రాబట్టింది. హీరో విశాల్, ఎస్‍జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్‍గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్నమైన కథాంశాల కలబోతతో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. దీంతో అంచనాలకు మించి ఈ సినిమా హిట్ అయింది. అక్టోబర్ 13న మార్క్ ఆంటోనీ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది.

అక్టోబర్ 13వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది మార్క్ ఆంటోనీ సినిమా. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్క్ ఆంటోనీ.. ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో విశాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు (అక్టోబర్ 14) ఓ ట్వీట్ చేశారు.

“ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా మార్క్ ఆంటోనీ అదరగొట్టడం చాలా సంతోషంగా ఉంది. అమెజాన్ ప్రైమ్‍లో నంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. అన్‍లిమిటెడ్ ఎంటర్‌టైన్‍మెంట్‍ను ముఖ్యంగా నా ఫేవరెట్ సిల్క్ స్మితను మీ ఇంట్లో నుంచే ఎంజాయ్ చేయండి” అని విశాల్ ట్వీట్ చేశాడు. మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విష్ణు ప్రియ గాంధీ పోషించారు. ఈ సినిమాలో ఆమె మేకోవర్ చూసేందుకు అచ్చం సిల్క్ స్మితలాగే ఉంది.

మార్క్ ఆంటోనీ చిత్రంలో డ్యుయల్ రోల్ చేశారు విశాల్. రితూ వర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్, సెల్వరాఘవన్, అభినయ, మహేంద్ర, నిళగల్ రవి, రెడిన్ కింగ్‍స్లే ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మినీ స్టూడియో పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.

మార్క్ ఆంటోనీ సినిమా రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. విశాల్ కెరీర్లో ఇదే తొలి రూ.100కోట్ల చిత్రంగా ఉంది.