Aishwarya Rajesh | 'డ్రైవర్ జమున'గా రానున్న ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ రిలీజ్
05 May 2022, 20:37 IST
- ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం డ్రైవర్ జమున. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు మేకర్స్.
ఐశ్వర్య రాజేశ్
వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తెలుగమ్మాయి అయినప్పటికీ.. కోలీవుడ్‌లో మంచి పాపులారిటీని సంపాదించింది. అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్య తెలుగులోనూ అడపా దడపా చిత్రాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహిళా ప్రధాన పాత్రలున్న సినిమాలకు పేరుగాంచిన ఐశ్వర్య రాజేశ్.. మరోసారి లేడి ఓరియెంటెడ్ చిత్రంతో రాబోతుంది. ఆ సినిమానే డ్రైవర్ జమున. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఐశ్వర్య రాజేశ్ తీక్షణంగా చూస్తూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించింది. ఎదో విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు చూపించే భావోద్వేగాన్ని ప్రదర్శించినట్లు ఈ పోసటర్ ఉంది. ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషిస్తోంది.
ఈ సినిమా పూర్తి స్థాయిలో రోడ్ మూవీగా తెరకెక్కుతోంది. ఎన్నో మలుపులు, ట్విస్టులతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. పూర్తి థ్రిల్లర్ జోనర్‌లో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజు వేచి చూడాలి.
ఈ సినిమాను 18 రీల్స్ బ్యానర్‌పై ఎస్‌పీ చౌదురీ నిర్మించారు. అంతేకాకుండా పీ కిన్స్‌లిన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నిర్మాణ మొదటి దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ అనవదించనున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
టాపిక్