తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urike Urike Song Promo: హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. మెలోడీ సాంగ్ అదిరిపోయేలా ఉంది

Urike Urike Song Promo: హిట్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. మెలోడీ సాంగ్ అదిరిపోయేలా ఉంది

09 November 2022, 7:16 IST

google News
    • Urike Urike Song Promo: అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం హిట్ ది సెకండ్ కేస్. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ఉరికే ఉరికే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
ఉరికే ఉరికే సాంగ్ ప్రోమో విడుదల
ఉరికే ఉరికే సాంగ్ ప్రోమో విడుదల

ఉరికే ఉరికే సాంగ్ ప్రోమో విడుదల

Urike Urike Song Promo: ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ పాడితే చాలు ఆ సాంగ్ సూపర్ హిట్టయిపోతుంది. ఆయన గొంతులో మధురిమ.. లేక బాగుండే పాటలు ఆయన దగ్గరకు వెళ్తున్నాయో తెలియదు.. కానీ మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్స్‌ అన్నీ సిద్ శ్రీరామ్‌ను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ గాయకుడికి మరో అద్బుత సాంగ్ దొరికింది. అడివి శేష్ హీరోగా రాబోతున్న హిట్: ది సెకండ్ కేస్ చిత్రంలో ఉరికే ఉరికే అనే సాంగ్ ఆలపించారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమో విడుదలైంది.

పాట వింటుంటేనే మంచి మెలోడీ ఫీల్ కలిగించింది. అందులోనూ సిద్ శ్రీరామ్ తన అద్భుత గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. హీరో, హీరోయిన్లుగా నటించిన అడివి శేష్, మీనాక్షి చౌదరీ కెమిస్ట్రీ అయితే ఆకట్టుకుంటోంది. ప్రోమోనే ఇలా ఉంటే.. కచ్చితంగా ఫుల్ సాంగ్ వేరే స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. అందమైన విజువల్స్, అందుకు తగినట్లుగా ఉన్న మ్యూజిక్.. మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుంది. సిద్ శ్రీరామ్‌తో పాటు రమ్యా బెహ్రా పాడారు. ఈ పాటకు ఎంఎం శ్రీ లేఖ సంగీతాన్ని అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు.

సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడిన ఈ పాట ఫుల్ సాంగ్ కోసం శ్రోతలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పూర్తి సాంగ్ ఈ నెల 10న అంటే గురువారం విడుదల కాబోతుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ కేడీ అనే పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

తదుపరి వ్యాసం